అన్వేషించండి

BJP Maheshwar Reddy: నెలాఖరులో బీఆర్ఎస్‌లో చీలిక - జోస్యం చెప్పిన బీజేపీ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి

BRS: బీఆర్ఎస్‌లో నెలాఖరులోపు చీలిక వస్తుందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి జోస్యం చెప్పారు. ప్రతిపక్ష నేతగా హరీష్ రావును నియమిస్తారని అయనంటున్నారు.

Yeleti Maheshwar Reddy predicts a split in BRS :  హ‌రీష్ స‌హ‌కారంతో BRSLPలో చీలిక తెచ్చి  ప్ర‌తిప‌క్ష నేతగా కేసిఆర్ స్ధానంలో హ‌రీష్ ను నియ‌మిచండం … ఇటు శాస‌న‌మండ‌లిలోనూ BRS ఎమ్మెల్సీల్లో చీలిక తెచ్చి మ‌ధుసూద‌నా చారి స్ధానంలో క‌విత‌ను ప్ర‌తిప‌క్ష నేత‌ను చేయ‌డం అనే వ్యూహాల‌ను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు.  బీఆర్ఎస్ లో తాము కేటిఆర్ చేతిలో ప‌డుతున్న అవ‌మానాల‌కు కౌంట‌ర్ ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డితో హ‌రీష్, క‌విత‌ చేతులు కలుపుతున్నారని చెప్పుకొచ్చారు. 

   బీఆర్ఎస్ లో  కీలక నేతల మధ్య  రాజ‌కీయ విభేదాలు కొద్ది రోజులుగా కొనసాగుతున్నాయే త‌ప్ప కొలిక్కి రావ‌డం లేదని..   ర‌జ‌తోత్స‌వ స‌భ నిర్వ‌హ‌ణ‌లో పెత్త‌న‌మంతా తండ్రీ, కొడుకుల‌దే కావ‌డం, కూతురు, మేన‌ల్లుడు ప్రేక్ష‌క పాత్ర‌కే ప‌రిమిత‌మయ్యారన్నారు.  కేసిఆర్ గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత అనారోగ్యంతో పాటు ఇత‌ర‌త్రా కార‌ణాల వ‌ల్ల రాజ‌కీయంగా క్రియాశీల‌కంగా లేరు.   ర‌జ‌తోత్స‌వ స‌భ‌లో మాట్లాడారే త‌ప్ప అంత చురుగ్గా లేరు. పార్టీ నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల‌ను వ‌ర్కింగ్ ప్ర‌సిడెంటు అయిన కేటిఆర్ చూస్తున్నారు. స్వ‌యంగా కేసిఆరే పార్టీ నేత‌ల‌కు కేటిఆర్ ను క‌ల‌వండ‌ని చెప్తున్నారు.  క‌విత‌, హ‌రీష్ రావుల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. 

 బీఆర్ఎస్ లో పెత్త‌న‌మంతా కేటిఆర్ దే అనే సంకేతాల‌ను కేసిఆర్ త‌మ పార్టీ క్యాడ‌రుకు ఇచ్చిన‌ట్ల‌యింది. ఇలా అయితే పార్టీలో త‌మ ప‌రిస్ధితి ఏంటి అని హ‌రీష్ రావు, క‌విత‌లు ఇద్ద‌రూ కేసిఆర్ ను అడిగారట‌. ఈ నేప‌ధ్యంలోనే బీఆర్ఎస్ లో అంతర్గత కుమ్ములాటలు సాగుతున్నాయని ... కవిత, హరీశ్ రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని మీడియాలోక‌థ‌నాలు వ‌చ్చాయన్నారు. బీఆర్ఎస్ లో త‌న‌కు స‌రైన గుర్తింపు, గౌర‌వం ద‌క్క‌డం లేద‌నేది ఎమ్మెల్సీ క‌విత ఆరోప‌ణ‌. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న‌ నిర్ణయాన్ని వ్యతిరేకించ‌డం, మ‌హాత్మ జ్యోతిబా ఫూలే విగ్ర‌హాన్ని అసెంబ్లీ ప్రాంగ‌ణంలో పెట్టాల‌నే డిమాండుతో బీసీల‌ను చేర‌దీసేలా ఎమ్మెల్సీ క‌విత చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌కు BRS నుండి ఆమె ఆశించిన విధంగా మద్దతు రాలేదు. సామాజిక తెలంగాణ సాధన, మహిళా సమానత వంటి అంశాల్లో బీఆర్ఎస్ స‌ర్కార్ విఫ‌ల‌మైందంటూ క‌విత మాట్ల‌డ‌డం వ్యూహాత్మ‌క‌మేనన్నారు. 
 
