News
News
X

Bandi Sanjay Exclusive Interview | కేసిఆర్ కు పాలిటిక్స్ అంటే బఠానీలు. మనుగోడు మాదే. | ABP Desam

By : ABP Desam | Updated : 09 Aug 2022 10:42 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

రెట్టించిన ఉత్సాహంతో మూడో విడత పాదయాత్ర కొనసాగుతుంది నల్గొండ జిల్లాలో పర్యటిస్తుంటే ఒళ్ళు పులకరించిపోతుంది. ఫ్లోరైడ్ సమస్యతో పాటు అనేక సమస్యలతో నల్గొండ జిల్లా వాసులు ఇబ్బందులు పడుతున్నారు. బిజెపి గ్రామీణ ప్రాంతాల్లో బలంగా ఉంది అని చెప్పడానికి ఈ మూడో విడత పాదయాత్ర ఉదాహరణ. బిజెపిని భద్రం చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. బీరు బిర్యానీ కోసం జనం రావడం లేదు స్వచ్ఛందంగా వస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి సంవత్సర కాలం పదవిని వదులుకొని వస్తుండు మునుగోడు అభివృద్ధి కోసం రాజీనామా చేశాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదు సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇబ్బంది పడుతున్నారు మునుగోడు పరిస్థితి మిగతా చోట్ల ఉంటుంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ పై తిరగబడే రోజు దగ్గరకు వచ్చింది. మరో 13 మంది ఆలోచిస్తున్నారు. కేసీఆర్ మీద నమ్మకం పోయింది. ఆయనది కుటుంబ పాలన ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాడు. ఆయన ఒక విశ్వాసఘాతకుడు. ప్రజలు సీఎం కేసీఆర్ కుటుంబాన్ని అసహ్యించుకుంటున్నారు. శ్రీలంక లాగానే తెలంగాణ కూడా అవుతుందని ప్రజలు అనుకుంటున్నారు. బిజెపి ప్రశ్నించకుండా ఉంటే మూడు నెలలకు ఒకసారి జీతాలు ఇచ్చే పరిస్థితి ప్రస్తుతం ఉన్నది. రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసింది. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తప్పు తెలుసుకుంటున్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు బిజెపికి లోకి రాకుండా కేసీఆర్ జిమ్మిక్కులు చేస్తున్నారు. వారిని మభ్యపెడుతున్నాడు .మేము ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధమే. పాలన మీద ప్రజల మీద దృష్టి పడకూడదని ఉప ఎన్నికలతో సీఎం కేసీఆర్ టైం పాస్ చేస్తున్నాడు. మునుగోడు లో బిజెపి గెలుస్తుంది. మునుగోడు ప్రజలు బిజెపికి పట్టం కట్టాలి, లేదంటే సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే పడుకుంటాడు. టిఆర్ఎస్ పార్టీకి గర్వం పెరుగుతుంది. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ లేదు. ఓట్ల కోసం సీట్ల కోసం బిజెపి నాయకులు పనిచేయరు. ప్రజల్లో మంచి పేరు ఉన్న నాయకులకు ఎవరు వచ్చిన ఆహ్వానిస్తాం. సముచిత స్థానం ఇస్తాం. త్వరలోనే మునుగోడుకు నిధులు పారబోతున్నాయి. టిఆర్ఎస్ పార్టీ మునుగోడులో ఒక్కొక్క ఓటుకు 30000 పంచబోతుంది. మూసీ నది నీటిని కేసీఆర్ తాగించడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ ఏబీపీ దేశం ఇన్ పుట్ ఎడిటర్ గోపరాజుకు ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నారు.

సంబంధిత వీడియోలు

CM Jagan allocated 1 Crore for Child Honey|హాని వైద్యానికి రూ. కోటి కేటాయించిన సీఎం జగన్ | DNN | ABP Desam

CM Jagan allocated 1 Crore for Child Honey|హాని వైద్యానికి రూ. కోటి కేటాయించిన సీఎం జగన్ | DNN | ABP Desam

Mahesh Bhagwat Interview : హయత్ నగర్ లో 2కోట్ల 80 లక్షల విలువైన గంజాయి సీజ్ | ABP Desam

Mahesh Bhagwat Interview : హయత్ నగర్ లో 2కోట్ల 80 లక్షల విలువైన గంజాయి సీజ్ | ABP Desam

Utnoor Gond Fort : గుప్త నిధుల కోసం గోండుల కోటకు తూట్లు | DNN | ABP Desam

Utnoor Gond Fort : గుప్త నిధుల కోసం గోండుల కోటకు తూట్లు | DNN | ABP Desam

Vijayawada లో 112 సంవత్సరాల చరిత్ర గల రామ్మోహన్ గ్రంథాలయం విశేషాలు తెలుసా | DNN | ABP Desam

Vijayawada లో 112 సంవత్సరాల చరిత్ర గల రామ్మోహన్ గ్రంథాలయం విశేషాలు తెలుసా | DNN | ABP Desam

Bhagavadgita on Rice Grains: మైక్రో ఆర్ట్స్ లో హైదరాబాదీ ఆర్టిస్ట్ అరుదైన ఘనత | ABP Desam

Bhagavadgita on Rice Grains: మైక్రో ఆర్ట్స్ లో హైదరాబాదీ ఆర్టిస్ట్ అరుదైన ఘనత | ABP Desam

టాప్ స్టోరీస్

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Karnataka Ola Uber Auto Ban: ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై బ్యాన్- సర్కార్ షాకింగ్ నిర్ణయం!

Karnataka Ola Uber Auto Ban: ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై బ్యాన్- సర్కార్ షాకింగ్ నిర్ణయం!