CM Revanth Reddy on Telangana Emblem | రాజముద్ర మార్పుతో ఎవరికి రాజకీయ ప్రయోజనం..?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కాకతీయ కళాతోరణం, చార్మినార్ లతో కలిపి ఓ రాజముద్రను తయారు చేసింది కేసీఆర్ సర్కార్. ఐతే.. తెలంగాణలో ప్రజా పాలన కాదు దొరల పాలన నడుస్తోంది. ఆ దొరల గడీలకు నిదర్శనమే ఈ రాజకీయ గుర్తులు. అందుకే.. తనకు అవకాశమొస్తే ఈ చిహ్నాన్ని మార్చేస్తానని రేవంత్ రెడ్డి పదేళ్ల కిందటే చెప్పారు. కానీ, దానిని ఎవరూ పెద్దగా పట్టించుకోలదు. కానీ, రేవంత్ రెడ్డికి ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి తన మార్క్ చూపిస్తున్నారు. కాకతీయ కళాతోరణం, చార్మినార్ బొమ్మలు తీసేసి... వరి కంకులు, అమరవీరుల స్థూపంతో సరికొత్త లోగోకు శ్రీకారం చుట్టారు. త్వరలోనే దీనిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
ఇది ఇలా ఉంటే.. జయ జయహే తెలంగాణ పాటను రాష్ట్ర గేయంగా కేసీఆర్ సర్కార్ అధికారికంగా గుర్తించకోపోయినప్పటికీ..ఉద్యమ సమయంలో దీనిని కేసీఆరే జనాల్లోకి తీసుకెళ్లారు. ఐతే.. రాష్ట్ర గేయంగా దీనిని ఆమోదించాలంటే కొన్ని పదాలు మార్చాలని అందెశ్రీని కేసీఆర్ కోరారట. దానికి అందెశ్రీ ఒప్పుకోకపోవడంతో వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చి.. రాష్ట్ర గేయం ఆమోదానికి నోచుకోలేదు. కేసీఆర్ కు శత్రువు రేవంత్ రెడ్డికి ఎప్పుడు మిత్రడే. ఇదే ఫార్మూలా అందె శ్రీ విషయంలోనూ జరిగింది. అందెశ్రీని నెత్తిన పెట్టుకున్న రేవంత్ రెడ్డి.. జూన్ 2న రాష్ట్ర గేయంగా జయ జయహే తెలంగాణను జాతికి అంకితం చేయబోతున్నారు. అందుకోసం ఆస్కార్ విజేత ఐనా మ్యూజిక్ డైరెక్టర్ MM కీరవాణితో బాణీలు సమకూర్చుతున్నారు. కీరవాణి ఆంధ్ర ప్రాంతం వాడు.. మన తెలంగాణ పాట మళ్లీ ఆంధ్రోళ్ల చేతులో పెట్టుడేంది అంటున్నప్పటికీ.. రేవంత్ రెడ్డి అవేవి పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు. త్వరలోనే తెలంగాణ తల్లి విగ్రహాంలోనూ మార్పులు చేయడానికి సిద్ధమయ్యారు. ఇలా తెలంగాణ ఉద్యమం అంటే కేసీఆర్ కాదు.. ఆయన చెప్పింది వేరు జనాల మనసుల్లో ఉంది వేరు అంటూ.. ఇలాంంటి కీలకమైన గుర్తింపుల్లో కేసీఆర్ ముద్రను చెరిపివేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.