(Source: ECI/ABP News/ABP Majha)
Weather Latest Update: తెలంగాణలో మరింత పెరిగిన ఉష్ణోగ్రత, నేడు ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్! - ఐఎండీ
Heat Weaves in Telangana: వడగాల్పులు తెలంగాణ రాష్ట్రంలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు.
Weather Latest News: ద్రోణి ఒకటి దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుండి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి. మీ ఎత్తులో ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు పశ్చిమ, వాయువ్య దిశల నుండి వీస్తున్నాయని అంచనా వేశారు. ఈ రోజు, రేపు మరియు ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం వుంది. ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడ అక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
ఇక్కడ ఆరెంజ్ అలర్ట్
మే 3న దీర్ఘకాల వడగాలులు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
వడగాల్పులు తెలంగాణ రాష్ట్రంలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 42 డిగ్రీలు, 29 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వాయువ్య దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 42.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 29.2 డిగ్రీలుగా నమోదైంది. 21 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: మే 1 నాటికి సగటు సముద్రమట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి అంతర్గత కర్ణాటక వరకు విదర్భ, మరాఠ్వాడ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా ఏర్పడి ఈ రోజు తక్కువగా గుర్తించినట్లుగా అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో దక్షిణ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. మే 2 నాటికి దక్షిణ ఛత్తీస్ గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ తెలంగాణ, రాయలసీమ మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని అధికారులు తెలిపారు.
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. వేడి రాత్రులు ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడవచ్చని వాతావరణ అధికారులు తెలిపారు.