Cake Cutting Hack: కేక్ ఇలా కూడా కట్ చేస్తారా? నెక్స్ట్ టైమ్ ఈ ట్రిక్ ట్రై చేయండి-వైరల్ వీడియో
Cake Cutting Hack: సింపుల్‌గా కేక్ కట్ చేసే ట్రిక్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నెటిజన్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Cake Cutting Hack:
బర్త్‌డే పార్టీల్లో కేక్ కటింగ్ తప్పనిసరి. బర్త్‌డే అనే కాదు. ఈ మధ్య ఏ చిన్న ఈవెంట్‌కైనా కేక్ కట్టింగ్ సాధారణమైపోయింది. అయితే ఈ కేక్‌ను ఎలా పడితే అలా కట్ చేయటం వల్ల అంతా వేస్ట్ అయిపోతుంది. ఇక కూల్ కేక్ అయితే కరిగిపోతుంది. అలా కాకుండా ఎంతో నైస్‌గా కట్ చేసే ట్రిక్ చెప్పాడో నెటిజన్. ఇన్‌స్టాగ్రామ్‌లో కేక్ కట్టింగ్ వీడియో షేర్ చేశారు. అన్ని ముక్కల్ని సమానంగా కట్ చేసే ట్రిక్ ఇందులో చూపించారు. కేక్ వేస్ట్ కాకుండా, చిందరవందర చేయకుండా నీట్‌గా ప్లేట్‌లో తీసి పెట్టాడు. ఇప్పటికే ఈ వీడియోకు 14.8 మిలియన్ వ్యూస్ రాగా, 2లక్షల 68 వేల లైక్స్ వచ్చాయి. " ఈ ట్రిక్ ట్రై చేయండి. తప్పకుండా వర్కౌట్ అవుతుంది" అని ఈ పోస్ట్‌లో కోట్ చేశారు. సాధారణంగా కేక్ కటింగ్ పెద్ద కత్తులు వాడతాం. కానీ...జస్ట్ ఓ టాంగ్‌తో సింపుల్‌గా కేక్ కట్ చేశారు. టాంగ్‌ని వినియోగించి ఓ కేక్ పీస్‌ను కట్ చేసి ప్లేట్‌లో పెట్టాడు ఆ వీడియోలోని వ్యక్తి. "కేక్ కట్ చేయటం ఇంత సింపులా" అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.
View this post on Instagram
Also Read: Viral Video: ఇతను బాహుబలి కాదు అంతకు మించి, తల్లిదండ్రులను భుజాలపై మోసిన కొడుకు-వైరల్ వీడియో
Also Read: Pushpa The Rule: రూ.100 కోట్ల ఆఫర్ - రిజెక్ట్ చేసిన అల్లు అర్జున్!