అన్వేషించండి

Bhatti Vikramarka: పాద‌యాత్ర పూర్తయ్యాక బ‌స్సు యాత్ర, కాంగ్రెస్ క‌ట్టిన ప్రాజెక్టులు పరిశీలిస్తాం: సీఎల్పీ నేత భట్టి

CLP Leader Bhatti Vikramarka: తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం. ఈ నాలుగింటిలో అత్యంత ప్రధానమైంది నీళ్లు అన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.

CLP Leader Bhatti Vikramarka: వరంగల్ : తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం. ఈ నాలుగింటిలో అత్యంత ప్రధానమైంది నీళ్లు అన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కానీ ఆ నీళ్లకు సంబంధించి పెద్ద ఎత్తున వాడుకోవడానికి అవకాశం ఉన్న నది గోదావరి. ఈ గోదావరి నది నుంచి సముద్రంలో కలుస్తున్న నీటిని దశాబ్దాలుగా కరువు ప్రాంతాలుగా ఉన్న జనగామ ఈ పరిసర ప్రాంతాలకు నీళ్లు తీసుకువని వచ్చి.. ఇక్కడ కరువుకాటకాలు లేకుండా చేయాలని ఒక సంకల్పంతో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పొన్నాల లక్ష్మయ్యగారు నీటిపారుదల శాఖామంత్రిగా తలపెట్టిన జలయగ్నంలో అతిముఖ్యమైన ప్రాజెక్టు దేవాదుల ఎత్తిపోతల పథకం అన్నారు. 

దేవాదుల ప్రాజెక్టుతో ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకుని రావాలని దశాబ్దా కాలం పాటు అనేకమంది నాయకులు పోరాటం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ఆనాటి ముఖ్యమంత్రులను కలిశారు. పెద్ద ఎత్తున దరఖాస్తులు ఇచ్చారు. అందులో నాటి ముఖ్యమంత్రి ఎన్.టీ. రామారావు కూడా1984-85లో దరఖాస్తులు ఇచ్చారు. ఈ ప్రాజెక్టు కోసం పోరాటం చేసి దరఖాస్తులు ఇచ్చిన వ్యక్తే తరువాత కాలంలో నీటిపారుద శాఖామంత్రిగా పనిచేసి ఈ ప్రాజెక్టును తీసుకురావడం పొన్నాల అదృష్టం అన్నారు భట్టి.
కబ్జా చేయడం, ఫామ్ హౌస్ లు కట్టుకోవడం!
ఇక్కడ ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధికి జనగామ ప్రజల కంటే.. ఇక్కడ భూముల మీదే ప్రేమ ఉందని తనను కలిసిన ప్రతిఒక్కరూ చెప్పారని భట్టి విక్రమార్క తెలిపారు. ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ కబ్జా చేయడం, బలవంతంగా రాపిచ్చుకోవడం, ఫామ్ హౌస్ లు కట్టుకోవడం చేస్తున్నారు. చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా దాదాపు 6 లక్షల ఎకరాలకు సాగుకు నీళ్లు అందించే ప్రాజెక్టు. వరంగల్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో కరువుకాటకాలతో అల్లాడిపోయే ప్రజానీకానికి నీళ్లు ఇచ్చే గొప్ప ప్రాజెక్ట్ ఇది. దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టి కట్టడం కూడా పూర్తిచేసింది. అందులో భాగంగా 5 లిఫ్ట్ పాయింట్లు పెట్టడంతో పాటు అదనంగా 6 రిజర్వాయర్లను కూడా నిర్మించడం పూర్తి చేసి అందులో నీళ్లను కూడా నింపాము. అందులో భాగంగానే పది చిన్నచిన్న చెరువుల సామర్థ్యాన్ని పెంచి వాటిని నీళ్లతో నింపాం అన్నారు. 

