Deer Fight at Border: సరిహద్దుల్లో భారత్, పాకిస్తాన్ జింకల మధ్య భీకర పోరు- వీడియో చూస్తే షాక్
Viral Video: పాకిస్థాన్ అంటే మన దేశపు జంతువులకు కూడా గిట్టునట్లు ఉంది. తాజాగా ఇరు దేశాలకు చెందిన రెండు జింకలు సరిహద్దు ఫెన్సింగ్ వద్ద పోరుబాట పట్టాయి. ఈ వీడియో వైరల్ అవుతుంది.

Deer Trending video: భారత్, పాకిస్థాన్‌ల విషయంలో.. సమస్య ఏదైనా సరే.. అది ఆసక్తికరంగానే ఉంటుంది. భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దులో ఒకరి సైనికులు ఒకరు పోరాడటం ఇప్పటివరకు చూసే ఉన్నాం. కానీ ఈసారి భారత్, పాకిస్తాన్ మధ్య ఘర్షణ సైనికుల మధ్య కాదు రెండు జింకల మధ్య జరిగింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
జింకల భీకర పోరు
పొరుగున ఉన్న పాకిస్థాన్ అంటే మన దేశపు జంతువులకు కూడా గిట్టునట్లు ఉంది. తాజాగా ఇరు దేశాలకు చెందిన రెండు జింకలు సరిహద్దు ఫెన్సింగ్ వద్ద భీకరంగా పోరుబాట పట్టాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో భారత్-పాకిస్థాన్ సరిహద్దుకు చెందినదని, దీనిని బీఎస్ఎఫ్ జవాన్ రికార్డ్ చేసినట్లుగా పేర్కొంటున్నారు. ఆ వీడియోలో భారత్, పాకిస్థాన్‌లకు చెందిన జింకలు పరస్పరం ఢీకొంటున్నాయి. తమ దేశాలను గెలిపించుకునేందుకు తీవ్రంగా పోరాడుతున్నాయి. ఇద్దరూ తమ తమ పరిమితుల్లో నిలబడి జీరో లైన్ గోడ గుండా ఒకదానితో ఒకటి పోరాడుతున్నాయి. రెండు జింకలు తమ కొమ్ములతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు.
Kalesh b/w Pakistani hiran (deer)and Indian hiran (deer) ,video captured by BSF officer
— Ghar Ke Kalesh (@gharkekalesh) July 29, 2024
pic.twitter.com/evFh6cKUiW
బలాన్ని ప్రదర్శించిన భారత జింక
వైరల్ అవుతున్న వీడియోలో భారతీయ జింక కాస్త దూకుడుగా కనిపిస్తుంది. మొదట అది పాకిస్తానీ జింకను ఎగిరి మరీ తన బలాన్ని ప్రదర్శిస్తుంది. దూరంగా వెనక్కి వెళ్లి వేగంగా వచ్చి పాకిస్తానీ జింక పై దాడి చేస్తోంది. భారత్ జింక దాటికి పాకిస్తాన్ జింక భయపడుతోంది. ఒక వేళ ఇప్పుడు సరిహద్దు తెరిస్తే ఇద్దరూ మృత్యువుతో పోరాడేవారు.
శాంతించిన పాకిస్థాన్ జింక
భారతీయ జింక తన బలాన్ని ప్రదర్శించి సరిహద్దు నుండి దూరంగా వెళుతుంది. కానీ పాకిస్థాన్ జింక ఫెన్సింగ్ పై కొమ్ములను కొట్టడం ద్వారా భారత జింకను సవాలు చేస్తుంది. దీని తరువాత, భారతదేశం వైపు నుండి జింక పైకి పరిగెత్తుకుంటూ ఫెన్సింగ్ దగ్గరకు చేరుకోగానే, పాకిస్తాన్ జింక తన ఆయుధాలను కిందకి దింపి, లొంగిపోయినట్లుగా నిశ్శబ్దంగా కూర్చుంది.
ఉత్సాహాన్ని నింపుతున్న పోరు
ఈ వీడియో @gharkekalesh అనే X ఖాతా ద్వారా షేర్ చేశారు. ఇది ఇప్పటివరకు మిలియన్ల మంది వీడియోను వీక్షించారు. చాలా మంది వ్యక్తులు వీడియోను లైక్ చేశారు. జింకల ఈ ఫైట్ యూజర్లలో ఉత్సాహాన్ని నింపగా, ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఒక నెటిజన్... యుద్ధం ఎలాంటిదైనా భారత్-పాకిస్థాన్ మధ్య పోరులో ఉత్సాహం ఉంటుందని కామెంట్ చేశారు. మరో నెటిజన్... భారత్ జింక మాత్రమే గెలుస్తుందని కామెంట్ చేశారు. ఇంకో నెటిజన్.. గడ్డి తినే జింక, మాంసం తినే జింక మధ్య యుద్ధం కొనసాగుతోందంటూ రాసుకొచ్చారు. మన జింక పోరాటం చూసి పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తున్న కొంతమంది నేతలు మారాలి అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

