Warangal Latest News:ప్రోత్సహించండి, పేరు నిలబెడతాం- ముగ్గురు మహిళా సివిల్ జడ్జిల కథ
Warangal Latest News:కొన్ని విజయాలు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. మరికొన్ని స్ఫూర్తిగా నిలుస్తాయి. ఇంకొన్ని చరిత్రను తిరగరాస్తాయి. అలాంటి గెలుపు ఆ ముగ్గురు యువతుల సొంతమైంది.

Warangal Latest News: అన్ని రంగాల్లో మహిళలు దూసుకెళ్తున్నారు. చదువులు, ఆటపాటలు అన్ని రంగాల్లో ఆకాశమే హద్దుగా విజేతలుగా నిలుస్తున్నారు. ఇన్ని విజయాలు కళ్లముందే చూస్తున్నా, ప్రభుత్వాలు ఎంతగా ప్రోత్సాహకాలు ఇస్తున్నా ఇంకా అడపిల్ల చదువుపై వివక్ష కొనసాగుతూనే ఉంది. కానీ స్వేచ్ఛ ఇచ్చి వెన్నుతట్టి ప్రోత్సహిస్తే ఎలాంటి విజయాలు సాధిస్తారో మరో ముగ్గురు యువతులు నిరూపించారు. న్యాయమూర్తులుగా ఎన్నికై సత్తా చాటారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ముగ్గురు యువతులు సాధించిన విజయం ఎందరో ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇంట్లో వాళ్లు ప్రోత్సహించినప్పటికీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ మధ్య విడుదలైన సివిల్ జడ్జి ఫలితాల్లో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. వారిలో ఒక్కొక్కరిది ఒక్కో బ్యాంక్ గ్రౌండ్. అందరికీ ఒక్టే కామన్ పాయింట్. ఇంట్లో ఇచ్చిన స్వేచ్ఛ వారి విజయానికి పునాదులు వేసింది.
ఖిలా వరంగల్‌కు చెందిన గంగిశెట్టి ప్రసీద, నర్సంపేటకు చెందిన బటి ప్రణయ, దర్గా కాజీపేటకు చెందిన దార సాయిమేఘన సాధించిన విజయం మూమూలిది కాదు. ఇద్దరూ సామాన్యమైన కుటుంబాలకు చెందిన వారే. అందరి మాదిరిగానే లా డిగ్రీలు తీసుకొని కేసులు వాదించిన వాళ్లే. అయితే చిన్నతనం నుంచే టార్గెట్ ఫిక్స్ చేసుకొని ఆ దిశగానే ఎదిగి అనుకున్న లక్ష్యం వైపుగా పురోగమిస్తున్నారు. ఇన్ని రోజులు వాదనలు వినిపించిన ఈ యువతులు తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికయ్యారు. ఇప్పుడు బెంచ్‌లో కూర్చొని తీర్పులు ఇవ్వనున్నారు.
చిన్నప్పటి నుంచే జడ్జి అని పిలిపించుకున్న ప్రసీద
ఖిలా వరంగల్‌కు చెందిన గంగిశెట్టి హరినాథ్, పరిపూర్ణ దంపతుల కుమార్తె ప్రసీద చిన్నప్పటి నుంచి న్యాయవాది వృత్తిలో స్థిరపడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పుడే ఆమెను జడ్జి అని ఫ్రెండ్స్ పిలిచేవాళ్లు. అలా పిలవడం ఆమెను మరింత స్ఫూర్తిని రగిల్చింది. పట్టువదలకుండా శ్రమించి తొలిప్రయత్నంలో సివిల్ జడ్జిగా ఎన్నికయ్యారు.
తండ్రి మరణం మార్చేసింది
వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన అంబటి ప్రణయది కూడా దాదాపు ఇలాంటి స్టోరీయే. అంబటి వెంకటేశ్వర్లు, విజయ దంపతులకు ఏకైక సంతానం ఈమె. ఎంఫార్మసీ చదువుతున్న టైంలో తండ్రి చనిపోవడంతో ఆమె తన మార్గాన్ని మార్చుకున్నారు. కుటుంబ సభ్యుల సలహాతో న్యాయవాద వృత్తిలోకి వచ్చారు. 2022లో వివాహమై కుటుంబ బాధ్యతలు తీసుకున్నా లక్ష్యం నుంచి దృష్టి మరల్చలేదు. అత్తింటివారుస, బంధువులు సహకారంతో తొలి ప్రయత్నంలోనే సివిల్ జడ్జిగా విజయం సాధించారు.
చిన్నప్పటి నుంచి చట్టాలపై అవగాహన
మూడో విజేత దార సాయిమేఘన తండ్రి బాలకృష్ణ నల్సార్ యూనివర్సిటీలో లా ప్రొఫెసర్. దీంతో చిన్నతనం నుంచి ఆ వాతావరణంలో పెరిగారు. దీంతో అదే వృత్తిగా ఎంచుకోవాలని అనుకున్నారు. దీనిక తండ్రి కూడా ప్రోత్సహించారు. దీంతో ఆమె కూడా విజేతగా నిలిచి టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యారు.
ఇలా ముగ్గురు కూడా విజయం సాధించడమే కాకుండా మరికొందరికి స్ఫూర్తిగా నిలబడ్డారు. అందుకే ఉమ్మడి వరంగల్‌లో ఎక్కడ చూసిన ఈ ముగ్గురు పేర్లే వినిపిస్తున్నాయి.





