పాత చెరువులైన భీమ్ లింగాపూర్, రామప్ప, సాలివాగు, నగరం, పులిగుర్తి, ధర్మసాగర్ చెరువులు పెంచడంతో పాటు.. పైన గండి రామారం, బొమ్మకూర్, తపాస్ పల్లి, జల్లగూడెం, చెట్టకోడూర్, అశ్వరావు పల్లి, ఘన్ పూర్ వంటి కొత్త ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేశామన్నారు. గోదావరి, క్రిష్ణా బేసిన్ లను వేరు చేసేలా అత్యంత ఎత్తయిన ప్రదేశంలో తపాస్ పల్లివద్ద రిజర్వాయర్ కట్టాము. అక్కడనుంచి అన్ని ప్రాంతాలను నీటిని డిస్ట్రిబ్యూట్ చేసేలా డిజైన్ చేశాము. వీటన్నింటిని పూర్తి నీళ్లు ఇచ్చే సమయానికి ప్రత్యేక పోరాటం రావడం, విభజన జరగడం, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైందన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఈ తొమ్మిదిన్నరేళ్లలో ఈ కట్టిన ప్రాజెక్టులకు డిస్ట్రిబ్యూటరీ కాలువులు కూడా తవ్వలేదు. ఈ ప్రభుత్వం ఒక దున్నపోతులా నిద్రపోతోంది. కట్టిన ప్రాజెక్టులకు కాలువలు తవ్వింటే ఈ రోజు లక్షల ఎకరాల ఆయకట్టు అదనంగా సాగులోకి వచ్చేదన్నారు భట్టి విక్రమార్క.

పెంచిన చెరువులకు ఉన్న కాలువులను పెంచినా అదనపు భూమి సాగులోకి వచ్చేది. వీటిని పట్టించుకోక ఈ ప్రజలకు ప్రభుత్వం ద్రోహం చేసింది. దాదాపు రూ. 9వేల కోట్లతో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టును పూర్తి చేశాము. కరువుతో అల్లాడుతున్న ప్రజలకు నిండుకుండలా ప్రాజెక్టులను తెచ్చి పెడితే.. ఆ నీటిని పంచకుండా అడ్డుపడి ఈ ప్రభుత్వం అతిపెద్ద నేరం చేసింది. ఆదిలాబాద్ నుంచి చూస్తే ఇక్కడి వరకూ అనేక నేరాలను ఈ ప్రభుత్వం చేసింది. రాష్ట్రం తెచ్చుకున్న ఉద్దేశం నెరవేరకుండా.. కరవు కాటకాలతో అదేవిధంగా అల్లాడేలా, ప్రజలు ఆకలితో అలమటించేలా చేస్తున్న భూస్వామ్య ఫ్యూడల్ మనస్తత్వంతో పాలన సాగుతోందని సీఎం కేసీఆర్ ను విమర్శించారు.

దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ 365 రోజులు గోదావరి నుంచి నీటిని నింపడం కోసం, గోదావరిలో వాటర్ లెవెల్స్ మెయింటెన్స్ చేయడం కోసం కాంతానపల్లి వద్ద బ్యారేజ్ డిజైన్ చేసి అనుమతులు మంజూరు చేశామన్నారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాంతానపల్లిని ఖతం చేసింది. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ కు అవసరముండే విద్యుత్ ను కూడా కాంతానపల్లి బ్యారేజ్ హైడల్ విద్యుత్ ఉత్పత్తి చేసేలా డిజైన్ చేశాము. ఈ రోపు తుపాలగూడెం ప్రాజెక్టు లేదు.. ఇక్కడ పవర్ ప్రాజెక్టు లేకుండా అయింది. ఈ పాదయాత్ర పూర్తయిన తరువాత రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని తీసుకుని  కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులను సందర్శించేందకు బస్సు యాత్ర చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు.

Bhatti Vikramarka: పాద‌యాత్ర పూర్తయ్యాక బ‌స్సు యాత్ర, కాంగ్రెస్ క‌ట్టిన ప్రాజెక్టులు పరిశీలిస్తాం: సీఎల్పీ నేత భట్టి

500 కిలోమీర్ల పాదయాత్ర పూర్తి.. 
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గత నెల 16న ప్రారంభించిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నేటితో 500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కొర్రి తాండా వద్ద విశ్రాంతి బసలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో  పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కేక్ కట్ చేయించారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget