Dal Lake Boating in Srinagar Vlog | శ్రీనగర్ లోని దాల్ సరస్సులో బోటింగ్... చూస్తే మతి పోవాల్సిందే
Dal Lake Boating in Srinagar Vlog | జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ కు టూరిస్ట్ హబ్ ఆఫ్ ఇండియా లిస్టులో ఒక ముఖ్యమైన స్థానం దక్కుతుంది. దాల్ లేక్‌ను "శ్రీనగర్ జ్యువెల్" అని కూడా అంటారు. మరి ... ఆ లేక్ విశేషాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం..!
జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ కు టూరిస్ట్ హబ్ ఆఫ్ ఇండియా లిస్టులో ఒక ముఖ్యమైన స్థానం దక్కుతుంది. దాల్ లేక్‌ను "శ్రీనగర్ జ్యువెల్" అని కూడా అంటారు. సంవత్సరం లో సుమారు 11 నెలల పాటు ఇక్కడ బోటింగ్ చేసేందుకు బోటు డ్రైవర్లు టూరిస్టులను షికార యాత్రకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంటారు. దాల్ లేక్ చుట్టూ ఉన్న జబర్వాన్ పర్వతశ్రేణి (Zabarwan Range), పీర్ పంజల్ మోంటైన్ రేంజ్, శంకరాచార్య మోంటైన్ రేంజ్ అందాలు టూరిస్టులకు మరపురాని జ్ఞాపకాలను అందిస్తాయి. దాల్ సరస్సుపై ఉన్న బోట్ హౌసెస్ చూస్తే, చుట్టూ ఉన్న అందాలను వీక్షించ వచ్చు. దాల్ సరస్సు పరిసరాల్లో షికార చేయాలంటే, ఒక్క గంటకు రూ. 1200 వరకు ఛార్జ్ చేస్తారు. దాల్ లేక్ చుట్టూ చిరు వ్యాపారులు టూరిస్టులకు కావలసిన తినుబండారాలను అందుబాటులో ఉంచుతారు. గ్రిల్డ్ పనీర్, చికెన్, పండ్లు, కవా, టీ వంటివి అందుబాటులో ఉంటాయి.దాల్ లేక్‌లో ఫ్లోటింగ్ హౌస్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఒక్క రాత్రి గడపాలంటే సుమారు రూ. 1600 నుండి రూ. 3000 వరకు ఛార్జ్ చేస్తారు. హౌస్‌బోట్స్ మరియు షికారాలు ప్రత్యేకంగా నిర్మించబడ్డాయి, వాటి అలంకరణలు కాశ్మీరీ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ప్రతి హౌస్‌బోట్ విభిన్నంగా ఉంటుంది.