Weather Latest Update: రెండ్రోజుల్లో బంగాళాఖాతంలో మరో ఆవర్తనం - నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు- ఐఎండీ
తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా చోట్ల, ఎల్లుండి అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.
నిన్నటి ఉత్తర జార్ఖండ్, దాని పరిసర ఉత్తర ఛత్తీస్‌గఢ్ - ఉత్తర అంతర్గత ఒడిషా వద్ద ఉన్న అల్పపీడనం ఈరోజు బలహీన పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అయితే దీని అనుబంధ ఆవర్తనం ఈ రోజు దక్షిణ జార్ఖండ్, దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి సుమరు 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి నైరుతి వైపు వాలి ఉంది. సుమారు 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద సముద్ర మట్టానికి సుమరు 4.5 కి.మి, 7.6 కి.మీ మధ్యలో గాలి వీచ్ఛిన్నతి కొనసాగుతోంది. రాగల 48 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో మరొక ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా చోట్ల, ఎల్లుండి అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు ఉరుములు మెరుపులుతో కూడిన భారీ వర్షాలు, రేపు భారీ వర్షాలు, ఎల్లుండి భారీ నుండి అతి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.
తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, కామారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా చినుకులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 29 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ దిశ నుంచి గాలి వేగం గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 29.9 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.4 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 95 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
‘‘కడప జిల్లాలో మొదలైన వర్షాలు నేరుగా తిరుపతి జిల్లాలోకి విస్తరిస్తోంది. గత కొంత సేపటి వరకు నెల్లూరు జిల్లాలో వర్షాలు పడ్డా ఇప్పుడు ఆ వర్షాలు తిరుపతి నగరంలోకి అలాగే తిరుపతి జిల్లాలోని పలు భాగాల్లోకి విస్తరిస్తోంది. గతంలో చెప్పిన విధంగానే ఈ వర్షాలు ఐదు నిమిషాల వరకు గట్టిగా పడి తగ్గిపోతుంది. తిరుపతి పరిసరాలైన పుత్తూరు, నగరి, అలాగే చిత్తూరు జిల్లాలోని పలు భాగాల్లో అక్కడక్కడ వర్షాలను చూడగలము’’
‘‘రుతుపవనాలు చురుగ్గా కదలటం వలన సాయంకాలానికి అనంతపురం జిల్లాలోని తూర్పు భాగాల్లో వర్షాలు మొదలైంది. ఈ వర్షాలు కడప, నెల్లూరు జిల్లాల్లోని పలు భాగాల్లోకి మరో రెండు గంటల్లో విస్తరించే అవకాశాలు ప్రస్తుతం కనిపిస్తోంది. కొన్ని భాగాల్లో మాత్రమే ఈ వర్షాలుంటాయి. మరోవైపున శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో చినుకులు కొనసాగనున్నాయి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.