అన్వేషించండి
Tirupati 2 Year Old Kidnap: తల్లిదండ్రుల పక్కనే పడుకున్నాడు, అర్ధరాత్రి కిడ్నాప్
తిరుపతి బస్టాండ్ లో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. శ్రీవారి దర్శనార్థం చెన్నై నుంచి తిరుపతికి ఓ కుటుంబం చేరుకుంది. అర్ధరాత్రి బస్టాండ్ లో టికెట్ రిజర్వేషన్ కౌంటర్ వద్ద తల్లిదండ్రులతో పాటు నిద్రిస్తున్న రెండేళ్ల అరుళ్ మురుగన్ ను గుర్తుతెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు. అర్ధరాత్రి రెండు గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బస్టాండ్ లోని సీసీ ఫుటేజ్ పరిశీలించి నిందితుడ్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పిల్లాడు కిడ్నాప్ అవటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
ప్రపంచం
సినిమా





















