News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Viral Video: అరే ఏంట్రా ఇది- ఇదో వెరైటీ బనానా పానీ పూరి, తినాలంటే గట్స్ ఉండాల్సిందే

Viral Video: పానీ పూరి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకంటే దానిని ఆలూ స్థానంలో అరటి పండు ఉపయోగించి తయారు చేశారు.

FOLLOW US: 
Share:

Viral Video: పానీ పూరీ అంటే కేవలం ఫుడ్ మాత్రమే కాదు.. చాలా మందికి అదో ఎమోషన్. రోజూ సాయంత్రం అలా బయటకు వెళ్లి పానీ పూరీ భయ్యా దగ్గర ప్యాస్ వేసుకుని గప్‌చుప్‌ తింటే గానీ రోజు గడవదు చాలా మందికి. అందుకే పానీ పూరీ అంటే ఎమోషన్ అన్నది. గోల్ గప్పాను చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ఎలాంటి తేడా లేకుండా అందరూ ఆస్వాదిస్తూ లాగించేస్తుంటారు. కానీ అమ్మాయిలకు మాత్రం పానీ పూరీతో ఉండే అనుబంధం ప్రత్యేకం. వారికి గప్ చుప్‌కు ఉన్న బంధం మాటలకు అందనిది. చాట్ స్టాల్ వద్ద రకరకాల వెరైటీలు ఉన్నప్పటికీ చాలా మంది ఇష్టంగా తినేది పానీ పూరిని మాత్రమే.
అసలు ఈ గోల్ గప్పాలను ఇంతగా ఇష్టపడి తినడానికి కారణాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కొందరు వెరైటీగా, క్రేజీ కాంబోలతో వచ్చే ఫుడ్ ఐటెమ్స్ ను తెగ ఇష్టపడుతుంటారు. అలాంటి వారి కోసమే గుజరాత్ కు చెందిన ఓ వీధి వ్యాపారి కొత్తగా బనానా పానీ పూరి ట్రై చేశాడు. అలాగే తన వద్దకు వచ్చే వారికి దానిని రుచి కూడా చూపిస్తున్నాడు. ఆ బనానా పానీ పూరికి చెందిన వీడియోను మహ్మద్ ఫ్యూచర్‌వాలా అనే ట్విట్టర్ యూజర్ పోస్టు చేయగా అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు నెటిజన్లను రెండుగా చీల్చేసింది కూడా. 

ఆలూ స్థానంలో బనానాతో పానీపూరీ

ఈ వీడియోలో ఆ స్ట్రీట్ ఫుడ్ వెండర్ కొత్తిమీర, స్పెసెస్, పచ్చిమిర్చి, శనగలు వేసి ఆఖర్లో బాగా పండిన అరటి పండ్లను వేసి చేతితో బాగా మిక్స్ చేయడం చూడవచ్చు. ఆలూ స్థానంలో బనానా వేసినట్లు తెలుస్తోంది. ఆ మిశ్రమంతోనే పానీ పూరీలు వడ్డిస్తూ కనిపించింది ఆ వీడియోలో. ఈయన వద్దకు వచ్చిన ఓ అమ్మాయికి ఈ బనానా పానీ పూరీ ఇవ్వడం, ఆమె దానిని తింటూ ఆస్వాదించడం కూడా వీడియోలో చూడవచ్చు. 27 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోను మహ్మద్ ఫ్యూచర్‌వాలా జూన్ 22వ తేదీ సాయంత్రం 4.59 గంటలకు పోస్టు చేయగా.. ఇప్పటి వరకు 45.8K వ్యూస్ వచ్చింది. చాలా మంది కామెంట్లు కూడా చేస్తున్నారు. 

Also Read: Viral Boys Timetable: 15 నిమిషాలు రీడింగ్, 3 గంటలు ఫైటింగ్ చేయాలి - వైరల్ అవుతున్న ఆరేళ్ల పిల్లాడి టైం టేబుల్

రెండుగా విడిపోయిన నెటిజన్లు

మహ్మద్ ఫ్యూచర్‌వాలా షేర్ చేసిన ఈ వీడియోపై స్పందిస్తూ నెటిజన్లు రెండుగా విడిపోయారు. కొందరు 'వావ్.. వాటే కాంబో.. టేస్టీ' అంటూ కామెంట్ చేయగా.. మరొకరు మాత్రం 'ఇదేం ఫుడ్ కాంబినేషన్ అంటూ' పెదవి విరిస్తున్నారు. 'ఈ దారుణమైన ఘటన ఎక్కడ జరుగుతోంది' అంటూ ఓ యూజర్ ప్రశ్నించారు. 'చాలా మందికి ఫేవరెట్ ఫుడ్ అయిన పానీ పూరీని అలా బనానాతో చేస్తూ చెడగొడుతున్నారు' అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. మరొకరు 'యాక్...' అంటూ కామెంట్ చేస్తూ తన ఫీలింగ్ ను చెప్పేశారు. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 26 Jun 2023 10:24 PM (IST) Tags: Watch Gujarat Viral Video Banana Pani Puri Divides Internet

ఇవి కూడా చూడండి

Heart of Milky Way: జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన ఫోటో చూసి సైంటిస్టులు షాక్

Heart of Milky Way: జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన ఫోటో చూసి సైంటిస్టులు షాక్

Viral Video: కార్‌పై క్రాకర్స్‌ కాల్చిన ఆకతాయిలు,రోడ్డుపై గట్టిగా కేకలు వేస్తూ నానా రచ్చ - వీడియో వైరల్

Viral Video: కార్‌పై క్రాకర్స్‌ కాల్చిన ఆకతాయిలు,రోడ్డుపై గట్టిగా కేకలు వేస్తూ నానా రచ్చ - వీడియో వైరల్

Thailand offers a crazy offer to Indians : థాయ్ మసాజ్​ కావాలా? ఇండియన్స్​కి క్రేజీ ఆఫర్​ ఇచ్చిన థాయ్​లాండ్

Thailand offers a crazy offer to Indians : థాయ్ మసాజ్​ కావాలా? ఇండియన్స్​కి క్రేజీ ఆఫర్​ ఇచ్చిన థాయ్​లాండ్

యాక్సిడెంట్ అయిన కార్‌లో మందు బాటిల్స్, ఎగబడి ఎత్తుకెళ్లిన స్థానికులు - వైరల్ వీడియో

యాక్సిడెంట్ అయిన కార్‌లో మందు బాటిల్స్, ఎగబడి ఎత్తుకెళ్లిన స్థానికులు - వైరల్ వీడియో

ఆఫీస్‌లో మరీ అతిగా పని చేస్తున్నారా? వర్కింగ్ అవర్స్ పెరిగితే ఆయుష్షు తగ్గిపోవడం ఖాయం!

ఆఫీస్‌లో మరీ అతిగా పని చేస్తున్నారా? వర్కింగ్ అవర్స్ పెరిగితే ఆయుష్షు తగ్గిపోవడం ఖాయం!

టాప్ స్టోరీస్

Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం

Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం

Revanth Reddy: రేపు ఈసీ వద్దకు కాంగ్రెస్ నేతలు, కేసీఆర్‌పై ఫిర్యాదు - వాటిని మార్చేస్తున్నారని ఆరోపణలు

Revanth Reddy: రేపు ఈసీ వద్దకు కాంగ్రెస్ నేతలు, కేసీఆర్‌పై ఫిర్యాదు - వాటిని మార్చేస్తున్నారని ఆరోపణలు

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్