News
News
X

KCR to Visit Medaram: నేడు మేడారానికి సీఎం కేసీఆర్, కుటుంబంతో సహా వనదేవతల దర్శనం

Sammakka Saralamma Jatara 2022: సీఎం కేసీఆర్‌ ఉదయం 11 గంటలకు మేడారం చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడే ఉంటారు.

FOLLOW US: 
Share:

మేడారం జాతరకు నేడు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. ఆయన సతీమణి శోభమ్మతో పాటు కుటుంబం మొత్తం మేడారం అమ్మవార్లకు మొక్కులు చెల్లించి దర్శించుకోనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆయన మేడారానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు మేడారం జాతరలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం కేసీఆర్‌ ఉదయం 11 గంటలకు మేడారం చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడే ఉంటారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

నిన్న రాత్రి గద్దెపైకి సమ్మక్క

ఆసియాలోనే అతి పెద్ద జాతర మేడారం (Medaram Jatara) జాతర వైభవంగా సాగుతోంది. జాతరలో ముఖ్యమైన ఘట్టం నిన్న రాత్రి ఆవిష్కృతమైంది. చిలుకలగుట్ట నుంచి సమ్మక్క(Sammakka) లాంఛనంగా గద్దెపైన కొలువు దీరింది. దీని కోసం లక్షల మంది భక్తులు ఎదురు చూస్తుంటారు. సమ్మక్క గద్దెపై కొలువు దీరడంతో ఒక్కసారిగా భక్తులు ఆ దృశ్యాన్ని చూసి పులకించిపోయారు. గురువారం రాత్రి 9.20 నిమిషాలకు సమ్మక్క గద్దెపై కూర్చున్నారు. ఆ వేడుకను చూసిన భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. తమను చల్లగా చూడు తల్లీ అంటూ గట్టిగా వేడుకున్నారు. 

తుపాకులు పేల్చి అధికారికంగా సమ్మక్కకు ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ స్వాగతం పలికారు. సమ్మక్క గద్దెనెక్కినప్పుడు ఇలా తుపాకీ పేల్చడం ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. ముందుగా ఉదయం మేడారంలోని సమ్మక్క ఆలయాన్ని పూజలు శుద్ధి చేసి శక్తి పీఠాన్ని అందంగా అలంకరించారు. తర్వాత అడవి నుంచి వెదురువనం, ఆడేరాలు తెచ్చి గద్దెపై పెట్టారు. ప్రధాన పూజరి కొక్కెర కృష్ణయ్యతోపాటు దూపం, జలకం వడ్డెలు, సహాయక పూజారులు సాయంత్రం చిలుకల గుట్టపైకి వెళ్లారు. 

రహస్య ప్రదేశంలో సమ్మక్క రూపమైన కుంకుమ భరిణెకు ప్రత్యేక పూజలు చేశారు. అది పూర్తివ్వగానే తిరిగి బయల్దేరారు. ఆనవాయితీ ప్రకారం వనదేవతకు  మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ, అధికార యంత్రాంగం స్వాగతం పలికారు.

సమ్మక్క సారలమ్మ జాతర రెండు రోజుల క్రితమే లాంఛనంగా స్టార్ట్ అయినా వారం పది రోజుల ముందు నుంచే భక్తుల రాక మొదలైంది. ఇప్పుడా తాకిడి మరింతగా పెరిగింది. ఎక్కడ చూసిన ఎటు చూసిన జనమే కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు అరవై లక్షలకుపైగా భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. 

జంపన్న వాగులో రాత్రి పగలు భక్తులు పుణ్య స్నానాలు చేస్తున్నారు. ఆ వాగు చూస్తుంటే కుంభమేళాను తలపిస్తోంది. గురువారం సమ్మక్క రాక సందర్భంగా శివసత్తలు నీటిలో వలయాకారంగా నిలబడి నృత్యాలు చేశారు. చర్నాకోల్‌తో విన్యాసాలు చేశారు.

Published at : 18 Feb 2022 08:20 AM (IST) Tags: cm kcr medaram jatara Sammakka Saralamma Jatara KCR family in Medaram KCR in Medaram Medaram Jatara today News

సంబంధిత కథనాలు

YS Sharmila :  కమీషన్ల కాళేశ్వరం కట్టారు, కాళోజీ కళాక్షేత్రం కట్టలేకపోయారు- వైఎస్ షర్మిల

YS Sharmila : కమీషన్ల కాళేశ్వరం కట్టారు, కాళోజీ కళాక్షేత్రం కట్టలేకపోయారు- వైఎస్ షర్మిల

Revanth Reddy: రేవంత్‌ రెడ్డి పాదయాత్ర రేపటి నుంచే, పూర్తి షెడ్యూల్‌ విడుదల

Revanth Reddy: రేవంత్‌ రెడ్డి పాదయాత్ర రేపటి నుంచే, పూర్తి షెడ్యూల్‌ విడుదల

YS Sharmila On BRS: మా పాదయాత్రపై మళ్లీ దాడులు చేస్తున్నారు: వైఎస్ షర్మిల

YS Sharmila On BRS: మా పాదయాత్రపై మళ్లీ దాడులు చేస్తున్నారు: వైఎస్ షర్మిల

Mulugu Accident: అతివేగంతో పల్టీ కొట్టిన కూలీల ఆటో - మహిళ మృతి, నలుగురి పరిస్థితి విషమం

Mulugu Accident: అతివేగంతో పల్టీ కొట్టిన కూలీల ఆటో - మహిళ మృతి, నలుగురి పరిస్థితి విషమం

తెలంగాణలోని ఆ ఏడు జిల్లాలకు మాత్రం ఆరెంజ్‌ అలెర్ట్‌!

తెలంగాణలోని ఆ ఏడు జిల్లాలకు మాత్రం ఆరెంజ్‌ అలెర్ట్‌!

టాప్ స్టోరీస్

Harirama Jogaiah Vs Amarnath : నువ్వు రాజకీయాల్లో బచ్చావి, మీరు మానసికంగా బాగుండాలి- హరిరామజోగయ్య వర్సెస్ మంత్రి అమర్నాథ్

Harirama Jogaiah Vs Amarnath : నువ్వు రాజకీయాల్లో బచ్చావి, మీరు మానసికంగా బాగుండాలి- హరిరామజోగయ్య వర్సెస్ మంత్రి అమర్నాథ్

Jr NTR: అప్‌డేట్ ఉంటే భార్య కంటే ముందు మీకే చెప్తా - ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ క్లాస్!

Jr NTR: అప్‌డేట్ ఉంటే భార్య కంటే ముందు మీకే చెప్తా - ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ క్లాస్!

Bandi Sanjay: నాందేడ్ లో బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్, రూ.500 ఇచ్చి జనాన్ని పట్టుకొచ్చి డ్రామాలు: బండి సంజయ్

Bandi Sanjay: నాందేడ్ లో బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్, రూ.500 ఇచ్చి జనాన్ని పట్టుకొచ్చి డ్రామాలు: బండి సంజయ్

AP SI Hall Tickets: ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే! ఫిబ్రవరి 15 వరకు అందుబాటులో! పరీక్ష ఎప్పుడంటే?

AP SI Hall Tickets: ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే! ఫిబ్రవరి 15 వరకు అందుబాటులో! పరీక్ష ఎప్పుడంటే?