Trans Woman : సన్నని నడుము కోసం రూ.14 లక్షలు వెచ్చించింది - తొలగించిన ఎముకలతో కిరీటం!, ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ స్టోరీ
Trans Woman : ఓ 27 ఏళ్ల ట్రాన్స్ సన్నని నడుము కోసం రూ.14 లక్షలు వెచ్చించి శస్త్రచికిత్స చేయించుకుంది. 6 పక్కటెముకలను తొలగించగా.. వాపు కారణంగా నడుము చుట్టూ బెల్ట్ ధరించాల్సి వచ్చిందని వెల్లడించింది.

Trans Woman : టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ అనేక కొత్త తరహా ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వస్తున్నాయి. అందంగా కనిపించాలన్న ఆశ, ఉద్దేశంతో చాలామంది మహిళలు రకరకాల సర్జరీలు చేయించుకుంటున్నారు. కొన్నిసార్లు వీటి వల్ల ప్రాణాలకే ముప్పు రావడం కొన్ని కేసుల్లో చూసే ఉన్నాం. శరీరంలో ఇప్పుడు ఏ భాగాన్ని సరిచేయాలన్నా దానికి సంబంధించిన శస్త్ర చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. పెదవులు, ముక్కు, చెవులు లాంటిని సరిదిద్ధి అందంగా కనిపించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అదే తరహాలో సన్నని నడుముతో అందంగా కనిపించేందుకు ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ ఏకంగా రూ.14 లక్షలు వెచ్చించింది. నడుము సన్నగా మారేందుకు అమెరికా మిస్సోరిలోని కాన్సాస్ సిటీకి చెందిన ఎమిలీ జేమ్స్ కేటర్స్ అనే ట్రాన్స్ మహిళ కాస్మెటిక్ సర్జరీ ద్వారా తన శరీరంలో భాగమైన 6 పక్కటెముకలను తొలగించుకుంది. ఈ ప్రక్రియకు సంబంధించి పలు వివరాలను జేమ్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం తనకు నొప్పింగా ఉందని ఒప్పుకున్న ఎమిలీ.. ఈ సందర్భంగా కాస్మెటిక్ సర్జరీ చేసిన వైద్యులు, నర్సులకు కృతజ్ఞతలు చెప్పింది. ఇక్కడ వింతైన విషయమేమిటంటే.. తొలగించిన ఆ ఎముకలతో ఆమె కిరీటాన్ని తయారు చేయించాలని ప్లాన్ చేస్తోందట.
సోషల్ మీడియాలో డాక్యుమెంట్ ప్రయాణం
సెక్స్ థెరపిస్ట్‌గా ప్రకటించుకున్న ఇన్‌ఫ్లుయెన్సర్, సోషల్ మీడియాలో తన పక్కటెముకలను తొలగించే ప్రయాణానికి సంబంధించిన డాక్యుమెంట్ షేర్ చేసింది. శస్త్రచికిత్సకు ముందు, ఆమె ఒక వీడియోను పోస్ట్ చేసింది. "మూడు రోజుల్లో, నడుముకు ఇరువైపులా మూడు పక్కటెముకలు తొలగించుకున్నాను" అని చెప్పింది. తదనంతరం, ఆమె తన శస్త్రచికిత్స, రికవరీ ప్రక్రియ గురించి అప్డేట్స్‌ను కూడా పంచుకుంది. తాను త్వరలోనే ఎమిలీ బార్బీ క్యూగా మారబోతున్నట్టు తెలిపింది. తొలగించుకున్న ఎముకల నుంచి కిరీటం తయారు చేయాలని ప్లాన్ చేస్తున్నానని జేమ్స్ చెప్పుకొచ్చింది. దాన్ని తన బెస్ట్ ఫ్రెండ్‌కు గిఫ్ట్‌గా ఇస్తానని చెప్పింది. దాంతో పాటు తన మాంసం రుచికరంగా ఉంటుందని వ్యక్తిగతంగా భావిస్తున్నానని తెలిపింది.
నెటిజన్స్ రియాక్షన్
ఈ వీడియోపై సోషల్ మీడియా యూజర్స్ భిన్నరకాలుగా స్పందించారు. వాటిని నమలాలని లేదా ఉడకబెట్టుకుని పులుసుగా చేసి తాగాలని కొందరు సూచించారు. కానీ తాను తొలగించుకున్న పక్కటెముకలను ఏ రూపంలోనూ తాను తిననని చెప్పింది. "మానవ మాంసాన్ని తినడం వల్ల ప్రాణాంతకమైన అనేక రుగ్మతలు సంభవిస్తాయి" అని ఆమె చెప్పింది. "కాబట్టి, నేను నరమాంస భక్షణలో పాల్గొనను" అని బదులిచ్చింది. జేమ్స్ వింత నిర్ణయం గురించి చాలా మంది జోకులు, వ్యాఖ్యలు చేశారు. కానీ ఆమె వాటిని ఏ మాత్రమూ పట్టించుకోలేదు. తన పక్కటెముకలు తీసేయడం వల్ల తాను ట్రాన్స్ గర్ల్ అన్న విషయాన్ని ఏ మాత్రమూ మార్చదని ఆమె చెప్పింది. ఇది నా శరీరం, నా డబ్బు. దాంతో నాకు ఏం కావాలో అది చేసుకుంటాను అని తెలిపింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

