News
News
X

Bhupalapalli News: సీపీఆర్ చేసి యువకుడిని కాపాడిన పోలీసు- శభాష్ అంటున్న ప్రజలు!

Bhupalapalli News: హార్ట్ ఎటాక్ వచ్చి కుప్పకూలిపోయిన ఓ వ్యక్తికి రేగొండ పోలీస్ కానిస్టేబుల్ సీపీఆర్ చేసి కాడాపాడు. 

FOLLOW US: 
Share:

Bhupalapalli News: చికెన్ సెంటర్ లో పని చేసే ఓ వ్యక్తి గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలాడు. అయితే విషయం గుర్తించిన బ్లూ కోల్డ్ పోలీస్ సిబ్బంది సదరు యువకుడికి సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడారు. దీంతో స్థానిక ప్రజలంతా పోలీసులు సిబ్బందిని ప్రశంసించారు. 

అసలేం జరిగిందంటే..?

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ చికెన్ సెంటర్ ఉంది. అక్కడే వంశీ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. అయితే ఉదయం పని నిమిత్తం చికెన్ సెంటర్ కు వచ్చిన అతడికి గుండెపోటు వచ్చింది. ఉన్నట్లుండి ఒక్కసారిగా పడిపోయాడు. అయితే పక్కనే ఉన్న బ్లూ కోల్డ్ పోలీస్ సిబ్బంది, కానిస్టేబుల్ కిరణ్ వెంటనే ఆ వ్యక్తికి సీపీఆర్ చేశాడు. దీంతో వంశీ 15 నిమిషాల తర్వాత తిరిగి శ్వాస తీసుకున్నాడు. కానిస్టేబుల్ చేసిన సీపీఆర్ తో ప్రాణాలతో బయటపడ్డాడు. విషంయ తెలుసుకున్న ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తన వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఇతర సిబ్బంది హెచ్.సి రాజేశ్వరరావు శ్రీశైలం, కుమార్ ట్రాఫిక్ రెగ్యులేషన్ చేశారు. ఈ సందర్బంగా అక్కడ ఉన్న ప్రజలు పోలీస్ సిబ్బందిని ప్రశంసించారు.

వారం రోజుల క్రితం హైదరాబాద్ లోనూ సేమ్ సీన్..

హైదరాబాద్ రాజేంద్రనగర్ లో కార్డియాక్ అరెస్ట్ కు గురైన ఓ వ్యక్తి ప్రాణాన్ని ట్రాఫిక్ కానిస్టేబుల్ కాపాడారు. నడిరోడ్డుపైనే ఆ వ్యక్తికి కానిస్టేబుల్ సీపీఆర్ చేసి ప్రాణాలు దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించి బస్సు దిగిన బాలాజీ అనే వ్యక్తికి గుండెపోటు వచ్చింది. ఎల్బీ నగర్ నుంచి బాలాజీ అనే వ్యక్తి ఆరంఘర్ వైపు ప్రయాణిస్తున్నాడు. ఆరంఘర్ చౌరస్తాలో దిగగానే బాలాజీ గుండెపోటుతో కుప్పకూలాడు. అతణ్ని గమనించి ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ వెంటనే సీపీఆర్ చేశారు. ఛాతీపై గట్టిగా పదే పదే ప్రెస్ చేసి బాలాజీ ప్రాణాన్ని రాజశేఖర్ కాపాడారు. అనంతరం బాలాజీని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఫిబ్రవరి 23వ తేదీ ఒక్కరోజే హైదరాబాద్ నాలుగు కార్డియాక్ అరెస్ట్ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. నిన్న (ఫిబ్రవరి 23) పాత బస్తీలో ఓ పెళ్లి వేడుకలో పెళ్లి కుమారుణ్ని ముస్తాబు చేస్తున్న వ్యక్తి కుప్పకూలిపోయాడు. కాలాపత్తార్‌లో మహమ్మద్ రబ్బాని అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇటీవల తమ బంధువుల వివాహ వేడుకకు హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో బంధువులంతా ఉత్సాహంగా పాల్గొని వరుడిని ముస్తాబు చేస్తున్నారు. ఇంతలో మహమ్మద్ రబ్బాని పెళ్లి కొడుకు వద్దకు వచ్చి.. అతడి పాదాలకు పసుపు రాస్తుండగా ఉన్నట్టుండి కూర్చున్న చోటే కుప్పకూలిపోయాడు. వెంటనే గమనించిన బంధువులు అయన్ని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయినా ఆయన చనిపోయారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు ధ్రువీకరించారు. రబ్బాని మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మహమ్మద్ రబ్బాని వరుడి పాదాలకు పసుపు రాస్తూ కుప్పకూలిన దృశ్యాలను బంధువులు ఫొన్‌లో వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీటిని చూసిన వారు భయానికి గురవుతున్నారు.

Published at : 02 Mar 2023 11:55 AM (IST) Tags: Telangana News Bhupalapalli News Constable performs CPR Bhupalapalli Police Regonda Police Save Man Life

సంబంధిత కథనాలు

Super Speciaity Hospital: దేశంలో తొలిసారిగా 24 అంతస్తుల ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మన దగ్గరే!

Super Speciaity Hospital: దేశంలో తొలిసారిగా 24 అంతస్తుల ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మన దగ్గరే!

Warangal Congress Politics : వరంగల్ కాంగ్రెస్ లో కుమ్ములాటలు? జంగా రాఘవరెడ్డిపై వేటు!

Warangal Congress Politics : వరంగల్ కాంగ్రెస్ లో కుమ్ములాటలు? జంగా రాఘవరెడ్డిపై వేటు!

SCT SI PTO: ప్రశాంతంగా ముగిసిన ఎస్‌టీసీ ఎస్‌ఐ పీటీవో టెక్నికల్‌ పరీక్ష! 60.92 శాతం హాజరు నమోదు!

SCT SI PTO: ప్రశాంతంగా ముగిసిన ఎస్‌టీసీ ఎస్‌ఐ పీటీవో టెక్నికల్‌ పరీక్ష! 60.92 శాతం హాజరు నమోదు!

Valmidi Srirama Navami : వల్మీడిలో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు, ఏర్పాట్లపై సమీక్షించిన మంత్రి ఎర్రబెల్లి

Valmidi Srirama Navami : వల్మీడిలో ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు, ఏర్పాట్లపై సమీక్షించిన మంత్రి ఎర్రబెల్లి

TS SSC Exams 2023: ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి పరీక్షలు, హాల్‌టికెట్లు అందుబాటులో!

TS SSC Exams 2023: ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి పరీక్షలు, హాల్‌టికెట్లు అందుబాటులో!

టాప్ స్టోరీస్

Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు

Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!