News
News
X

సెల్ఫీలలో ఎన్ని రకాలున్నాయో తెలుసా ? మీరు దిగే సెల్ఫీ పేరు ఏంటో ఇక్కడ తెలుసుకోండి

Types of Selfies: సెల్ఫీల్లో చాలా రకాలు ఉన్నాయి. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు యువత ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు తీసుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతుంటారు.

FOLLOW US: 
Share:

Do you know how many types of Selfies: ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో సెల్ఫీలకు విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. ఇక ఎక్కడ చూసినా సెల్ఫీల ట్రెండ్ నడుస్తోంది. మొబైల్ చేతిలో ఉండటంతో యువత ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీ ఫొటోలు, సెల్ఫీ వీడియోలు తీసుకుంటారు. వాటిని తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తుంటారు. కానీ కొన్నిసార్లు సెల్ఫీలు పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకున్నవాళ్లు, ఏకంగా ప్రాణాలనే పోగొట్టుకున్న వాళ్లు చాలానే ఉన్నారు. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు యువత ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు తీసుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతుంటారు.

ఈ సెల్ఫీ మోజు స్మార్ట్ ఫోన్ యూజర్లలో రోజురోజుకు ముదురుతోంది. ఫలితంగా కొన్నిసార్లు ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా రైల్వే ట్రాక్స్, స్టేషన్ల వద్ద సెల్ఫీ మోజులో పడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు గతంలో ఎన్నో ఉన్నాయి. సెల్ఫీలలో చాలా రకాలు ఉన్నాయన్న విషయం మీకు తెలుసా.? అవును మీరు చదివింది నిజమే.. సెల్ఫీల్లో చాలా రకాలు ఉన్నాయి. హెల్తీ సెల్ఫీ, వ్యాలిడేషన్‌ సెల్ఫీ, స్నాప్‌ హ్యాపీ సెల్ఫీ, యాంఫిటైజర్‌ సెల్ఫీ, విక్టరీ సెల్ఫీ అంటూ చాలా సెల్ఫీలను ఫాలో అవుతుంటారు యువత. అయితే సెల్ఫీ రకాల పూర్తి వివరాలు మీకోసం..

హెల్తీ సెల్ఫీ:
హెల్పీ సెల్ఫీ.. వినేందుకే కాస్త వెరైటీగా ఉన్నా.. ఈ సెల్ఫీ చాలా స్పెషల్‌ అనే చెప్పాలి. ఎందుకంటే.. సెల్ఫీలు కావాలంటే మనం కేవలం బయటకు వెళ్లినప్పుడు లేదా కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాత్రమే మన ఫ్రెండ్స్‌తో లేదా ఫ్యామిలీలో కలిసి తీసుకుంటాం. అందుకు భిన్నంగా ఉండే సెల్ఫీనే ఈ హెల్తీ సెల్ఫీ. ఇది కేవలం మనం ఆరోగ్యంగా హెల్తీగా ఉన్నామన్న విషయంను తెలిపేందుకే ఈ హెల్తీ సెల్ఫీలను దిగుతుంటాం. ఉదాహరణకు జిమ్‌లో తీసుకునే సెల్ఫీలు కానీ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే సెల్ఫీనే హెల్తీ సెల్ఫీ అంటారు. అంతేకాదు.. ఈ సెల్ఫీ తీసుకునే వ్యక్తి తన భిన్నమైన మానసిక స్థితిని చూపించడానికి ప్రయత్నించడం అని చెప్పొచ్చు. చాలామంది ఒంటరిగా ఉన్నప్పుడు తరచూ ఇలాంటి సెల్ఫీలు తీసుకుంటారు. 

యాంఫిటైజర్ సెల్ఫీ:
ఈ రకమైన సెల్ఫీలు ఆసుపత్రిలో లేదా ఇబ్బందులు పడుతూ తీసుకునే సెల్ఫీలు అనే చెప్పాలి. జబ్బుపడినా, మందు తాగినా, ఇబ్బంది పడినా సెల్ఫీ తీసుకుంటే దాన్ని యాంఫిటైజర్ సెల్ఫీ అంటారు. వాస్తవానికి, ఈ సెల్ఫీని చూసిన తర్వాత, ప్రజలు మిమ్మల్ని ఓదార్చుతుంటారు.

విక్టరీ సెల్ఫీ:
పేరులోనే విక్టరీ ఉంది కాబట్టి.. ఈ రకమైన సెల్ఫీలు ఏదైన గేమ్‌ లేదా ఏదైన సాధించిన సమయంలో మాత్రమే ఈ సెల్ఫీలుర తీసుకుంటారు. జీవితంలో ఏదైనా సాధించి, కీలకమైన పాయింట్‌కి చేరుకుంటే, జాబ్ రావడం, ఉద్యోగంలో ప్రమోషన్, నేతలు ఎన్నికల్లో నెగ్గడం లాంటి ఎన్నో సందర్భాలలో విక్టరీ గుర్తుతో తీసుకునే సెల్ఫీని విక్టరీ సెల్ఫీ అంటారు. 

