(Source: ECI | ABP NEWS)
Somu Veerraju: కడప జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ నాయకుల పర్యటన
కడపజిల్లా నందలూరు లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జాతీయ కార్యదర్శి సత్యకుమార్ లు పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అక్కడి ప్రజలతో మాట్లాడారు. వరదలతో నష్టపోయిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడిన సోమువీర్రాజు..అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమన్నారు. వైసీపీ నేతలకు భయపడిన అధికారులు సరైన సమయం లో స్పందించలేదన్నారు. ఇలాంటి నష్టం గతంలో ఎప్పుడూ చూడలేదన్న సోము వీర్రాజు....నష్ట నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. చనిపోయిన వారి కి 5 లక్షలు మాత్రమే కేటాయించిన జగన్....విశాఖ లో మాత్రం కోటి రూపాయలు నష్టపరిహారం అందించారన్నారు. సీఎం సొంత జిల్లాలో కూడా ఇలా జరగటంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదన్నారు.





















