అన్వేషించండి
Hero Karthikeya : వివాహానంతరం స్వామివారి దర్శించుకోవడం ఆనందంగా ఉందన్న నటుడు కార్తికేయ
తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు కార్తికేయ దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. నూతనంగా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన కార్తికేయ తిరుమలలో సందడి చేయడం విశేషం.. దర్శన అనంతరం కార్తికేయ మీడియాతో మాట్లాడుతూ.. వివాహం అనంతరం కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.. జనవరి మాసంలో తమిళ నటుడు అజిత్ తో కలసి నటించిన చిత్రం విడుదల కానున్నట్లు తెలిపారు..
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
కరీంనగర్
జాబ్స్





















