Chhattisgarh News: పిల్లులకు ప్రభుత్వ ఉద్యోగాలు- అవాక్కయ్యారా? ఇంకా చాలా ఉంది!
ఆ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పిల్లులు పని చేస్తున్నాయి. అవును ఈ కథ చదివితే మీరే అవాక్కవుతారు.
ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా? అని కోట్లాది మంది యువత ఎదురుచూస్తూ ఉంటారు. ఉద్యోగం సాధించడం కోసం కష్టపడుతుంటారు. అయితే ఓ రాష్ట్ర ప్రభుత్వం వెరైటీగా పిల్లులకు ప్రభుత్వ ఆఫీసులో ఉద్యోగాలిచ్చింది. అవును మీరు విన్నది నిజమే. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం పిల్లులకు ప్రభుత్వ కార్యాలయాల్లో పనికల్పించింది. వాటి కోసం ప్రత్యేకంగా ఆహారం సౌకర్యాలు కూడా కల్పిస్తోంది.
ఇదేంటి?
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం తమ కార్యలయాలలో పిల్లులను పెంచుకుంటుంది. వీటి కోసం ప్రత్యేకంగా నిధులను కూడా కేటాయించింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతమున్న టెక్నాలజీకి తగ్గట్లు ప్రభుత్వ ఆఫీసులు కూడా డిజిటలైజ్ అవుతున్నాయి. తమ డాక్యుమెంట్, ఫైళ్లు అన్ని డిజిటలైజ్ చేసేశాయి. అయితే ఇప్పటికీ కొన్ని ప్రభుత్వ కార్యలయాలు పాతకాలం ఫైళ్లనే కొనసాగిస్తున్నాయి.
ఇందుకే
ఇప్పటికీ కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్లు, ఫిర్యాదుల కోసం చక్క బీరువాలను ఉపయోగిస్తున్నారు. వాటిని ఎలుకలు కొరికి నాశనం చేస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఇలాంటి ఘటనలే జరిగాయి. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్ ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పటికి ఫైళ్లు, ఫిర్యాదులను, ఇతర సర్టిఫికెట్లను బీరువాలలో పెడుతుంటారు. ఇంకా అక్కడ ఎలుకలు చాలా ఉన్నాయి. ఆఫీసులోని వైర్లను కూడా ఎలుకలు కొరికి నాశనం చేస్తున్నాయి. బీరువాలలో దాచిన ఫైళ్లను కూడా కొరికేస్తున్నాయి.
దీంతో ప్రభుత్వం పిల్లుల కోసం ప్రత్యేకమైన నిధులను కేటాయించింది. వాటి కోసం ఆహారం, ప్రత్యేక వసతులను కూడా ఇస్తున్నారు. రాత్రి వాటిని ఆఫీసులలో వదిలేస్తున్నారు.
ఇలా చేయడం వల్ల అవి ఫైళ్లు కొరికేసే ఎలుకలను పట్టి తింటున్నాయి. దీంతో వారి బాధ తప్పింది. మరి పిల్లులకు ఆహారం అవసరమైతే పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నారా? వాటి కోసం పాలు కూడా ఆఫీసులో పెడుతున్నారట.
Also Read: Hijab Ban Verdict: హిజాబ్‌పై హైకోర్టు తీర్పులో కీ పాయింట్లు ఇవే- ఇవి గమనించారా?
Also Read: Modi on Kashmir Files: 'ద కశ్మీర్ ఫైల్స్' చిత్రంపై మోదీ కీలక వ్యాఖ్యలు- ఏమన్నారో తెలుసా?