KCR Mahabubabad Tour: ఈ 12న కేసీఆర్ మహబూబాబాద్ పర్యటనకు అంతా రెడీ, టూర్ షెడ్యూల్ వివరాలిలా
సీఎం కేసీఆర్ మహబూబాబాద్ జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. సీఎం కేసీఆర్ జనవరి 12వ తేదీన మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు కేసీఆర్ షెడ్యూల్ వివరాలు వెల్లడించారు.
KCR Mahabubabad Tour వరంగల్ : తెలంగాణ సీఎం కేసీఆర్ మహబూబాబాద్ జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. సీఎం కేసీఆర్ జనవరి 12వ తేదీన మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు కేసీఆర్ షెడ్యూల్ వివరాలు వెల్లడించారు. గురువారం ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్ నుంచి బేగంపేటకు బయలుదేరతారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి 10.15 గంటలకు హెలికాప్టర్‌లో మహబూబాబ్‌కు కేసీఆర్ బయలుదేరనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు మహబూబాబాద్ హెలీప్యాడ్‌కు కేసీఆర్ చేరుకుంటారు. ఉదయం 11.10 గంటలకు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం జిల్లా కేంద్రంలోని నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయన్ని కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఇక సీఎం పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లును అధికారులు పూర్తి చేశారు. మంత్రి సత్యవతి రాథోడ్ అక్కడికి చేరుకుని బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు.
గురువారం ఉదయం 11.40 నుండి 1.30 గంటల వరకు నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయన్ని ప్రారంభించి, బహిరంగ సభలో పాల్గొంటారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం లంచ్ చేస్తారు. గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు సీఎం కేసీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు హెలికాప్టర్ లో పయనం కానున్నారు. 1.55 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చేరుకుని నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయన్ని ప్రారంభించనున్నారు. 2.55కు పబ్లిక్ మీటింగ్ జరిగే ప్రాంతానికి చేరుకుంటారు. 3.20కి బహిరంగ సభ ముగించుకుని భద్రాద్రి కొత్తగూడెంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు 3.35 గంటలకు చేరుకుంటారు కేసీఆర్. పార్టీ ఆఫీసు ప్రారంభించిన తరువాత 4.05కి అక్కడి నుంచి బయలుదేరి కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియానికి చేరుకోనున్నారు. 4.30కి అక్కడి నుంచి ప్రయాణమై 5.30కి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరతారు. రోడ్డు మార్గంలో ప్రయాణించి 5.40కి ప్రగతి భవన్‌కు తిరిగి చేరుకుంటారు.
మునుగోడు ఉఎన్నికతో తెలంగాణలోని పార్టీలన్నీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయాయి. ఏ పని చేసినా వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ ఆ పనిని పూర్తిస్థాయిలో కొనసాగిస్తుండగా మిగతా పార్టీలు కూడా తన వ్యూహాన్ని పదును పెడుతున్నాయి. మనుగోడు ఉపఎన్నికతో మంచి జోష్ మీద ఉన్న అధికార పార్టీ టీఆర్‌ఎస్... వచ్చే ఎన్నికల వరకు దీన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. అందుకు సరిపడా ప్లాన్స్ వర్కౌట్ చేస్తోంది. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది.
ముందుగా మహబూబాబాద్ జిల్లాలో లక్ష మందితో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్ ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీ, టీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్, ఇల్లందు, కురవి రోడ్లు, సాలార్‌తండా స్థలాలను పరిశీలించారు. భారీ సంఖ్యలో వచ్చే ప్రజల కోసం ఏర్పాటు, రవాణాకు ఇబ్బంది లేకుండా ఉండేలా స్థలాన్ని ఎంచుకోనున్నారు. ఈ స్థలాన్ని పరిశీలించిన తర్వాత కలెక్టరేట్‌లో మంత్రులు సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ డిసెంబర్ మొదటి వారంలో మహబూబాబాద్ జిల్లాకు రావాలని భావించారు. కానీ పనులు పూర్తి కాకపోవడంతో సీఎం పర్యటన వాయిదా పడింది. ఈ టూర్‌లో సీఎం కేసీఆర్ కలెక్టర్ కార్యాలయం, టీఆర్‌ఎస్ ఆఫీసు ప్రారంభిస్తారు. ప్రతి జిల్లాలో ఓ భారీ బహిరంగ సభ ఉండేలా టీఆర్‌ఎస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
రేపు తెలంగాణ సీఎం గౌ. శ్రీ కేసీఆర్ గారు మహబూబాబాద్ జిల్లా పర్యటన నేపథ్యంలో తాళ్ల పూసలపల్లి రోడ్ లోని హెలిప్యాడ్ నిర్మాణ పనులు, జిల్లా పార్టీ కార్యాలయం, నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను, మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారితో కలిసి పరిశీలించడం జరిగింది. pic.twitter.com/RWuIkp7lAr
— Satyavathi Rathod (@SatyavathiTRS) January 11, 2023