Chittoor Rains : భారీ వర్షాల కారణంగా తిరుపతిలో కుంగిపోతున్న ఇళ్ళు
చిత్తూరు జిల్లా వర్షాలు., వరదలతో హోరెత్తుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వాయుగుండాలు గండాలను తెచ్చి పెడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 66 మండలాల్లోని 126 గ్రామాలూ పూర్తిగా నీటి ప్రవాహానికి బంది అయ్యాయి. ఇక 6 నగరాలు వరద ముప్పునకు గురి అయ్యాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 6 పక్కా ఇళ్ళు కూలిపోయాయి. తిరుపతిలో శ్రీకృష్ణ నగర్ కాలనీలో మూడు దశాబ్దాల ఇంటిపై మూడు నెలల క్రితం మూడు అంతస్థుల భవనాన్ని నిర్మించారు. భారీ వర్షాల కారణంగా సింహభాగంలో ఉన్న ఇల్లు రెండు అడుగులు మేర కుంగిపోయింది. దీంతో ఆ భవనం మొత్తం పగుళ్లు రాగా ఇంట్లో నివసించే వ్యక్తులు బయటకు పరుగులు తీశారు. అది గుర్తించిన నగరపాలక సంస్థ వారికీ పరిహారం చెల్లించి పునరావాస కేంద్రాలకు తరలించి ఆ ఇంటిని కూలగొట్టారు..





















