Kerala Balloon Seller: బెలూన్లు అమ్ముకొనే ఈ అమ్మాయిని ఇప్పుడు ఎలా మార్చేశారో చూస్తే ఆశ్చర్యపోతారు
Balloon Seller Makeover | కేరళలో బెలున్లు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆ యువతికి ఓ ఫొటోగ్రాఫర్ బ్రేక్ ఇచ్చాడు. ఇప్పుడు ఆమె ఎలా మారిపోయిందో చూడండి.
Kerala Ballon Seller | మోడలింగ్ అంటే, అది గొప్పింటోళ్లకే చెల్లుతుందనే భావన ఉంటుంది. అయితే, సోషల్ మీడియా దయవల్ల ఇప్పుడు సామాన్యులు కూడా మోడల్స్‌గా మారిపోతున్నారు. ఒకప్పుడు టీ అమ్ముకొనే అబ్బాయి నుంచి.. ఇటీవల సూపర్ మోడళ్లనే నోరెళ్ల బెట్టేలా చేసిన 60 ఏళ్ల వృద్ధుడు మమ్మికా వరకు నెట్టింట హల్‌చల్ చేసినవారే. తాజాగా వీరి జాబితాలో బెలున్లు విక్రయించే ఈ అమ్మాయి కూడా చేరింది.
కేరళకు చెందిన అర్జున్ క్రిష్ణన్ అనే వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ ఇటీవల కన్నూర్ అందల్లుర్కావు ఫెస్టివల్‌కు వెళ్లాడు. అక్కడ అతడికి బుడగలను విక్రయిస్తున్న కిస్బూ అనే అమ్మాయిని చూశాడు. అంతే, వెంటనే అతడు తన కెమేరాకు పని చెప్పాడు. ఆ అందమైన అమ్మాయి అమాయకపు చూపులను క్లిక్ చేశాడు. అయితే, అతడు అంతటితో ఆగలేదు. తర్వాతి రోజు ఆమెను మోడల్‌గా మార్చేశాడు. ఆమెకు మేకప్ వేయించి చీర నుంచి మోడ్రన్ డ్రెస్‌ల వరకు రకరకాల ఫొటోలు తీశాడు. అనంతరం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే కిస్బూది కేరళ కాదు. పొట్ట కూటి కోసం రాజస్థాన్ నుంచి కేరళకు వెళ్లింది. మరి, ఈ చిత్రాలతోనైనా ఆమె లైఫ్ మారుతుందేమో చూడాలి. అయితే, ఈ ఫొటోలు చూసిన చాలామంది ఆమె నేచురల్ బ్యూటీ అని, మేకప్ లేనప్పుడు కూడా అందంగా ఉందని అంటున్నారు. ఈ ఫొటోలు చూసి మీ అభిప్రాయం కూడా చెప్పండి.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
Also Read: చంకల్లో పౌడర్ పూయడం మంచిదేనా? అక్కడ నల్లగా ఎందుకు మారుతుంది?