అన్వేషించండి

Congress Politics : కాంగ్రెస్‌లోకి 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - లెక్క చెప్పిన విప్ బీర్ల ఐలయ్య !

Telangana News : 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని విప్ బీర్ల ఐలయ్య ప్రకటించారు. ప్రజాపాలన మెచ్చే వారు తమ పార్టీలోకి వస్తున్నారంటున్నారు.

26 BRS MLAs will join the Congress :   కాంగ్రెస్ పార్టీతో 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఎమ్మెల్యేలు తమ పార్టీ నేతలతో చర్చలు జరిపారని, రేపో, మాపో చేరడం ఖాయం అని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతోన్న ప్రజాపాలనకు ఆకర్షితులై ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేయాల్సిన అవసరం తమకు లేదని బీర్ల ఐలయ్య స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అందరికీ అందుబాటులో ఉంటారని, ప్రజా సంక్షేమమే తమకు ముఖ్యం అని బీర్ల ఐలయ్య వివరించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి అందుబాటులో ఉంటారని వెల్లడించారు. 

తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 64 మంది సభ్యులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి 39 మంది సభ్యులు ఉన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ స్థానానికి మే 13వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. బీఆర్ఎస్ 38 మంది సభ్యుల్లో 26 నుంచి 30 మంది సభ్యులు తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే  గేట్లు తెరిచామని కాంగ్రెస్ ట్వీట్ చేసిన మరుసటి రోజే   ఖైరతాబాద్ బీఆర్ఎస్  ఎమ్మెల్యే దానం నాగేందర్..చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారని ఐలయ్య చెబుతున్నారు.  

కాంగ్రెస్ పాలన చూసి బీజేపీ, బీఅర్ఎస్ లు ఓర్వలేక పోతున్నాయని విమర్శించారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య.  బీసీలు తల దించుకునేలా ఈటల రాజేందర్ మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. మల్కాజిగిరిలో ఈటల గెలవడానికి బీజేపీ బీఅర్ఎస్ తో చీకటి ఒప్పందం చేసుకుందని, రేవంత్ రెడ్డి పై ఈటల రాజేందర్ చేసిన వాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు. ఈటల గెలవడానికి మల్కాజ్‌గిరిలో బీఅర్ఎస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈటల గెలుపు కోసం కేసీఆర్ తురుము ఖాన్ అంటూ పొగుడుతున్నారని, ఫోన్ ట్యాపింగ్ చేసింది బీజేపీ, బీఅర్ఎస్ లు కాదా అని ఆయన ప్రశ్నించారు.
 
’ఫోన్ ట్యాపింగ్ లకు కాంగ్రెస్ వ్యతిరేకం.. ఫోన్ ట్యాపింగ్ ల సంస్కృతి బీజేపీ, బీఅర్ఎస్ పార్టీలది.. మా పార్టీ సంస్కృతి కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనను బీజేపీ, బీఅర్ఎస్ లుజీర్ణించుకోలేకపోతున్నాయి.. మల్కాజిగిరి లో బీజేపీ, బీఅర్ఎస్ లు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయి.. బీజేపీ, బీఅర్ఎస్ లు చౌక బారు రాజకీయాలు మానుకోవాలి రాష్ట్రంలో బీజేపీ, బీఅర్ఎస్ లకు డిపాజిట్లు కూడా రావు.. మత చిచ్చు పెట్టి ఓట్లు దందుకోవాలని బీజేపీ చూస్తోంది.. బీజేపీ, బీఅర్ఎస్ ల చీకటి ఒప్పందాలు ప్రజలు చూస్తున్నారు.. రేవంత్ రెడ్డిపై చిల్లర మల్లర వాఖ్యలు చేస్తున్నారు.. గతంలో గడీల పాలన ఉంటే నేడు ప్రజా పాలన కొనసాగుతోంది. ప్రజా పాలన చూసి మిగితా పార్టీ వాళ్ళు కాంగ్రెస్ లోకి వస్తున్నారు.. ఎంపీ ఎలక్షన్ తరువాత బీజేపీ, బీఅర్ ఎస్ ఖాళీ అవుతుందన్నారు. 

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని చెబుతున్నారు. ఈ క్రమంలో 26 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుంటే.. మూడింట రెండు వంతుల మంది  అవుతారని.. విలీనం  చేసుకోవచ్చని భావిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 
ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Revanth Reddy Challenges KCR: సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget