News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Telangana: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అద్భుతమైన పీఆర్సీ, పదోన్నతులు: మంత్రులు

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన పీఆర్సీ, ఒక్కేసారి నలబై వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వడం చాల గొప్ప విషయమని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

FOLLOW US: 
Share:

Telangana: హనుమకొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు అధికారులు, ఉద్యోగులు చేస్తున్న కృషి గణనీయమైనదని రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభిృద్ధి, గ్రామీణ మంచి నీటి సఫర శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో, రాష్ట్ర పర్యాటక , సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతులతో కలిసి ఆదివారం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం 2022 ఏడాది డైరీ, క్యాలెండర్ లను ఆవిష్కరించారు. 

సమైఖ్య రాష్ట్రంలో అన్ని విధాలుగా తెలంగాణ అణిచివేతకు గురైందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాష్ర్టంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు చర్యలు తీసుకుంటూన్నారని అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో అన్ని వసతులు కల్పించడానికి కృషి చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న విషయం కేంద్ర ప్రభుత్వ వివిధ అవార్డుల ద్వారా గుర్తించిందని పేర్కొన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ, పదోన్నతులు, ఇతర ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం ముందు వరుసలో ఉంటుందని టీజీఓలకు ఎలాంటి సహాయమైనా చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

సమైఖ్య రాష్ట్రంలో అన్ని విధాలుగా విద్య, ఉపాధి, నిధులు, నియామకాలలో వారికి అనుకూలమైన పనులు చేసుకుంటూ మనకు తీవ్ర నష్టం కల్గీంచారని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన పీఆర్సీ, ఒక్కేసారి నలబై వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వడం చాల గొప్ప విషయం అని చెప్పారు. ఇతర రాష్ట్రాల వారు తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు ఐతే బాగుండు అని చెప్పుకుంటున్నారని గుర్తుకుచేశారు, తెలంగాణ గెజిటెడ్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కష్టపడి పనిచేసి మంచి గుర్తింపు పొందాలని సూచించారు. ఎలాంటి సమస్యలు, ఉన్న అన్ని విషయాల పట్ల ప్రభత్వం శ్రద్ద తీసుకుంటుందని చెప్పారు. టీజీఓలకు, టీఎన్జీఓలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రతేక్య అభినందనలు తెలిపారు.

తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం, టీఎన్జీఓలు అంటే తనకు కుటుంబం విధంగా భావించి వారి విజ్ఞప్తిలు, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. టిజిఓ భవనం విస్తరణ కోసం వెంటనే పది లక్షలు నిధులు మంజూరు చేస్తూన్నానని తెలిపారు. టీజీఓ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు జగన్ మోహన్ రావు మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న మంత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ సంధ్య రాణీ, ఆర్డిఓ వాసు చంద్ర, డీఆర్డిఓ శ్రీనివాస్ కుమార్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ ఎన్నమనేని జగన్ మోహన్ రావు, రూరల్ జిల్లా అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కుమార్, ఫణి కుమార్, రాజేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. అంతకుముందు టి.జి.ఓ కార్యాలయాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, శ్రీనివాస్ గౌడ్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ప్రారంభించారు.

Published at : 30 Jan 2022 07:44 PM (IST) Tags: telangana TS News V Srinivas Goud Hanamkonda Errabelli Dayakar Rao Vinay Bhaskar Hanumakonda Hanamkonda District Hanumakonda District

ఇవి కూడా చూడండి

Warangal Police: వరంగల్‌ కమిషనరేట్‌ లో 842 కేసులు నమోదు, ఎంత నగదు సీజ్ చేశారంటే!

Warangal Police: వరంగల్‌ కమిషనరేట్‌ లో 842 కేసులు నమోదు, ఎంత నగదు సీజ్ చేశారంటే!

Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్

Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్

Revanth Reddy: ఈసారి కాంగ్రెస్ గెలుపే టార్గెట్! 63 నియోజకవర్గాలు, 87 సభల్లో రేవంత్ రెడ్డి ప్రచారం

Revanth Reddy: ఈసారి కాంగ్రెస్ గెలుపే టార్గెట్! 63 నియోజకవర్గాలు, 87 సభల్లో రేవంత్ రెడ్డి ప్రచారం

Telangana Elections 2023 Live News Updates: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం, మూగబోయిన మైకులు

Telangana Elections 2023 Live  News Updates: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం, మూగబోయిన మైకులు

Election Campaign Ends: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం, మూగబోయిన మైకులు

Election Campaign Ends: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం, మూగబోయిన మైకులు

టాప్ స్టోరీస్

Uttarakhand Tunnel Rescue: టన్నెల్ రెస్క్యూ పనులు పూర్తి, మరికాసేపట్లో బయటకు రానున్న 41మంది కార్మికులు: సీఎం ధామి

Uttarakhand Tunnel Rescue: టన్నెల్ రెస్క్యూ పనులు పూర్తి, మరికాసేపట్లో బయటకు రానున్న 41మంది కార్మికులు: సీఎం ధామి

Telangana Elections 2023 : కేటీఆర్ ప్రచార వ్యూహాలతో బీఆర్ఎస్ దూకుడు - అంతా తానై నడిపించిన వర్కింగ్ ప్రెసిడెంట్ !

Telangana Elections 2023 :  కేటీఆర్ ప్రచార వ్యూహాలతో బీఆర్ఎస్ దూకుడు - అంతా తానై నడిపించిన వర్కింగ్ ప్రెసిడెంట్ !

Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు

Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు

Telangana Elections Holiday: పోలింగ్ రోజు సెలవు ఇవ్వని కంపెనీలపై చట్ట ప్రకారం చర్యలు: సీఈవో వికాస్‌ రాజ్‌

Telangana Elections Holiday: పోలింగ్ రోజు సెలవు ఇవ్వని కంపెనీలపై చట్ట ప్రకారం చర్యలు: సీఈవో వికాస్‌ రాజ్‌