అన్వేషించండి
మంత్రి ఆదిమూలపు సురేష్ తన కూతురు పెళ్లిలో డ్యాన్స్ ....వీడియో వైరల్...
మంత్రి ఆదిమూలపు సురేష్ తన కూతురు పెళ్లిలో డ్యాన్స్ చేసి హంగామా చేశారు. ఆయన డ్యాన్స్ చూసినవారంతా ఫిదా అవుతున్నారు.మంత్రి సురేష్ కుమార్తె శ్రిష్టి వివాహం హైదరాబాద్‌లోని గోల్కొండ రిసార్ట్స్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహ కార్యక్రమంలో సై సినిమాలో పాటకు మంత్రి సురేష్ కూతురు శ్రిష్టితో కలిసి స్టెప్పులేశారు. దీంతో స్టేజ్ కింద ఉన్న ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు అందరు ఈలలు వేస్తూ ప్రోత్సహించడంతో ఇంకాస్త హుసారుగా స్టెప్పులు వేశారు. కుమార్తెకు డ్యాన్స్ లో పోటీ ఇచ్చేలా అదరగొట్టారు. ప్రస్తుతం మంత్రి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వ్యూ మోర్





















