ABP Ground Report on Punganur Issue | పుంగనూరు వివాదంపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్ | ABP Desam
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం ఎర్రాతివారిపల్లెలో భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ ప్రచారం నిర్వహిస్తుండగా వారిని వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో బీసీవై పార్టీ నాయకులకు, వైఎస్సార్సీపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. వివాదం పెద్దది అవటంతో బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్‌ను సదుం పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ ముందే బీసీవై పార్టీ వాహనాలపై వైసీపీ కార్యకర్తలు రాళ్లదాడికి దిగి ఆ పార్టీ ప్రచార రథానికి నిప్పు అంటించారు. ఈ మొత్తం ఘటనపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్.





