డక్‌ఫేస్ సెల్ఫీ: 
ఒక రకమైన ఫేస్‌ ఎక్స్‌ ప్రెషన్స్‌ పెట్టడం లేదా బాతు, లేదా పిచ్చుక వంటి పక్షిలా ఎక్స్‌ప్రెషన్స్‌ పెట్టడమే డక్‌ఫేస్‌ సెల్ఫీ. అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి వెరైటీ సెల్ఫీలు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. 

స్నాప్ హ్యాపీ సెల్ఫీ: 
ఇది సెల్ఫీ తీసుకునే వ్యక్తి తన భిన్నమైన మానసిక స్థితిని చూపించడానికి ప్రయత్నించే సెల్ఫీ. ప్రజలు ఒంటరిగా ఉన్నప్పుడు తరచూ ఇలాంటి సెల్ఫీలు తీసుకుంటారు.

వ్యాలిడేషన్‌ సెల్ఫీ: 
మీరు కొత్త హెయిర్ కట్ చేసుకునే ముందు ఆ తర్వాత తీసుకునే సెల్ఫీనే వ్యాలిడేషన్‌ సెల్ఫీ అంటారు. ఇది కాకుండా, అద్దంలో మీ కొత్త లుక్‌తో మీరు తీసుకునే సెల్ఫీని వాలిడేషన్ సెల్ఫీ అంటారు. 

Published at : 04 Dec 2022 06:15 PM (IST) Tags: Selfies Social media selfies photos types of selfies Selfie Photo

సంబంధిత కథనాలు

World Richest Dog: ప్రపంచంలోనే అత్యంత సంపన్న శునకం - రూ.655 కోట్ల ఆస్తులు, ఓ కంపెనీకి యజమాని! 

World Richest Dog: ప్రపంచంలోనే అత్యంత సంపన్న శునకం - రూ.655 కోట్ల ఆస్తులు, ఓ కంపెనీకి యజమాని! 

Bihar Student Fainted: ఎగ్జామ్ హాల్‌లో కళ్లు తేలేసిన కుర్రాడు, పేపర్‌ను చూసి కాదు అమ్మాయిల్ని చూసి

Bihar Student Fainted: ఎగ్జామ్ హాల్‌లో కళ్లు తేలేసిన కుర్రాడు, పేపర్‌ను చూసి కాదు అమ్మాయిల్ని చూసి

Gorakhpur News: కోడలికి వితంతు వివాహం చేసిన మామ- కథలో ట్విస్ట్‌ మామూలుగా లేదు- !

Gorakhpur News: కోడలికి వితంతు వివాహం చేసిన మామ-  కథలో ట్విస్ట్‌ మామూలుగా లేదు- !

Viral Video: వృద్ధుడిపై ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ లాఠీఛార్జ్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Viral Video: వృద్ధుడిపై ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ లాఠీఛార్జ్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Viral News: RRR స్టైల్‌లో ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన, ట్రెండ్‌ ఫాలో అవుతున్న పోలీసులు

Viral News: RRR స్టైల్‌లో ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన, ట్రెండ్‌ ఫాలో అవుతున్న పోలీసులు

టాప్ స్టోరీస్

Telangana budget 2023 : రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ సరే - నిధుల సమీకరణ ఎలా ? తెలంగాణ సర్కార్‌కు ఇదే పెద్ద టాస్క్

Telangana budget 2023 : రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ సరే - నిధుల సమీకరణ ఎలా ? తెలంగాణ సర్కార్‌కు ఇదే పెద్ద టాస్క్

Perni Nani On Kotamreddy : జగన్ పిచ్చి మారాజు అందర్నీ నమ్మేస్తారు, కోటంరెడ్డి నమ్మక ద్రోహం చేశారు - పేర్ని నాని

Perni Nani On Kotamreddy : జగన్ పిచ్చి మారాజు అందర్నీ నమ్మేస్తారు, కోటంరెడ్డి నమ్మక ద్రోహం చేశారు - పేర్ని నాని

PROJECT-K 2 Parts | ప్రాజెక్ట్-K పై నమ్మకంతో Prabhas రిస్క్ చేస్తున్నారా..?| ABP Desam

PROJECT-K 2 Parts | ప్రాజెక్ట్-K పై నమ్మకంతో Prabhas రిస్క్ చేస్తున్నారా..?| ABP Desam

Unstoppable 2 Finale Episode : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా ఓటీటీ పని చేస్తుందా?

Unstoppable 2 Finale Episode : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా ఓటీటీ పని చేస్తుందా?