Warangal: కూతురు పుట్టిందని పారిపోయిన భర్త, బిడ్డతోపాటు యువతి న్యాయపోరాటం

Warangal District: గతేడాది జూన్ 23న హైదరాబాద్ ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులు కాపురం చేశారు. పాప పుట్టాక, భర్త సుమంత్ పారిపోయాడు.

FOLLOW US: 

నువ్వు లేకపోతే నేను లేను.. చావైనా బ్రతుకైనా నీతోనే.. నువ్వు లేని జీవితం వ్యర్థం అంటూ సినిమా డైలాగులు కొట్టి పెళ్లి చేసుకొని ఒక పాపకు తండ్రి అయ్యాక మొఖం చాటేశాడు ఓ ప్రభుద్ధుడు. పెళ్లి చేసుకునేందుకు ఆడిన అబద్దాలను నమ్మిన ఆ నవ వధువు కన్నీరు పెట్టుకుని ఇప్పుడు పసి బిడ్డతో న్యాయం పోరాటానికి దిగింది. బిడ్డను చంకనేసుకొని తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. ఈ హృదయ విదారక ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది.

వరంగల్ జిల్లా వర్ధన్న పేట పట్టణ కేంద్రంలో డీసీ తండాకు చెందిన భూక్యా సుమంత్ అనే యువకుడు.. మూడు సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లో ఉండేవాడు. మరోవైపు, కొమురం భీం జిల్లా బెజ్జుర్ మండలం మార్జరి గ్రామానికి చెందిన సుమలత అనే యువతి హైదరాబాద్ లో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పని చేసేది. ఈ క్రమంలోనే వారు ఇద్దరికీ మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆ తర్వాత వారు ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. 2021 ఏడాది జూన్ 23న వారు హైదరాబాద్ ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. 

ఆ తర్వాత కొన్ని రోజులు కాపురం చేశారు. అలా వారికి ఓ పాప కూడా పుట్టింది. ఆ తర్వాత భర్త సుమంత్ మొహం చాటేశాడు. అక్కడి నుండి పరారీ అయిపోయాడు. సుమంత్ జాడ కోసం సుమలత చేయని ప్రయత్నం లేదు. ఫోన్ నెంబర్ ఆధారంగా అతని అడ్రస్ సేకరించిన సుమలత బంధువులతో కలిసి భర్త సొంతూరికి వెళ్లింది. చిన్న పాపను ఎత్తుకొని ఇంటి ముందు ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకున్న సుమంత్, తల్లిదండ్రులతో కలిసి ఎక్కడికో పారిపోయారు. అయితే, తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని వర్ధన్నపేట పోలీసులను బాధితురాలు ఆశ్రయించింది. 

నా నెంబరు తీసుకొని..
‘‘బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కొన్నేళ్ల క్రితం నేను హైదరాబాద్ అపోలో హాస్పిటల్‌లో పని చేసేదాన్ని. నా ఫ్రెండు నుంచి నా నెంబరు తీసుకొని సుమంత్ నాకు పరిచయం అయ్యాడు. కొద్ది రోజులకి ప్రేమ అన్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తర్వాత నాకు మత్తు మందు ఇచ్చి నాకు తెలియకుండా నాపై బలాత్కారం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. అంతకుముందు కూడా నా ఫ్రెండుతో ఇలాగే చేశాడు. ఆ అమ్మాయి క్యారెక్టర్ వేస్ట్ అని చెప్పి నన్ను నమ్మించాడు. పెళ్లి చేసుకుందామని మా ఇంట్లో నుంచి నన్ను తీసుకొచ్చేశాడు. 

అప్పటికే మూడు నెలల గర్భవతి అయినా అబార్షన్ చేయించేశాడు. తర్వాత టార్చర్ మొదలైంది. వెళ్లిపో అనేవాడు. వర్థన్నపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే వారు స్వీకరించలేదు. మళ్లీ హైదరాబాద్‌కు వచ్చేసరికి నాకు రెండు నెలల గర్భవతిని. అప్పుడు నా కాళ్లు పట్టుకొని కేసు పెట్టొద్దని బతిమాలాడాడు. నా చదువు పాడవుతుందని అన్నాడు. ఏడు నెలల గర్భవతి అయ్యేసరికి వాళ్ల ఇంట్లో విషయం తెలిసింది. వెంటనే నన్ను మా ఇంట్లో వదిలేసి తను పారిపోయాడు. పాప పుట్టిన తర్వాత మళ్లీ వచ్చి హైదరాబాద్‌లో ఉందామని తీసుకెళ్లాడు. కొద్ది రోజుల తర్వాత ఇప్పుడు మళ్లీ కనిపించకుండా పోయాడు’’ అని బాధితురాలు వాపోయింది.

Published at : 13 Mar 2022 03:03 PM (IST) Tags: warangal news Man Frauds Woman Vardhannapet love marriage in Hyderabad KomramBheem district Love marriage fraud

సంబంధిత కథనాలు

Telangana Inter Results 2022: గత ఏడాది కరోనా పాస్ - కానీ ఈసారి విద్యార్థులు తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోవాలి

Telangana Inter Results 2022: గత ఏడాది కరోనా పాస్ - కానీ ఈసారి విద్యార్థులు తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోవాలి

Virata Parvam: విరాట పర్వానికి కమల్‌ హాసన్‌కు లింకేంటి? వెంకటేష్ ప్రభు కార్తీక్ రాజా పేరు ధనుష్‌గా ఎలా మారింది?

Virata Parvam: విరాట పర్వానికి కమల్‌ హాసన్‌కు లింకేంటి? వెంకటేష్ ప్రభు కార్తీక్ రాజా పేరు ధనుష్‌గా ఎలా మారింది?

TS SSC Results 2022: తెలంగాణలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలకు అంతా సిద్ధం, రిజల్ట్స్ Step బై Step ఇలా చెక్ చేసుకోండి

TS SSC Results 2022: తెలంగాణలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలకు అంతా సిద్ధం, రిజల్ట్స్ Step బై Step ఇలా చెక్ చేసుకోండి

Petrol Price Today 25th June 2022: తెలంగాణలో నిలకడగా పెట్రోల్, డీజిల్ రేట్లు, ఏపీలో పలు చోట్ల పెరిగిన ఇంధన ధరలు

Petrol Price Today 25th June 2022: తెలంగాణలో నిలకడగా పెట్రోల్, డీజిల్ రేట్లు, ఏపీలో పలు చోట్ల పెరిగిన ఇంధన ధరలు

Weather Updates: బీ అలర్ట్, తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు వర్షాలు - ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

Weather Updates: బీ అలర్ట్, తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు వర్షాలు - ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

టాప్ స్టోరీస్

AP Govt GO: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త - ప్రొబేషన్ డిక్లరేషన్‌పై జీవో విడుదల

AP Govt GO: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త - ప్రొబేషన్ డిక్లరేషన్‌పై జీవో విడుదల

Sita Ramam Teaser: కశ్మీర్ కొండల్లో ఒంటరి సైనికుడికి ప్రేమలేఖ - ఎవరా అజ్ఞాత ప్రేయసి?

Sita Ramam Teaser: కశ్మీర్ కొండల్లో ఒంటరి సైనికుడికి ప్రేమలేఖ - ఎవరా అజ్ఞాత ప్రేయసి?

Maharashtra Politcal Crisis: శివసేన కార్యకర్తలు వీధుల్లోకి వస్తే సీన్ వేరేలా ఉంటుంది, షిండేకి సంజయ్ రౌత్ వార్నింగ్

Maharashtra Politcal Crisis: శివసేన కార్యకర్తలు వీధుల్లోకి వస్తే సీన్ వేరేలా ఉంటుంది, షిండేకి సంజయ్ రౌత్ వార్నింగ్

RBI Blockchain: నీరవ్‌ మోదీ తరహా దొంగల కోసం 'బ్లాక్‌ చైన్‌' వల పన్నుతున్న ఆర్బీఐ!

RBI Blockchain: నీరవ్‌ మోదీ తరహా దొంగల కోసం 'బ్లాక్‌ చైన్‌' వల పన్నుతున్న ఆర్బీఐ!