అన్వేషించండి

TRS : కవిత టీఆర్ఎస్ పేరుకు ఈసీ అనుమతి ఇవ్వదని బీఆర్ఎస్ ఆశ - చట్టాలేం చెబుతున్నాయంటే ?

TRS Name Issue: టీఆర్ఎస్ పార్టీ పేరుకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వదని బీఆర్ఎస్ నేతలు సర్ది చెప్పుకుంటున్నారు. మరి చట్టం ఏం చెబుతోంది?

Will Election Commission approve  TRS name: తెలంగాణ ప్రజల గుండెల్లో బలంగా నాటుకుపోయిన టీఆర్ఎస్  అనే పేరు ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేసే అంశంగా మారుతోంది. జాతీయ రాజకీయాల కోసం కేసీఆర్  తన పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చినా  క్షేత్రస్థాయిలో  తెలంగాణ  అనే పదం లేకపోవడం ఒక లోటుగా మిగిలిపోయింది. అదే అవకాశంగా  కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ ప్రకటన చేశారు.   

పార్టీ పేరును ఈసీ ఆమోదించదని బీఆర్ఎస్ నేతల ఆశ

కవితపార్టీ పేరును ఎన్నికల సంఘం ఆమోదించదని బీఆర్ఎస్ నేతలు ఆశాభావంతో ఉన్నారు. అసలుకు..నకిలీకి చాలా తేడా ఉంటుందని బీఆర్ఎస్ సెటైర్లు వేస్తోంది.  ఆ పార్టీ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి టీఆర్ఎస్ పేరును ఈసీ ఆమోదించదు కాబట్టి బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చెందాల్సినపనిలేదని అంటున్నారు. 

  
సాంకేతిక ఖాళీ.. ఈసీ నిర్ణయం ఎలా ఉంటుంది?
 
భారత ఎన్నికల సంఘం రికార్డుల ప్రకారం, ఒకసారి ఒక పార్టీ తన పేరును అధికారికంగా మార్చుకున్నప్పుడు, పాత పేరు  ఫ్రీ పూల్ లోకి వెళ్తుంది. అంటే సాంకేతికంగా తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు ప్రస్తుతం ఖాళీగానే ఉంది. అయితే, ఎన్నికల గుర్తుల రూల్స్  ప్రకారం, ఓటర్లను తప్పుదోవ పట్టించేలా  ఉన్న పేర్లను కేటాయించకూడదని ఈసీకి విచక్షణాధికారం ఉంటుంది. దశాబ్దాల చరిత్ర ఉన్న టీఆర్ఎస్ పేరును వేరొకరికి ఇవ్వడం వల్ల ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని బీఆర్ఎస్ గట్టిగా వాదించవచ్చు. కానీ ఇక్కడ కవిత నేరుగా తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు పెట్టలేదు.  తెలివిగా.. తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టారు. షార్ట్ కట్ పేర్లను ఈసీ పెద్దగా పట్టించుకోకపోవచ్చు. 

కవితకు పార్టీ పేరు అందకుండా కేసీఆర్ న్యాయపోరాటం ఖాయం

తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ప్రజలు టీఆర్ఎస్ ను తమ సొంత ఇంటి పార్టీగా భావించారు. బీఆర్ఎస్‌గా మారిన తర్వాత, ఆ పార్టీకి ఉన్న ప్రాంతీయ బ్రాండ్ ఇమేజ్ కొంత మసకబారిందనేది కాదనలేని వాస్తవం. అందుకే  టీఆర్ఎస్ పేరు కోసం కవిత ఈసీకి దరఖాస్తు చేసినప్పుడు, బీఆర్ఎస్ కచ్చితంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ఈసీ అనుమతిస్తే   ఢిల్లీ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు వరకు వెళ్లే అవకాశం ఉంది. అయితే, ఈ న్యాయపోరాటం ఫలితం ఎలా ఉన్నా, ఆ ప్రక్రియలో జరిగే చర్చ ప్రజల్లోకి నెగటివ్ సంకేతాలను పంపుతుంది.  తమ పాత పేరును కూడా కాపాడుకోలేకపోతున్నారా " అనే భావన ప్రజల్లో కలిగితే అది పార్టీ నైతిక బలాన్ని తగ్గిస్తుంది. బీఆర్ఎస్ ఈ చర్చను కొనసాగించాలా లేదా అన్నది వారు ఖరారు చేసుకునే వ్యూహాలను బట్టి ఉంటుంది. 
 
పేరు  వెనుక ఉన్న పవర్ పాలిటిక్స్ 

రాజకీయాల్లో గుర్తు కంటే  పేరు కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, ముఖ్యంగా ప్రాంతీయ ఆకాంక్షలతో ముడిపడినప్పుడు. అందుకే  బీఆర్ఎస్‌ ఇప్పుడు ఇరకాటంలో పడటం ఖాయం . టీఆర్ఎస్  అనేది కేవలం మూడు అక్షరాలు మాత్రమే కాదు.. అది తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పగల ఒక శక్తివంతమైన ఆయుధం. టీఆర్ఎస్ పేరు తిరిగి తెరపైకి రావడం అదీ కూడా కవిత వైపు నుంచి రావడం  బీఆర్ఎస్‌కు అతిపెద్ద రాజకీయ ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది. సాంకేతికత కంటే రాజకీయ సెంటిమెంటే ఇక్కడ కీలక పాత్ర పోషించనుంది. 

టాప్ హెడ్ లైన్స్

Khairatabad By-Election | ఖైరతాబాద్ ఉపఎన్నిక..  ఇక్కడ ఓటమి ఖరీదు చాలా ఎక్కువ
Khairatabad By-Election | ఖైరతాబాద్ ఉపఎన్నిక..  ఇక్కడ ఓటమి ఖరీదు చాలా ఎక్కువ
Khairatabad Assembly Seat: దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు గెజిట్ విడుదల
దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు గెజిట్ విడుదల
AP TS Weather: తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం.. ఏపీలో వర్షాలు, తెలంగాణలో ఎండలు!
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం.. ఏపీలో వర్షాలు, తెలంగాణలో ఎండలు!
Congress Protest Against SIR: సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్.. ఖైరతాబాద్‌లో దిమ్మతిరిగే రిజల్ట్ ఖాయమన్న దానం
CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్.. ఖైరతాబాద్‌లో దిమ్మతిరిగే రిజల్ట్ ఖాయమన్న దానం

వీడియోలు

Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Kuldeep Yadav Magical Spell vs WI | వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం
Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Bharosa Pension: ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
ఏపీలో పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. ఆలస్యంగా కాదు, 1వ తేదీనే పింఛ‌న్ల పంపిణీ
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Amaravati ORR: 4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
TMC Election Symbol: టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
Sindhu Fires on Schedule: 18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
This Week OTT Movies : అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
Former MP Vijayasai Reddy: తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
Embed widget