News
News
X

Warangal News: వరంగల్ కాంగ్రెస్ కార్పొరేటర్ పై భూ కబ్జా కేసు నమోదు!

Warangal News: వరంగల్ జిల్లాలో భూ అక్రమణలకు పాల్పడిన ప్రజాప్రతినిధులపై అరెస్టుల పర్వం కొనసాగుతోంది. నిన్న కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ ను అరెస్ట్ చేయగా.. ఈరోజు మరో కార్పొరేటర్ ను అరెస్ట్ చేశారు.

FOLLOW US: 
Share:

Warangal News: పార్టీలకు అతీతంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా  భూ ఆక్రమణలకు పాల్పడుతున్న కబ్జాదారులపై వరంగల్ కమిషనరేట్ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. ఇందులో భాగంగానే కాజీపేట సోమిరెడ్డి ప్రాంతంలో ఐదు గుంటల భూమిపై కన్నేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ పై గత రాత్రి మడికొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి భూమి యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు  పోలీసులు, రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో ప్రాథమిక విచారణ జరిపారు. ఈ క్రమంలోనే కార్పొరేటర్ జక్కుల రవీందర్ భూ ఆక్రమణకు పాల్పడినట్లుగా నిర్ధారించారు. వెంటనే భూ ఆక్రమణ దారుడు జక్కుల రవీందర్ పై కేసు నమోదు చేశారు. గత కొద్ది రోజులుగా  వరంగల్ కమిషనర్ పోలీసులు కబ్జారాయుళ్లపై అణచివేత ధోరణిని ప్రదర్శిస్తూ సామాన్య ప్రజలకు పోలీసులు అండగా నిలుస్తుండడంతో.. తమ భూములు, స్థలాలను భూ అక్రమణదారుల నుండి పరిరక్షించుకోవడం కోసం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు.

200 గజాల భూమి కబ్జా - డెవలప్ మెంట్ పేరుతో హై డ్రామా

హన్మకొండ కాకతీయ కాలనీ ఫేజ్–2లోని 200 గజాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అనుచరుడు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడో డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ ​డెవలప్​మెంట్ పేరుతో తమకు అప్పగించాల్సిందిగా ల్యాండ్​ ఓనర్​ సునీత దంపతులను హెచ్చరించాడు. వాళ్లు నో చెప్పడంతో.. తన అనుచరులతో కలిసి ల్యాండ్​మీదికి వెళ్లి కాంపౌండ్​వాల్​ను కూల్చేశాడు. అయితే తమను బెదిరించడంతోపాటు ఆస్తి ధ్వంసం చేయడంతో బాధితులు ఐదు రోజుల క్రితం హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్​ఆదేశాలతో కార్పొరేటర్​ వేముల శ్రీనివాస్​తో పాటు అతడి డ్రైవర్​ పడాల కుమార స్వామిపై ఐపీసీ 427, 447, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో నిందితులకు వైద్య పరీక్షల అనంతరం హనుమకొండ సెకండ్​ జేఎఫ్​సీఎం ముందు హాజరు పరిచి, మేజిస్ట్రేట్ ​ఆదేశాలతో ఖమ్మం జైలుకు వేముల శ్రీనివాస్ ను తరలించారు.

మరో ఘటనలో అరెస్ట్..

దేశాయిపేటలోని సర్వేనంబర్ 90/బిలో భూమిని అక్రమణ చేసేందుకు యత్నించిన వరంగల్ నగరానికి చెందిన పొక్కులు చిరంజీవిరావు, గొడాసి అశ్విన్ కుమార్, సురోజు రమేష్ లను ఇంతేజార్గంబీ పోలీసులు అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు బొమ్మకంటి శ్రీనివాస్, మునుగంటి రమేష్ లు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ సంఘటనలో నిందితులు తప్పుడు పత్రాలను సృష్టించడంతో పాటు ప్రభుత్వ సూచించిన ధరల పట్టేక కన్న అతి తక్కువ ధరకు భూమిని ఎలాంటి లావాదేవీలు జరగకున్న క్రయ విక్రయాలు జరిగినట్లుగా లేని భూమికి సంబంధించి ప్రతాలను సృష్టించారు ఈ నిందితులు. 

దేశాయిపేటలోని సర్వే నంబర్ 90/బి భూమి తాము కొనుగోలు చేసినట్లుగా నిందితులు అసలు భూ యజమానులను బెదిరించి భూమిని ఆక్రమించడంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో ఇంతేజార్ గంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో భాగంగా క్షేత్ర స్థాయితో పాటు భూమి సంబంధించి పత్రాలను పరిశీలించిన పోలీసులు నిందితులు భూ ఆక్రమణకు పాల్పడినట్లుగా ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Published at : 22 Jan 2023 09:11 PM (IST) Tags: Telangana News Warangal News Land Encroachment Case Warangal Corporators Warangal Congress Corporator

సంబంధిత కథనాలు

KTR: దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్, మా దారిలోనే ఇతర రాష్ట్రాలు ప్లాన్ : మంత్రి కేటీఆర్

KTR: దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్, మా దారిలోనే ఇతర రాష్ట్రాలు ప్లాన్ : మంత్రి కేటీఆర్

Telangana CS Shanti Kumari: కంటి వెలుగు, పోడు పట్టాలు, టీచర్ల బదిలీలపై సీఎస్ శాంతి కుమారి సమీక్ష

Telangana CS Shanti Kumari: కంటి వెలుగు, పోడు పట్టాలు, టీచర్ల బదిలీలపై సీఎస్ శాంతి కుమారి సమీక్ష

Warangal: చైన్ స్నాచింగ్ కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు - బైక్, క్యాష్, బంగారం స్వాధీనం

Warangal: చైన్ స్నాచింగ్ కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు - బైక్, క్యాష్, బంగారం స్వాధీనం

Breaking News Live Telugu Updates: అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

Breaking News Live Telugu Updates: అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

KTR: ఈ 31న రూ.49 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

KTR: ఈ 31న రూ.49 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

టాప్ స్టోరీస్

హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ

హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని

Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం

Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం

Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి

Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి