Weather Latest Update: నేడు భారీ వర్షాలు, ఈదురుగాలులు - ఆరెంజ్ అలర్ట్ జారీ
ఏపీలో నేడు భారీ వర్షం దక్షిణ కోస్తా, రాయసీమ ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఈరోజు ద్రోణి /గాలి అనిచ్చితి పశ్చిమ విదర్భ నుండి మరత్వాడ ,ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్రమట్టం నుండి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
దీని ప్రభావంతో రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా చోట్ల వచ్చే అవకాశం ఉంది. ఈరోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షం, వడగళ్ళతో పాటు రాగల మూడు రోజులు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి 40 నుండి 50 కిమీ వేగంతో) కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.
నేడు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, వడగండ్లు, భారీ వర్షాలు, ఈదురు గాలులు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 21 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశల నుంచి గాలులు గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 32.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 19.6 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 88 శాతం నమోదైంది.
ఏపీలో వర్షాలు ఇలా
ఏపీలో నేడు భారీ వర్షం దక్షిణ కోస్తా, రాయసీమ ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. భారీ వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో వీస్తాయని ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఈ ప్రభావం ఉంటుందని తెలిపారు.
ఢిల్లీలో వాతావరణం ఇలా
దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాతావరణం ఆహ్లాదకరంగా మారడమే కాకుండా మే నెలలో చలి కూడా మొదలైంది. సోమవారం గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 13 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదైందంటే వాతావరణంలో పెద్ద ఎత్తున మార్పును అంచనా వేయవచ్చు. గత 13 ఏళ్లలో ఇది రెండోసారి. అంతకుముందు 2021 సంవత్సరంలో కూడా, మేలో ఉష్ణోగ్రతలో బాగా తగ్గుదల నమోదైంది, భారీ వర్షాల కారణంగా, ఒకే రోజులో ఉష్ణోగ్రత 23 డిగ్రీలు పడిపోయింది.
ఢిల్లీ సఫ్దర్‌జంగ్ స్టాండర్డ్ అబ్జర్వేటరీ ప్రకారం, గత 24 గంటల్లో, సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు 14.8 మిల్లీలీటర్ల వర్షం నమోదైంది. అదే సమయంలో ఢిల్లీ యూనివర్శిటీ సమీపంలోని రిడ్జ్ ప్రాంతంలో 21.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారత వాతావరణ విభాగం (IMD) యొక్క డేటా ప్రకారం, 2021 సంవత్సరంలో, ఏప్రిల్‌లో 100 మిమీ కంటే ఎక్కువ వర్షపాతం కారణంగా, ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 23.8 డిగ్రీల సెల్సియస్ తగ్గింది. 2011 నుండి, ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ రెండుసార్లు మాత్రమే నమోదైంది.
IMD ఎల్లో అలర్ట్
ఈరోజు, రేపు ఢిల్లీకి IMD ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఐఎండీ ప్రకారం ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. ఉరుములతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. గురువారం కూడా ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉంది. ఢిల్లీలో కొన్ని చోట్ల చినుకులు పడే అవకాశం ఉంది. శుక్ర, శని, ఆదివారాల్లో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.