అన్వేషించండి
Advertisement
Viral News: వినాయకుని మెడలో నాగుపాము - ప్రత్యేక పూజలు చేసిన భక్తులు, వైరల్ దృశ్యాలు
Jagitial News: జగిత్యాల పట్టణంలో సోమవారం వింత జరిగింది. ఓ మండపంలో వినాయక విగ్రహం మెడలో ఓ నాగుపాము ఆభరణంగా నిలిచింది. దీన్ని చూసిన భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు.
Snake In Lord Ganeshas Neck In Jagitial: జగిత్యాల (Jagitial) పట్టణంలో సోమవారం అరుదైన ఘటన చోటు చేసుకుంది. గణేశుని విగ్రహం మెడలో ఓ నాగుపాము అలంకారంగా మారింది. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వాణినగర్‌లోని త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో 40 అడుగుల భారీ వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం యథావిధిగా భక్తులు పూజలు చేస్తున్న సమయంలో ఓ నాగుపాము హల్చల్ చేసింది. పాక్కుంటూ వెళ్లి గణపతి మెడలో చుట్టుకుని అలంకారంగా మారింది. కొంతసేపు అలాగే ఉండి అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ దృశ్యాలను చూసిన భక్తులు అవాక్కయ్యారు. సోమవారం కావడంతో శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగుపాము ఆయన కుమారుడి మెడలోకి చేరిందంటూ ప్రత్యేక పూజలు చేశారు. ఇది నిజంగా విశేషమంటూ పేర్కొన్నారు. కాగా, ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
నిజామాబాద్
మొబైల్స్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion