News
News
X

Cyber Crime:లక్ష రూపాయలు క్రెడిట్ అని మెస్సేజ్ వచ్చిందా - బీ కేర్‌ఫుల్ అని పోలీసులు వార్నింగ్

మీ ఖాతాలో లక్ష రూపాయలు జమ అవుతాయి అంటూ రకరకాల మెసేజ్‌లు రావడం తరచుగా చూస్తూనే ఉంటాం. పొరపాటున ఆ లింక్ లను క్లిక్ చేశారో మీరు బుక్కైనట్టేనని వరంగల్ సీపీ తరుణ్ జోషి ప్రజలను హెచ్చరిస్తున్నారు.

FOLLOW US: 

Beware of Fake messages and Loan Apps, Warangal CP Tarun Joshi: వరంగల్ : తరచూ మన మొబైల్ ఫోన్‌లకు, పర్సనల్ మెయిల్స్‌కు చిత్రవిచిత్ర మెస్సేజ్‌లు వస్తుంటాయి. ముఖ్యంగా ఈ లింక్ క్లిక్ చేస్తే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అని, తక్కువ పెట్టుబడితో లక్షలు సంపాదించండి అని మెస్సేజ్‌లు వస్తుంటాయి. ఈ లింక్ క్లిక్ చేస్తే మీ ఖాతాలో లక్ష రూపాయలు జమ అవుతాయి అంటూ రకరకాల మెసేజ్‌లు రావడం తరచుగా చూస్తూనే ఉంటాం. పొరపాటున ఆ లింక్ లను క్లిక్ చేశారో మీరు బుక్కైనట్టేనని వరంగల్ సీపీ తరుణ్ జోషి ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఇలా లింకులు పంపిస్తూ వాటి ద్వారా మీ ఖాతాల్లో ఉన్న నగదును కొల్లగొడుతున్నారు సైబర్ కేటుగాళ్లు. తస్మాత్ జాగ్రత అంటున్నారు వరంగల్ పోలీసులు.. సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి మోసపోతే విషయాన్ని దాటిపెట్టకుండా సత్వరం పోలీసులను ఆశ్రయించాలన్నారు. 1930 నెంబర్ కు కాల్ (Call Centre Number) చేయాలని సూచించారు.

సైబర్‌ నేరగాళ్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-వరంగల్ సీపీ
తస్మాత్‌ జాగ్రత్త అని పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నా కొందరు అమాయకులు వారి ఉచ్చులోపడి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. సోషల్‌ మీడియా వేదికగా సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. లాటరీలు, రివార్డ్స్‌, జాబ్స్‌, కమీషన్లు, డిస్కౌంట్‌ ఆఫర్లతో సులభంగా డబ్బు సంపాదించొచ్చని జనానికి ఆశలు రేకెత్తించి.. నిలువునా ముంచుతున్నారు. వారి బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బులను సైబర్ నేరగాళ్లు కాజేతున్నారు. ఈ మధ్య కాలంలో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఇలాంటి నేరాలు ఎక్కువవుతున్నాయి. సైబర్‌ నేరస్తుల మాయలోపడి నిత్యం ఏదోచోట డబ్బులు పోగొట్టుకునేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. 

అలాంటి యాప్స్ డౌన్ లోడ్ చేయవద్దు..
అనుమానిత యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవద్దు అని.. వాట్సాప్‌ నంబర్లకు వచ్చే మెసేజ్‌లు, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వచ్చే లింకులు ఓపెన్‌ చేయొద్దు అని వరంగల్ సీపీ తరుణ్ జోషి సూచించారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌ లిఫ్ట్‌ చేసి ఓటీపీ నంబర్‌, బ్యాంకు వివరాలు చెప్పొద్దని పోలీసులు చెబుతున్నా, కొందరు మాత్రం అత్యాశకు పోయి లక్షలు పోగొట్టుకుని ఇళ్లుగుల్ల చేసుకుంటున్నారు. అయితే బాధితుల్లో ఉన్నత చదువులు చదివినవారు, యువతీ యువకులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు కూడా ఉండడం ఆందోళన కలిగిస్తుందన్నారు.

అవసరం ఎంత పెద్దదైనా, లోన్ అప్లికేషన్ల ద్వారా మాత్రం డబ్బు తీసుకోకండి. అప్లికేషన్ ఇన్ స్టాల్ చేసుకునేటప్పుడు మీకు తెలియకుండానే మీ మొబైల్ స్టోరేజ్, కాంటాక్ట్ లొకేషన్ లాంటి మీకు సంబంధించిన వివరాలు ఇస్తారు. మీ వ్యక్తిగత డేటాను ఉపయోగించి, మీ పరువుకు నష్టం కలిగిస్తామని బెదిరించి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేస్తారని ట్విట్టర్ ద్వారా ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఫేక్ అప్లికేషన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వరంగల్ కమిషనరేట్ సూచించింది.

Published at : 21 Nov 2022 05:34 PM (IST) Tags: Online Fraud Online Cheating Warangal Cyber Crime Warangal CP Tarun Joshi

సంబంధిత కథనాలు

Crime News: ఈజీ మనీ కోసం రిటైరయ్యాక ఫేక్ దందా షురూ, కథ అడ్డం తిరిగి బుక్కయ్యాడు !

Crime News: ఈజీ మనీ కోసం రిటైరయ్యాక ఫేక్ దందా షురూ, కథ అడ్డం తిరిగి బుక్కయ్యాడు !

Breaking News Live Telugu Updates: వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ !

Breaking News Live Telugu Updates: వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ !

TS News Developments Today: నేడు రాజ్యాంగ దినోత్సవం- తెలంగాణ ‌టుడే అజెండాలో ముఖ్యాంశాలు ఇవే!

TS News Developments Today: నేడు రాజ్యాంగ దినోత్సవం- తెలంగాణ ‌టుడే అజెండాలో ముఖ్యాంశాలు ఇవే!

తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు- వణికించనున్న చలి పులి

తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు- వణికించనున్న చలి పులి

Warangal News: ప్రభుత్వాసుపత్రిలో రోగి ప్రాణాలతో పరిహాసాలు, ఆపరేషన్ అంటూ ఆటలు!

Warangal News: ప్రభుత్వాసుపత్రిలో రోగి ప్రాణాలతో పరిహాసాలు, ఆపరేషన్ అంటూ ఆటలు!

టాప్ స్టోరీస్

Etala Rajendar : పరిమితికి మించి అప్పులు చేసి కేంద్రంపై దుష్ప్రచారం - టీఆర్ఎస్ సర్కార్‌పై ఈటల ఫైర్ !

Etala Rajendar : పరిమితికి మించి అప్పులు చేసి కేంద్రంపై దుష్ప్రచారం - టీఆర్ఎస్ సర్కార్‌పై ఈటల ఫైర్ !

Baba Ramdev: నోరు జారిన రామ్‌ దేవ్ బాబా, మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు,

Baba Ramdev: నోరు జారిన రామ్‌ దేవ్ బాబా, మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు,

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?

House Hacking: హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు డబ్బుల్లేవా? హౌజ్‌ హ్యాకింగ్‌తో కల నిజం చేసుకోండి!

House Hacking: హైదరాబాద్‌లో ఇల్లు కొనేందుకు డబ్బుల్లేవా? హౌజ్‌ హ్యాకింగ్‌తో కల నిజం చేసుకోండి!