News
News
X

Warangal: భూపాల్ పల్లి జిల్లాలో 297.32 కోట్ల పనులు ప్రారంభించిన మంత్రి కేటీఆర్

భూపాల్ పల్లి జిల్లాలో 297.32 కోట్ల విలువైన పలు పనులను రాష్ట్ర ఐటీ పరిశ్రమల పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ ప్రారంభించి, మరికోన్ని పనులకు శంకుస్థాపన చేశారు.

FOLLOW US: 
Share:

IT Minister KTR at Bhupalpally Public Meeting
 - 297.32 కోట్ల నిధుల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం శంకుస్థాపన
- కోటి 20 లక్షలతో నిర్మించిన గణపురం తహసిల్దార్ కార్యాలయం
- 4 కోట్లతో నిర్మించిన బీసీ బాలికల గురుకుల భవనం ప్రారంభం
- 229 కోట్లతో నిర్మించిన 994 ఇండ్లలో సింగరేణి ఏర్పాటు చేసిన రామప్ప కాలనీ ప్రారంభం
- కోటి వ్యయంతో జిల్లా గ్రంథాలయ సంస్థ నిర్మాణానికి శంకుస్థాపన
- 14.59 లక్షల వ్యయంతో నిర్మించిన స్ట్రీట్ వండర్స్ మార్కెట్ ప్రారంభం
- 6.8 కోట్లతో పట్టణంలో చేపట్టే మిషన్ భగీరథ పనులకు శంకుస్థాపన
- భూపాల్ పల్లిలో పలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు నిర్వహించిన మంత్రి కేటీఆర్

వరంగల్ : భూపాల్ పల్లి జిల్లాలో 297.32 కోట్ల విలువైన పలు పనులను రాష్ట్ర ఐటీ పరిశ్రమల పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ ప్రారంభించి, మరికోన్ని పనులకు శంకుస్థాపన చేశారు. గురువారం భూపాల్ పల్లి జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ కు గణపూర్ మండలంలో ఏర్పాటుచేసిన హెలిపాడ్ వద్ద జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఘన స్వాగతం పలికారు. 

జిల్లాలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల కృపాలక శాఖ మంత్రి కేటీఆర్ తో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,  మహిళా శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి,  వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్,  శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మధుసూదన్ చారి పాల్గొన్నారు. కోటి 20 లక్షల వ్యయంతో నిర్మించిన ఘనపురం తహసిల్దార్ కార్యాలయాన్ని, 4 కోట్లతో నిర్మించిన బీసీ బాలికల గురుకుల పాఠశాలను ప్రారంభించి సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. 

అనంతరం మంజూరు నగర్ లో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కార్మికుల సౌకర్యార్థం 229 కోట్లతో నిర్మించిన 994 క్వార్టర్లను మంత్రి కేటిఆర్ ప్రారంభించారు. అనంతరం భూపాల్ పల్లిలో 3 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆర్ అండ్ బి అతిథి గృహాన్ని, సుభాష్ నగర్ కాలనీలో 14.59 లక్షల వ్యయంతో నిర్మించిన స్ట్రీట్ వండర్ స్టాల్స్ ను, దివ్యాంగుల కోసం ఏర్పాటు 23 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన  కమ్యూనిటీ సెంటర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

అనంతరం భాస్కర్ గడ్డలో 33 కోట్ల వ్యయంతో నిర్మించిన 544 డబుల్ బెడ్ రూం ఇండ్ల ను మంత్రి ప్రారంభించారు.  అనంతరం భూపాల్ పల్లి పట్టణంలో బృహత్వం మంచినీటి సరఫరా అభివృద్ధి పథకం కింద  6 కోట్ల 80 అంచనా తో చేపట్టే మిషన్ భగీరథ పనులకు, 4.5 కోట్లతో చేపట్టే మిని స్టేడియం నిర్మాణ పనులకు,  కోటి రూపాయల తో చేపట్టే జిల్లా గ్రంధాలయ భవన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. 

ఈ కార్యక్రమంలో రెడ్ కో చైర్మన్ సతీష్ రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ జక్కుల హర్షిని, వరంగల్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్, గండ్ర జ్యోతి, దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ లోకల్ బాడీ డిఎస్ దివాకర్ సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Published at : 23 Feb 2023 10:23 PM (IST) Tags: KTR BRS Telangana Warangal BC Girls Gurukula Building

సంబంధిత కథనాలు

Mulugu District: మావోయిస్ట్ పార్టీకి చెందిన 8 మంది కొరియర్ లు అరెస్ట్

Mulugu District: మావోయిస్ట్ పార్టీకి చెందిన 8 మంది కొరియర్ లు అరెస్ట్

జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

Students Bike Stunts : ఇన్ స్టా రీల్స్ కోసం నడిరోడ్డుపై బైక్ స్టంట్స్, అరెస్టు చేసిన పోలీసులు!

Students Bike Stunts : ఇన్ స్టా రీల్స్ కోసం నడిరోడ్డుపై బైక్ స్టంట్స్, అరెస్టు చేసిన పోలీసులు!

TSPSC Paper Leakage: 'గ్రూప్-1' పేపర్ లీకేజీలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థుల జాబితా సిద్ధం!

TSPSC Paper Leakage: 'గ్రూప్-1' పేపర్ లీకేజీలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థుల జాబితా సిద్ధం!

TSPSC Exams: టీఎస్‌పీఎస్సీ పరీక్షల రీషెడ్యూలు! గ్రూప్-2, 4 పరీక్షలపై సందిగ్ధత!

TSPSC Exams: టీఎస్‌పీఎస్సీ పరీక్షల రీషెడ్యూలు! గ్రూప్-2, 4 పరీక్షలపై సందిగ్ధత!

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్