అన్వేషించండి
నెల్లూరు జిల్లా సంగం వద్ద ఘోరప్రమాదం- ఐదుగురు గల్లంతు| ABP Desam
నెల్లూరు జిల్లా సంగం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో బీరపేరు వాగులో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 12 మంది ఉన్నట్టు సమాచారం. వారిలో ఏడుగురిని సురక్షితంగా కాపాడారు. ఐదుగురు వాగులో గల్లంతయ్యారు. వారికోసం గాలింపు జరుగుతోంది. ఆటోలో ఉన్న వారు ఆత్మకూరు నుంచి సంగం శివాలయంలో నిద్రచేయడానికి వెళ్తున్నారు. లారీ ఢీకొనడంతో ఆటో అదుపుతప్పి వాగులో పడిపోయింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్




