 . కేసిఆర్ ప‌దేళ్ల పాల‌న‌లో అవినీతి ద్వారా జ‌మ చేసిన‌ వేలకోట్ల సొమ్మును త‌న కుమారుడు కేటిఆర్ కే ఇస్తున్నార‌ని, ప‌ద‌వులు, డ‌బ్బులు అన్నీ ఆయ‌న‌కే ఇవ్వ‌డంతో క‌విత తిరుగుబాటు జెండా ఎగ‌ర‌వేస్తున్నారని ఏలేటి చెప్పుకొచ్చారు.   త‌న‌ మీద కుట్రలు ఎవరు చేస్తున్నారో తెలుసని, ఆర్నెళ్లు జైల్లో ఉన్న త‌న‌ను ఇంకా కష్టపెడతారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. త‌న‌పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని బీఆర్ఎస్ పెద్ద‌లు ఖండించాల‌ని, నన్ను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తాననని క‌విత ఒక రేంజ్ లో మాట్లాడారు. క‌విత మాటల‌ను బ‌ట్టి ఆమెకు బీఆర్ఎస్ త‌గిన గుర్తింపు, గౌర‌వం ద‌క్క‌డం లేద‌ని, పార్టీలో ఇబ్బందిప‌డుతున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోందన్నారు.  

త‌న సొంత పార్టీ బీఆర్ఎస్ పై క‌విత అసంతృప్తి వ్య‌క్తం చేసిన మ‌రుస‌టి రోజే అంటే మే 13న హ‌రీష్ రావు తెలంగాణ భ‌వ‌నులోనే మీడియా స‌మావేశంలో బీఆర్ఎస్ అధ్య‌క్ష‌ బాధ్యతలు కేటీఆర్ కు అప్పగించినా తనకు అభ్యంతరం లేదని ప్రకటించారు. క‌విత చేసిన కామెంట్సుతో బీఆర్ఎస్ క్యాడ‌రులో గంద‌ర‌గోళం నెల‌కొంటోంద‌ని గ్ర‌హించిన కేసిఆర్, దానిని త‌గ్గించాల‌నే ఆలోచ‌న‌తో, కవిత మాదిరిగా హ‌రీష్ అసంతృప్తిగా లేడ‌ని బ‌య‌టి ప్ర‌పంచానికి చెప్పెందుకే హ‌రీష్ రావుతో ఆ స్టేట్ మెంట్ ఇప్పించార‌ని చెప్పుకొచ్చారు.  

బీఆర్ఎస్ శాస‌న‌స‌భాప‌క్షం చీలుతుంద‌నే భ‌యం కేటిఆర్ ను వెంటాడుతోంది. హ‌రీష్ ను కాద‌ని తాను ప్ర‌తిప‌క్ష నేత ప‌ద‌వి తీసుకుంటే BRSLPలో చీలిక వ‌స్తుందేమో అనే ఆందోళ‌న కేటిఆర్ ను వెంటాడుతోంది. ఇప్ప‌టికే బీఆర్ఎస్ ను వీడి ప‌ది మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పంచ‌న చేరారు. ఇపుడు హ‌రీష్ వెంట 13 మంది క‌విత వెంట న‌లుగురు మొత్తం 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నార‌ని, కాంగ్రెసులో చేరిన వారిని కూడా కలుపుకుంటే వీరంతా క‌లిసి 27 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఇపుడు కాంగ్రెస్ స‌ర్కారు స‌హ‌కారంతో హ‌రీష్ రావు BRSLPని చీల్చి ప్ర‌తిప‌క్ష నేత అవుతార‌నేది పొలిటిక‌ల్ టాక్. ఈ మేర‌కు సీఎం రేవంత్ రెడ్డి కూడా పూర్తిగా స‌హ‌క‌రిస్తారని అది ఒప్పందమని ఏలేటి అంటున్నారు.  కౌన్సిల్ లో బీఆర్ఎస్ కు 25 మంది స‌భ్యులున్నారు. వీరిలో మూడింట రెండు వంతుల ఫార్ములా ప్ర‌కారం ఎమ్మెల్సీ క‌విత శిబిరానికి 17 మంది స‌భ్యులు అవ‌స‌రం. ఆ మేర‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల్లో 17 మంది మ‌ద్ద‌తు క‌విత‌కు ద‌క్కే ఛాన్స్ ఉందని అంటున్నారు. 

మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయాల్లో కలకకలం రేపుతున్నాయి. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Trimukha Movie Release Date: సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
Tata Sierra Dealership: టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
Embed widget