Viral Video: ఫ్రాగ్ ఆర్మీని ఎప్పుడైనా చూశారా, ఇంటి వెనక గార్డెన్‌లో లక్షలాది కప్పలు-వైరల్ వీడియో
ఇంటి వెనకాల స్థలంలో ఫ్రాగ్ ఆర్మీని తయారు చేస్తున్న కప్పల ప్రేమికుడు.
ఇంటి వెనక గార్డెన్‌లో లక్షల కప్పలు
ఎవరైనా కుక్కల్ని పెంచుకుంటారు, పిల్లుల్ని పెంచుకుంటాడు. ఈ మనిషేంటో కప్పల్ని పెంచుకుంటున్నాడు. ఏదో ఒకటి రెండు కాదండి బాబు, 10 లక్షలకుపైగా కప్పల్ని పెంచుకుంటున్నాడు. పైగా దానికి ఫ్రాగ్ ఆర్మీ అని పేరు కూడా పెట్టుకున్నాడు. ఇంటి వెనకాల ఉన్న గార్డెన్‌లో ఈ కప్పల్ని పెంచుకున్నాడు. ఆ కప్పలన్నింటినీ కలిపి వీడియో తీసి టిక్‌టాక్‌లో పెట్టాడు. అప్పుడు పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. తరవాత ఉన్నట్టుండి ఇప్పుడు యూట్యూబ్ సహా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఎవరో పోస్ట్ చేసే సరికి వైరల్ అయిపోయింది ఈ వీడియో. దాదాపు 14 లక్షల కప్పల్ని ఎంతో ప్రేమగా పెంచి పోషిస్తున్నాడా వ్యక్తి. కప్పలు చిన్నగా ఉన్నప్పటి నుంచి అవి పెరిగి పెద్దయ్యేంత వరకూ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడట.
ఫ్రాగ్ ఆర్మీ తయారు చేస్తున్నాడట
అసలీ కప్పల సంఖ్య ఈ స్థాయిలో ఎలా పెరిగిందో ఈ వీడియోలోనే వివరించాడా వ్యక్తి. మొదట ఓ పూల్‌లోకి కప్ప గుడ్లను వదిలాడు. అవి కప్పలుగా ఎలా రూపాంతరం చెందుతాయో ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. తరవాత తన బ్యాక్‌యార్డ్‌లోని మొత్తం కప్పల్ని చూపించాడు. 95 రోజుల క్రితం దాదాపు 14 లక్షల కప్ప గుడ్లని సంరక్షించి ఈ పూల్‌లో వేశానని చెప్పాడు. కప్పలన్నీ బెకబెక అంటూ ఆ ప్రాంతమంతా తిరుగుతూ ఉండటం ఈ వీడియోలో చూడొచ్చు. నడవటానికి కూడా చోటు లేనంతగా కప్పలే ఆ ప్రాంతాన్ని ఆక్రమించేశాయని చాలా హ్యాపీగా చెబుతున్నాడీ కప్పల ప్రేమికుడు. మరో విశేషం ఏంటంటే మరో 5 లక్షల గుడ్లు కప్పలుగా రూపాంతరం చెందే స్టేజ్‌లో ఉన్నాయట. అవి కూడా కలుపుకుంటే మొత్తం 20 లక్షల ఫ్రాగ్ ఆర్మీ తయారవుతుందని చెబుతున్నాడు. ట్విటర్‌లో ఈ వీడియో పోస్ట్ చేయగా దాదాపు 2.8 లక్షల వ్యూస్ వచ్చాయి.
Frog army on TikTok. This guy is creating an entire frog population (1m) in his backyard. It’s honestly crazy. https://t.co/TaKkAlNUM0 pic.twitter.com/h0mZrxXM16
— Arlong (@ramseyboltin) June 8, 2022
కప్పల్ని పెంచుకుంటున్న బాలిక
ఇలా కప్పల్ని పెంచుకుని వార్తల్లోకెక్కిన మొదటి వ్యక్తి ఈయనే కాదు. అంతకు ముందే ఓ బాలిక గ్రీన్ కలర్‌లో ఉన్న కప్పలను పెంచుకుంటూ
సోషల్ మీడియాలో సెలెబ్రిటీ అయిపోయింది. వాటికి మూ, మోచీ అనే పేర్లు కూడా పెట్టుకుంది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే..ఈ బాలిక ఎక్కడికి వెళ్లినా తనతో పాటు ఈ కప్పల్నీ తీసుకెళ్తుందట. ఎందుకిలా అంటే...అలా ఇంట్లో వదిలేసి వెళ్లిపోతే వాటికో బోర్ కొట్టదా, అందుకే బయట తిప్పుతున్నానని బదులిచ్చింది ఆ బాలిక. ఇంటి పెరట్లో మొదటి సారి వీటిని చూసినప్పుడు భయపడినా, తరవాత వాటిపై ప్రేమ పెంచుకుంది. ఏంటో ఎవరి ఇంట్రెస్ట్‌లు ఎలా ఉంటాయో అసలు ఊహించలేం.