వయోవృద్ధులకు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 1 నుంచి వ్యద్ధాప్య పింఛన్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పింఛన్ల మొత్తాన్ని రూ.2,500కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం పింఛను దారులకు రూ.2,250 అందిస్తోంది. కలెక్టర్లు, అధికారులతో జరిగిన సమావేశంలో సీఎం జగన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇంటింటికీ గ్రామ, వార్డు వాలంటీర్లు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నెల ఒకటో తేదీన వైఎస్సార్ సామాజిక పింఛన్లు, వికలాంగ పెన్షన్లు, దీర్ఘకాలిక రోగులకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 61,72,964 మందికి పింఛన్లు అందిస్తున్నారు. ఇందుకు కోసం సుమారు రూ.1,420 కోట్లను ప్రతీ నెల ప్రభుత్వం విడుదల చేస్తుంది. వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి డబ్బులు పంపిణీ చేస్తారు. నెలలో మొదటి 5 రోజుల వ్యవధిలో నూరుశాతం పెన్షన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యం. గతంలో సీఎం జగన్ అసెంబ్లీలో పింఛన్ల పెంపుపై కీలక ప్రకటన చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా పింఛన్లు పెంచుతామని ఇచ్చిన హామీని నెరవేరుస్తామన్నారు. పింఛన్‌ను రూ.2 వేల నుంచి రూ.2250కు పెంచామన్నారు. తర్వాత 2,250 నుంచి రూ.2500, ఆ తర్వాత రూ.2,500 నుంచి రూ.2,750, మళ్లీ మళ్లీ రూ.2,750 నుంచి రూ.3 వేలకు పింఛన్ పెంచుతామని సీఎం తెలిపారు.
CM Jagan Slams Chandrababu TDP Manifesto: అన్ని పార్టీల మేనిఫెస్టో కలిపేశారని విమర్శ
Flexis Controversy In Bhimavaram Janasena vs YSRCP: ముదురుతున్న ఫ్లెక్సీల వివాదం
YCP MLA Rachamallu Sivaprasad Reddy Falls: కర్రసాము చేస్తూ కిందపడ్డ ఎమ్మెల్యే రాచమల్లు
బ్లౌజ్ డిజైనరీ వేర్ లో తిరుమల శ్రీవారు
Vijayawada MP Kesineni Nani : మైలవరంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తో కేశినేని | DNN | ABP
Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!
CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు
YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !