Astronomer CEO Resigns: మహిళా ఉద్యోగితో కోల్డ్ ప్లేలో సరసాలు - సీఈవో ఉద్యోగం ఊడింది
Coldplay Concert Video | ఆస్ట్రానమర్ కంపెనీ సీఈవో ఆండీ బైరాన్ తన పదవికి రాజీనామా చేశారు. కోల్డ్ ప్లే కన్సార్ట్ లో మహిళా ఉద్యోగినితో సరసాలు అతడిని మంచి హోదా నుంచి తప్పుకునేలా చేశాయి.

Astronomer CEO Andy Byron Resigns | డేటా కార్యకలాపాల సంస్థ ఆస్ట్రానమర్ CEO, ఆండీ బైరాన్ చేసిన ఓ తప్పిదానికి ఏకంగా తన పోస్టును కోల్పోవాల్సి వచ్చింది. ఇటీవల బోస్టన్లో జరిగిన కోల్డ్ ప్లే కన్సార్ట్‌లో ఒక మహిళా సహోద్యోగితో ఆయన అత్యంత సన్నిహితంగా కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఆండీ బైరాన్ ఆస్ట్రానమర్ సీఈవో పదవికి రాజీనామా చేశారు. కన్సార్ట్ లో చీఫ్ పీపుల్ ఆఫీసర్ (సీపీఓ) క్రిస్టిన్ కాబోట్ తో సరసాలు ఆడటం కెమెరాలో చిక్కింది. కెమెరాకు వీరు చిక్కిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. దీనిపై స్పందించిన కంపెనీ తక్షణం చర్యలు తీసుకుంది.
ఆస్ట్రానమర్ లింక్డ్ఇన్లో విడుదల చేసిన అధికారిక ప్రకటన ద్వారా సీఈవో ఆండీ బైరాన్ రాజీనామా ధృవీకరించింది. సీఈవో నాయకత్వ ప్రవర్తనలో లోపం ఉందని పేర్కొంది. "మా లీడర్స్, ప్రవర్తన.. జవాబుదారీతనంలో ప్రమాణాలను నెలకొల్పాలని భావిస్తున్నాం. కానీ ఈ సందర్భంగా అది జరగలేదు " అని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
Andy Byron, CEO of Astronomer, was caught at a Coldplay concert apparently having an affair with the company’s CPO, Kristin Cabot.
— Paul A. Szypula 🇺🇸 (@Bubblebathgirl) July 17, 2025
Both Byron and Cabot are married to other people.
Most awkward moment of 2025?pic.twitter.com/bVOTq6XgF8
సీఈవో పదవికి ఆండీ బైరాన్ రాజీనామా
"ఆండీ బైరాన్ ఆస్ట్రానమర్ సీఈవో పదవికి తన రాజీనామాను సమర్పించారు. ఆయన రాజీనామాను ఆస్ట్రానమర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదించారు. సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ పీట్ డిజాయ్ తాత్కాలిక CEOగా కొనసాగనున్నారు. తరువాత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కోసం బోర్డు అన్వేషిస్తోంది’ అని కంపెనీ తెలిపింది. ఈ వారం ముందు, ఇది డేటాఆప్స్ స్పేస్లో ఒక మార్గదర్శకంగా గుర్తింపు పొందింది. ఆధునిక విశ్లేషణల నుండి AI వరకు ప్రతిదానికీ డేటా బృందాలకు సహాయపడుతుందని ఆస్ట్రానమర్ కంపెనీ తెలిపింది.
2023లో CEOగా బాధ్యతలు స్వీకరించిన బైరాన్, నవంబర్ 2024లో సీపీఓ క్రిస్టిన్ కాబోట్‌ను మేజర్ టీంలో భాగం చేశారు. వీడియోలో పాల్గొన్న సహోద్యోగి ఆమెనే. కంపెనీ ఇలాంటి చేష్టలను సీరియస్ గా తీసుకుంటుందని సీఈవో రాజీనామాతో స్పష్టం చేసింది.
Tech firm #Astronomer's #CEO Andy Byron steps down after #Coldplay concert moment goes viral and exposes cheating scandal pic.twitter.com/m7vlY2Z4A3
— ShanghaiEye🚀official (@ShanghaiEye) July 20, 2025
ఆండీ బైరాన్ కోల్డ్ ప్లే కన్సార్ట్ లో మహిళా ఉద్యోగినితో సన్నిహితంగా ఉన్న వీడియో సోషల్ మీడియా, మీడియా దృష్టిని ఆకర్షించింది. ఈ సంఘటన తమ కార్యకలాపాలను ప్రభావితం చేయదని ఆస్ట్రానమర్ తన క్లయింట్స్, వాటాదారులకు హామీ ఇచ్చింది. "మా కంపెనీ గురించి ఒక్క రాత్రిలో ఆలోచన తీరు మారాల్సిన అవసరం లేదు. మా ఉత్పత్తి, మా కస్టమర్ల కోసం.. మేము చేసే పని ఎప్పటికీ మారదు. మేం మా క్లయింట్ల కోసం సంక్లిష్టమైన డేటా, AI సవాళ్లను పరిష్కరించడంపై ఫోకస్ చేశామని ” ఆస్ట్రానమర్ ఓ ప్రకటనలో తెలిపింది. ”
ఎంటర్ప్రైజెస్ విశ్లేషణలు, కృత్రిమ మేధస్సు కోసం వ్యవస్థలను శక్తివంతం చేయడం, డేటాఆప్స్ స్పేస్లో కమాండింగ్ తో ఆస్ట్రోనమర్ టెక్ పరిశ్రమలో గుర్తింపు పొందింది.






















