Weather Latest Update: నేడు తేలికపాటి వర్షాలే - ఏపీలో ఈదురుగాలులకు అవకాశం: ఐఎండీ
Weather warnings: ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో అక్కడ అక్కడ ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే అవకాశం వుంది.
Weather Latest Update: నేడు తేలికపాటి వర్షాలే - ఏపీలో ఈదురుగాలులకు అవకాశం: ఐఎండీ
Weather Latest News: ఆగస్టు 9న హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆవర్తనం ఒకటి దక్షిణ ఝార్ఖండ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 5.8 కి. మీ నుండి 7.6 కి. మీ. ఎత్తు మధ్య కేంద్రీకృతమై ఉన్నది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ వైపుకు వంగి వున్నది. ప్రధానంగా క్రింది - స్థాయి గాలులు పశ్చిమ మరియు వాయువ్య దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్నాయి.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన (Weather Forecast):
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల, రేపు మరియు ఎల్లుండి అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది.
వాతావరణ హెచ్చరికలు (weather warnings)
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో అక్కడ అక్కడ ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే అవకాశం వుంది.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ, వాయువ్య దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 6 - 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 30.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.4 డిగ్రీలుగా నమోదైంది. 90 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: ఏపీ, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. ఆగస్టు 9న అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపారు.