అన్వేషించండి

UP Police: పోలీస్ అంకుల్ నా షార్ప్‌నర్ పోయింది - చిన్నారి కంప్లైంట్‌కు స్పందించి వెతికిచ్చిన పోలీసులు

Strange Complaint: యూపీ పోలీసులు ఓ వింత కేసును ఛేదించారు. తన షార్ప్‌నర్ పోయిందని కంప్లైంట్ ఇచ్చిన విద్యార్థికి దాన్ని వెతికి ఇచ్చారు. ఇది నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

UP Police Solved Sharpener Stolen Case: హత్యలు, దోపీడీలు, మోసాలు, కొట్లాటలు వంటి కేసుల ఛేదనలో పోలీసులు ఎప్పుడూ బిజీగా ఉంటారు. అలాంటి పోలీసులకు తాజాగా ఓ వింత ఫిర్యాదు వచ్చింది. ఓ చిన్నారి స్కూల్‌లో తన షార్ప్‌నర్ పోయిందంటూ ఫిర్యాదు చేశాడు. దీన్ని చూసిన పోలీసులు తొలుత ఆశ్చర్యపోయినా ఆ తర్వాత సీరియస్‌గా తీసుకుని కేసు ఛేదించారు. చిన్నారి షార్ప్‌నర్‌ను వెతికి పట్టుకుని అప్పగించారు. యూపీలో ఈ వింత ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని (Uttarapradesh) హర్దోయ్ ప్రాంతంలోని పలు స్కూళ్లలో పోలీసులు ఫిర్యాదు పెట్టెలను (పింక్ బాక్సులు) ఏర్పాటు చేశారు. విద్యార్థులు తమకు స్కూళ్లలో ఏమైనా సమస్యలు ఎదురైనా.. ఫిర్యాదు చెయ్యొచ్చని, ఉత్తరాలు రాసి ఆ బాక్సుల్లో వేయాలని సూచించారు. ప్రతి వారం స్కూళ్లకు వెళ్లి ఫిర్యాదు పెట్టెల్లోని లెటర్లను చదివి.. విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తుంటారు.

షార్ప్‌నర్ పోయిందని కంప్లైంట్

కాగా, ఇటీవల ఏ పాఠశాలలోని కంప్లైంట్ బాక్స్ తెరవగా కొందరు విద్యార్థులు తమను టీచర్లు కొడుతున్నారని.. కొందరు తమ స్నేహితులు తరగతి గదిలో అల్లరి చేస్తున్నారని, ఇంకొందరు స్కూల్ బస్సులో గొడవ పడుతున్నారని వారి సమస్యలు రాశారు. అయితే, ఓ విద్యార్థి మాత్రం తన షార్ప్‌నర్ పోయిందని.. ఎవరు తీసుకున్నారో తెలియలేదని వాపోయాడు. తొలుత ఇది చదివిన పోలీసులు ఆశ్చర్యపోయినా.. తమ వంతు బాధ్యతగా కేసును ఛేదించారు. పోయిన షార్ప్‌నర్‌ను వెతికి తిరిగి విద్యార్థికి అప్పగించారు. విద్యార్థుల నుంచి మొత్తం 12 ఫిర్యాదులు అందాయని.. వెంటనే వాటిని పరిష్కరించినట్లు పోలీసులు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. 'సమాజంలో మంచిని పెంపొందించాలంటే విద్యార్థి దశలోనే సాధ్యమని భావించాం. అందుకే పాఠశాలల్లో ఫిర్యాదుల పెట్టెలు పెట్టి, వారి సమస్యలు పరిష్కరిస్తూ చట్టంపై వారికి నమ్మకం కలిగేలా చేస్తున్నాం.' అని ఎస్పీ వెల్లడించారు.

