(Source: ECI/ABP News/ABP Majha)
Weather Latest Update: తెలుగు రాష్ట్రాలకు స్వల్ప వర్షాలకు అవకాశం, 6-10 కి.మీ. వేగంతో గాలులు
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.
Telangana Weather: ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు వాయువ్య /పశ్చిమ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు శనివారం (ఆగస్టు 27) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు (Rains in Hyderabad) అక్కడక్కడ రేపు, ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తూర్పు, ఈశాన్య జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
Hyderabad Weather: హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు (Temperature in Hyderabad) వరుసగా 33 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 33.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.5 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలిలో తేమ 84 శాతంగా నమోదైంది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) August 26, 2023
ఏపీలో ఇలా
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లోనూ నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి చినుకులు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉందని అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో గాలులు గంటకు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. రాయలసీమలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని వివరించారు. కొన్ని చోట్ల బలమైన గాలులు పలు చోట్ల వీచే అవకాశం ఉందని వెల్లడించారు.
ఉత్తరాదిలో చురుగ్గా రుతుపవనాలు
రెండు రోజుల క్రితం ఉదయం నుంచి సాయంత్రం వరకు అడపాదడపా కురుస్తున్న భారీ వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీ వాతావరణం (Delhi Weather) ఆహ్లాదకరంగా మారింది. ఢిల్లీలో ఉష్ణోగ్రత కూడా సగటు కంటే తక్కువగా ఉంది. ఢిల్లీలో నేటి వాతావరణం స్పష్టంగా ఉంటుంది. అయితే కొన్ని చోట్ల మేఘావృతమై ఉంటుంది. శనివారం కూడా 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భారత వాతావరణ విభాగం ప్రకారం, రాబోయే 24 గంటల్లో వర్షాలు స్వల్పంగా ఉండే అవకాశం ఉంది.
భారత వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, గత 24 గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రత 33.2 డిగ్రీలుగా నమోదైంది, ఇది సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువ. కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే రెండు డిగ్రీలు తక్కువగా 24.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. మొన్నటి వరకు 36 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతూ వచ్చింది. సోమవారం మాత్రమే గరిష్ట ఉష్ణోగ్రత 38.1 డిగ్రీలకు చేరుకుంది. ఆగస్టు నెలలో ఇది గరిష్ట ఉష్ణోగ్రత. మరోవైపు బుధవారం ఉదయం నుంచి ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా ఢిల్లీ ఎన్‌సీఆర్ వాతావరణం పూర్తిగా మారిపోయింది. రానున్న 3 రోజుల పాటు అంటే ఆగస్టు 30 వరకు ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.