JC Prabhakar Reddy comments on Perni Nani | పేర్ని నాని పై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్
మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యేలు దేవినేని అవినాష్, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిల పై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. లోకేష్ యాత్ర పెడితే అడ్డుకోవడమే కాకుండా మాట్లాడకుండా మైక్లు కూడా లాక్కున్నారని, చంద్రబాబు సీఎం అయ్యాక రివెంజ్ అనేది లేదు ఉంటే మీ పరిస్థితి ఏంటి అని వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు జేసీ ప్రభాకర్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతారా ? అని ప్రశ్నించారు ప్రభాకర్ రెడ్డి. వైసీపీ నేతలు మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మీరు పుణ్యాత్ములు, చంద్రబాబు సీఎం అయ్యాక రివెంజ్ అనేది లేదు ఉంటే మీ పరిస్థితి ఏంటి అని కామెంట్ చేసారు జేసీ ప్రభాకర్ రెడ్డి. నా భార్య పై 10కేసులు నా కోడలిపై రెండు కేసులు.. నా కొడుకు పై ఎన్నో కేసులు ఉన్నాయి... వైసీపీకి జనం వస్తున్నారు అంటున్నారు దమ్ముంటే తాడిపత్రికి రమ్మనండి చూద్దాం అని మండిపడ్డారు ప్రభాకర్ రెడ్డి.





















