అన్వేషించండి

Husband Found on Instagram: భార్యను వదిలేసి పారిపోయిన మొగుడు.. ఏడేళ్ల తర్వాత రెండో భార్యతో  రీల్స్‌లో దొరికాడు..

Viral Story: పెళ్లాన్ని వదిలించుకోవాలనుకున్న ఓ మొగుడు పక్కాగానే ప్లాన్ చేసుకున్నాడు.. కనిపించకుండా పోతే.. చనిపోయాడనున్నారు. కానీ ఏడేళ్ల తర్వాత ఇంకో మహిళతో కలిసి రీల్స్ చేస్తూ దొరికిపోయాడు..

Husband Found on Instagram: ఉత్తరప్రదేశ్‌లోని ఓ మహిళ తన భర్తను ఇన్‌స్టాగ్రామ్.. రీల్స్‌లో చూసింది. ఇందులో విశేషం ఏముంది అనుకోకండి.. ఆయన ‘మిస్’ అయ్యి  ఏడేళ్లయింది. ఉత్తర ప్రదేశ్‌లోని హర్దోయ్‌కు  చెందిన  జితేంద్ర అలియాస్‌ బబ్లూ కు 2017లో షీలుతో పెళ్లయింది. కానీ పెళ్లైన ఏడాదికే భార్యను వదిలేసి పారిపోయాడు. చాలా మంది చనిపోయాడనే అనుకున్నారు. కానీ ఉన్నట్లండి.. ఈ మధ్య ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌లో ప్రత్యక్షమయ్యాడు… అది కూడా మరో మహిళతో.. ఆరా తీస్తే ఆమె తన రెండో పెళ్లాం అని తెలిసింది.

కట్నం కోసం వేధించి.. కనిపించకుండా పోయాడు

2017 లో పెళ్లైన జితేంద్ర- బబ్లూల  సంసారం సజావుగా సాగలేదు. ఏడాదిలోపే జితేంద్ర షీలును కట్నం కోసం వేధించాడు. బంగారం తేవాలని డిమాండ్ చేశాడు. భార్యా భర్తల మధ్య గొడవలు పోలీసుల కేసు వరకూ వెళ్లాయి. తనను కట్నం కోసం వేధిస్తున్నారని షీలు Sandila పోలీసు స్టేషన్‌లో కంప్లయింట్ చేసింది. అయితే జితేంద్రను అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులను షాకింగ్ విషయం తెలిసింది. జితేంద్ర ఇంట్లో నుంచి ‘మిస్’ అయ్యాడు. తన కుమారుడు కనిపించడం లేదంటూ జితేంద్ర తండ్రి 2018లో కంప్లెయింట్ చేశారు. అంతే కాదు.. షీలు బంధువులే తన బిడ్డను చంపేసి ఉంటారని అనుమానం కూడా వ్యక్తం చేశాడు. అప్పటి నుంచి మిస్సింగ్ కేసు కొనసాగుతూనే ఉంది. షీలు కూడా తన భర్త ఎప్పటికైనా వస్తాడని ఎదురుచూస్తూ ఉంది.

రోజంతా కుక్కలతో గడుపుతున్న బాలుడు, మాటలు మరిచిపోయి కుక్కలా మొరుగుతున్నాడు

రీల్స్‌లో కనిపించిన జితేంద్ర

అయితే ఏడేళ్ల కిందట ‘అదృశ్యం’ అయిన జితేంద్ర అలియాస్ బబ్లూ రీల్స్‌లో ‘ప్రత్యక్షం’ అయ్యాడు. మరో మహిళతో కనిపించాడు. ఆ రీల్స్ చూసి షాక్ అయిన షీలు పొలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు తెలుసుకున్నదేంటంటే.. పథకం ప్రకారం తాను అదృశ్యం అయినట్లుగా సృష్టించుకున్న జితేంద్ర తర్వాత లుథియానాకు వెళ్లిపోయాడు. అక్కడ తన ఐడెంటిటీ మార్చుకుని మరో మహిళను పెళ్లి కూడా చేసుకున్నాడు. కొత్త భార్యతో సంతోషంతో రీల్స్ చేసుకుంటూ పాత పెళ్లానికి దొరికిపోయాడు. ఇప్పుడు రీల్స్ స్టార్ జితేంద్రను పోలీసులు Sandila కి పట్టుకొచ్చారు. షీలు పెట్టిన పాత కేసులో అదుపులోకి తీసుకున్నారు. అలాగే భార్యన మోసం చేసి పారిపోయిన అభియోగాలను కూడా నమోదు చేశారు.

 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Viral Video: ఫుడ్ ఆలస్యమైందని Zomato డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి.. వీడియో వైరల్
ఫుడ్ ఆలస్యమైందని Zomato డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి.. వీడియో వైరల్
Viral News: కూతురి ఫీజు కోసం చెప్పులు లేకుండా పరుగు.. ఒట్టి కాళ్లతో మారథాన్ గెలిచిన తల్లి!
కూతురి ఫీజు కోసం చెప్పులు లేకుండా పరుగు.. ఒట్టి కాళ్లతో మారథాన్ గెలిచిన తల్లి!
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Kerala Influencer Akhil Megha: కేరళం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ జంటకు దిష్టి తగిలేసిందా? బస్సు క్లీనర్‌తో భార్య పరార్‌! బోరుమంటున్న భర్త!
కేరళం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ జంటకు దిష్టి తగిలేసిందా? బస్సు క్లీనర్‌తో భార్య పరార్‌! బోరుమంటున్న భర్త!

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays 2026: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు ఈ 10 నుంచి దసరా సెలవులు
CM Chandrababu: వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Kiran Abbavaram Reality : కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' - డైరెక్టర్‌గా ఫస్ట్ మూవీ... బాలయ్య, నాగ్ మూవీస్‌తో పాటే...
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Toyota Cheapest Car: టయోటా అతి తక్కువ ధర కారు ఇదే! రూ.6.73 లక్షలే.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా ఉన్నా కూడా ధర తక్కువే!.. టయోటా చీపెస్ట్ కార్ ఇదే!
Sivakarthikeyan : నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
Embed widget