Mathematician Award: ప్రొఫెసర్ జి.పి రాజశేఖర్ కి మ్యాథమెటిషన్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు
పొన్నాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మ్యాథమెటిషన్ అఫ్ ది ఇయర్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం నిట్ వరంగల్ లోని అంబెద్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో నిర్వహించారు.
- పొన్నాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జి. పి. రాజశేఖర్ కి మ్యాథమెటిషన్ అఫ్ ది ఇయర్ 2023 అవార్డు
- మానసిక నైపుణ్యాలను చెక్కుచెదరకుండా ఉంచండి అదే నిజమైన గణితం అని : రిటైర్డ్ ఐఏఎస్ డా. ఎస్ కె జోషి
వరంగల్ : పొన్నాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మ్యాథమెటిషన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం నిట్ వరంగల్ లోని అంబెద్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఐఏఎస్ డా. ఎస్ కె జోషి హాజరైయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ముఖ్య అతిథి చేతులమీదుగా ఖరగపూర్ ఐఐటి, మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్: జి.పి.రాజశేఖర్ కు మ్యాథమెటిషన్ అఫ్ ది ఇయర్ అవార్డు ప్రదానం చేసారు.
ఈ సందర్బంగా ముఖ్య అతిథి డా. ఎస్ కె జోషి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం గర్వాంగా ఉందన్నారు. మానసిక నైపుణ్యాలను చెక్కుచెదరకుండా ఉంచండి అదే నిజమైన గణితం అని తెలిపారు. గణితం శాస్త్రం అతి పురాతన మైనదని, గణితం లేకుండా ఇతర శాఖల ఉనికిని ఆలోచించలే మన్నారు. ఆధునిక మానవుడు సాధించిన అన్ని శాస్త్రయ సాంకేతిక పురోగతి అత్యధికంగా గణితంపై ఆధారపడి ఉందని ఇందులో భారతీయులు గణిత శాస్త్రానికి అపారమైన సహకారం అందించారని పేర్కొన్నారు. పూర్వ భారతీయులు గణిత శాస్త్రానికి మార్గదర్శకులని అయన ఈ సందర్బంగా గుర్తు చేసారు. పూర్వం సమయం తెలుసుకునేందుకు జామెట్రీ , ట్రిగ్నోమెట్రీ, కాల్కులస్ ను ఉపయోగించేవారని ఇప్పుడు మనం అదే ప్రక్రియను కొనసాగించగలమా అని ప్రశ్నించారు. మానసిక సామర్థ్యాలు నుండి యాంత్రికంగా మారాయి. మానసిక నైపుణ్యాలను చెక్కుచెదరకుండా ఉంచడమే నిజమైన గణితం అని తెలిపారు. గణితంలో భారతీయులు అగ్రగామిగా ఉన్నారని అందుకు సదా గర్విస్తామన్నారు. గణిత శాస్త్రానికి నాటి భారతీయులు చేసిన చేసిన కృషిని అయన వివరించారు.
పొన్నాల ఫౌండేషన్ , మాజీ మంత్రి పొన్నాల మాట్లాడుతూ గణితం సర్వయంతర్యామి అని అన్నారు. దాదాపు అన్ని శాస్త్రాలు గణితంతో ముడిపడి ఉంటదని అన్నారు. మ్యూజిక్ రాగం తాళం లోను గణితం ఉందని గుర్తు చేసారు. ప్రతిభ ఎవరికీ వారసత్వంగ రాదని కష్టపడి జ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు. తాను వృత్తిపరంగా రాజకీయవేత్త అని కానీ మానసికంగా గణితవేత్త అని తెలిపారు. అధ్యాపకుల ప్రేరణతో పాఠశాలకు మైళ్ళ కిలోమీటర్లు ప్రయాణం చేశామన్నారు. గణితం మీద మక్కువతో నాసా ఇంకా పలు సంస్థలలో పని చేశానని తెలిపారు. నేటి ఈ తరం భవిష్యత్ అని గణిత రంగం లో తమదైన గుర్తింపు తేవాలని అయన ఈ సందర్బంగా తెలిపారు.
అవార్డు గ్రహీత రాజశేఖర్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఏదైనా ఇష్టంగా నేర్చుకోవాలని అన్నారు. గణితం సైన్స్ భాష అని భాషను ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత బాగా కమ్యూనికేట్ చేయగలమన్నారు. గణితం కారణాన్ని విశ్లేషించడానికి మరియు తార్కికంగా వ్యక్తీకరించడానికి అవకాశాన్ని ఇస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఐటి డైరెక్టర్ ఎన్ వి రమణ రావు, రిజిస్ట్రార్ ఎస్. గోవర్ధన్ రావు, డీన్ వై .ఎన్ రెడ్డి, రాగ సుధా, పొన్నాల ఫౌండేషన్ సభ్యులు పొన్నాల అరుంధతి, పొన్నాల సుభోదన, ఈ. వి. శ్రీనివాస్ రావు, రిటైర్డ్ ప్రొఫెసర్ : పాండు రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నృత్య స్రవంతి : తాడూరు రేణుక ఆధ్వర్యంలో శిష్య బృందం నృత్యప్రదర్శన చేశారు.