ఈ విషయం వైరల్ కావడంతో నెటిజన్లు హర్దోయ్ పోలీసుల తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పిల్లల్లో చిన్న నాటి నుంచి సత్ప్రవర్తన, సమాజం పట్ల బాధ్యత పెరుగుతుందని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Parliament Winter Session: పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లో మ‌ళ్లీ ర‌చ్చ‌, మోదీ సర్కార్ వెనకడుగు వేస్తోందన్న కాంగ్రెస్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lakshmi Arrest: కిరణ్ రాయల్ పై ఫిర్యాదు చేసిన లక్ష్మి అరెస్ట్, తిరుపతిలో అదుపులోకి తీసుకున్న జైపూర్ పోలీసులు
Lakshmi Arrest: కిరణ్ రాయల్ పై ఫిర్యాదు చేసిన లక్ష్మి అరెస్ట్, తిరుపతిలో అదుపులోకి తీసుకున్న జైపూర్ పోలీసులు
KTR Visits Chilukuru Temple: చిలుకూరు అర్చకులు రంగరాజన్‌ను పరామర్శించిన కేటీఆర్, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవంటూ ఆగ్రహం
చిలుకూరు అర్చకులు రంగరాజన్‌ను పరామర్శించిన కేటీఆర్, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవంటూ ఆగ్రహం
Junior NTR: పాప్ సింగర్ ఎడ్ షీరన్ నోట 'చుట్టమల్లే' సాంగ్ - ఇది నిజంగా ప్రత్యేకమంటూ స్పందించిన జూనియర్ ఎన్టీఆర్
పాప్ సింగర్ ఎడ్ షీరన్ నోట 'చుట్టమల్లే' సాంగ్ - ఇది నిజంగా ప్రత్యేకమంటూ స్పందించిన జూనియర్ ఎన్టీఆర్
Pawan Hindutva Tour: పవన్ కల్యాణ్ మిషన్ దక్షిణాది స్టార్ట్ - ఆలయాల సందర్శన ఎప్పటి నుంచంటే ?
పవన్ కల్యాణ్ మిషన్ దక్షిణాది స్టార్ట్ - ఆలయాల సందర్శన ఎప్పటి నుంచంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Madhya Pradesh Dhar Gang Arrest | 55కేసులున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసిన అనంత పోలీసులు | ABP DesamBaduguvani Lanka Nurseries | గోదావరి తీరంలో ఈ ఊరి పూలతోటల అందాలు చూశారా | ABP DesamElon Musk MARS Square Structure | మార్స్ మీదకు ఆస్ట్రోనాట్స్ ను పంపాలనంటున్న మస్క్ | ABP DesamKiran Royal Janasena Issue | వివాదంలో చిక్కుకున్న తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lakshmi Arrest: కిరణ్ రాయల్ పై ఫిర్యాదు చేసిన లక్ష్మి అరెస్ట్, తిరుపతిలో అదుపులోకి తీసుకున్న జైపూర్ పోలీసులు
Lakshmi Arrest: కిరణ్ రాయల్ పై ఫిర్యాదు చేసిన లక్ష్మి అరెస్ట్, తిరుపతిలో అదుపులోకి తీసుకున్న జైపూర్ పోలీసులు
KTR Visits Chilukuru Temple: చిలుకూరు అర్చకులు రంగరాజన్‌ను పరామర్శించిన కేటీఆర్, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవంటూ ఆగ్రహం
చిలుకూరు అర్చకులు రంగరాజన్‌ను పరామర్శించిన కేటీఆర్, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవంటూ ఆగ్రహం
Junior NTR: పాప్ సింగర్ ఎడ్ షీరన్ నోట 'చుట్టమల్లే' సాంగ్ - ఇది నిజంగా ప్రత్యేకమంటూ స్పందించిన జూనియర్ ఎన్టీఆర్
పాప్ సింగర్ ఎడ్ షీరన్ నోట 'చుట్టమల్లే' సాంగ్ - ఇది నిజంగా ప్రత్యేకమంటూ స్పందించిన జూనియర్ ఎన్టీఆర్
Pawan Hindutva Tour: పవన్ కల్యాణ్ మిషన్ దక్షిణాది స్టార్ట్ - ఆలయాల సందర్శన ఎప్పటి నుంచంటే ?
పవన్ కల్యాణ్ మిషన్ దక్షిణాది స్టార్ట్ - ఆలయాల సందర్శన ఎప్పటి నుంచంటే ?
SaReGaMaPa Winner : ఎవరీ అభిజ్ఞ? సరిగమప 16 విన్నర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే... అమెరికా నుంచి ఇండియా వచ్చి!
ఎవరీ అభిజ్ఞ? సరిగమప 16 విన్నర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే... అమెరికా నుంచి ఇండియా వచ్చి!
Peddireddy Ramachandra Reddy: పెద్దిరెడ్డి భూ కబ్జాలపై విజిలెన్స్ నివేదిక, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు
పెద్దిరెడ్డి భూ కబ్జాలపై విజిలెన్స్ నివేదిక, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు
Pawan Kalyan: వ్యక్తిపై కాదు, ధర్మ పరిరక్షణపై జరిగిన దాడి- రంగరాజన్‌పై దాడిపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
వ్యక్తిపై కాదు, ధర్మ పరిరక్షణపై జరిగిన దాడి- రంగరాజన్‌పై దాడిపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
Indian Migrants: డంకీ రూట్‌లో అమెరికాకు వెళ్తూ మార్గం మధ్యలో గుండెపోటుతో పంజాబీ యువకుడు మృతి
డంకీ రూట్‌లో అమెరికాకు వెళ్తూ మార్గం మధ్యలో గుండెపోటుతో పంజాబీ యువకుడు మృతి
Embed widget