సోమశిల గేట్లు ఎత్తి నీరు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గౌతమ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, కాకాణి పాల్గొన్నారు. గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు పెన్నా నది పోటెత్తి... సోమశిలకు భారీగా వరద నీరు చేరింది. అందుకే ఒక గేటు ఎత్తి నీరు విడుదల చేశారు. సోమశిల ప్రాజెక్ట్ ఆప్రాన్ మరమ్మతులపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మరమ్మతు పనులు త్వరలో మొదలు పెడతామని స్పష్టం చేశారు. సోమశిల ప్రాజెక్ట్ ఆప్రాన్ మరమ్మతు పనులు వీలైనంత త్వరలో మొదలు పెడతామని చెప్పారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. గతంలో వరుసగా మూడు సార్లు వరద నీటిని కిందకు విడుదల చేయాల్సి రావడంతో డౌన్ స్ట్రీమ్ ఆప్రాన్ ధ్వంసమైందని, దాని మరమ్మతులకోసం నిపుణుల కమిటీ వచ్చి పరిశీలించి వెళ్లిందని చెప్పారు. ఆప్రాన్ ధ్వంసమైనంత మాత్రాన సోమశిల డ్యామ్ కి నష్టం వాటిల్లే అవకాశమేమీ లేదని అన్నారు.
Sankranthi In Nellore: నెల్లూరులో సంక్రాంతి... ఐదు రోజుల పండుగ
Nellore Politics | నెల్లూరు లో వేడెక్కెతున్న పాలిటిక్స్
Donkey Milk Sales In Nellore: గాడిద పాలు ధర ఎంత..? అవి తాగితే లాభాలుంటాయా..?
Backward Clock | ముల్లు వెనక్కి తిరిగితే టైమ్ ఎలా తెలుస్తుంది..?
Clay Pots For Cooking: వంటకు ఎలాంటి పాత్రలు మేలు..? చిన్నారుల ప్రయోగం చూడండి ..!
Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్‌కు 6,455 మంది ఎంపిక!
Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్‌కు పేర్ని నాని కౌంటర్ !
Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?