అన్వేషించండి

Telangana News: ఢిల్లీ సుల్తాన్‌ల దాడులు తట్టుకొని నేటికీ ఠీవీగా నిలబడ్డ కాకతీయ కళాతోరణం హిస్టరీ తెలుసా?

Kakatiya Kala Thoranam : ఢిల్లీ సుల్తాన్‌లు పదే పదే దాడులు చేసినా... వాటన్నింటిని ధైర్యంగా ఎదుర్కొని ఠీవీగా నిలబడ్డాయి కాకతీయ కళాతోరణాలు. నేటికీ కాకతీయుల శక్తిసామర్థ్యాలు తెలియజేస్తున్నాయి.

Warangal News: కాకతీయులు పాలించిన సామ్రాజ్యంతోపాటు తెలంగాణకు గెట్‌వేగా మారింది కాకతీయ కళాతోరణం. కాకతీయుల రాజధాని వరంగల్ కోట శిల్పసంపద, చారిత్రక కట్టడాలతో పర్యాటక ప్రాంతంగా కొనసాగుతుంది. వరంగల్ కోటలో అనేక చారిత్రక కట్టడాలు ఢిల్లీ సుల్తాన్‌ల దాడుల్లో ధ్వంసమై నేలమట్టమయ్యాయి. కానీ కాకతీయుల స్వయంభూ దేవాలయానికి నాలుగు ద్వారాల ప్రారంభంలో నిర్మించిన కాకతీయ కళాతోరణాలు మాత్రం సుల్తానుల దాడుల్లో చెక్కు చెదరలేదు. 

Telangana News: ఢిల్లీ సుల్తాన్‌ల దాడులు తట్టుకొని నేటికీ ఠీవీగా నిలబడ్డ కాకతీయ కళాతోరణం హిస్టరీ తెలుసా?

తెలంగాణ రాష్ట్రంలో, వరంగల్‌లో ప్రముఖ పర్యాటక కేంద్రంగా, కాకతీయ సామ్రాజ్యం వైభవానికి నిదర్శనంగా వరంగల్ కోట నిలిచింది. క్రీ.శ 750 నుంచి 1323 వరకు కాకతీయుల సామ్రాజ్యం కొనసాగింది. దక్షిణ భారత దేశంలో అధిక భాగాన్ని పాలించిన కాకతీయుల హనుమకొండ, వరంగల్‌ను రాజధానిగా చేసుకొని పాలించారు. వరంగల్ రాజధానిగా చేసుకొని కాకతీయ రాజులు వారికి శక్తి సామర్థ్యాలను చాటుకోవడంతో పాటు, శత్రువుల నుంచి రక్షించుకోవడానికి భారీ కోట నిర్మించారు. గణపతి దేవుడి కాలంలో కోటను మరింత విస్తరించినట్లు చరిత్రకారులు చెబుతారు. కాకతీయులు శివ భక్తులు కావడంతో కోట ఆవరణలో స్వయంభు ఆలయంతోపాటు మరి కొన్ని ఆలయాలు నిర్మించారు. ఈ ప్రాంగణాన్ని స్వయంభూ దేవాలయ ప్రాంగణంగా పిలిచారు. ఈ ప్రాంగణానికి తూర్పు, పడమర, ఉత్తర, దక్షణం నాలుగు దిశలలో కాకతీయ కళాతోరణంగా పిలిచే నాలుగు అలంకార ద్వారాలు 80 అడుగుల ఎత్తుతో రాతి తో నిర్మించారు.  

Telangana News: ఢిల్లీ సుల్తాన్‌ల దాడులు తట్టుకొని నేటికీ ఠీవీగా నిలబడ్డ కాకతీయ కళాతోరణం హిస్టరీ తెలుసా?

రాజధాని.... నిర్మాణం.
వరంగల్ కోటపై ప్రతాపరుద్రుని కాలంలో ఢిల్లీ సుల్తాన్లు పదే పదే దండయాత్రలు చేశారు. ప్రతాపరుద్రుడిని బంధీగా చేసుకున్నారు. దీంతో వరంగల్ కోటను,  ప్రధానంగా ఆలయాలను ధ్వంసం చేశారు. దేవాలయాలను శిల్ప సంపదను నేలమట్టం చేశారు. అయితే నాలుగు దిక్కుల నిర్మించిన కళాతోరణాలుగా పిలుచుకునే ద్వారాలు మాత్రం అలానే ఉండిపోయాయి. కళతోరణంపై చెక్కిన్న రూపాలు, కాకతీయుల పాలన వైభవానికి నిదర్శనమని కొంతమంది చరిత్రకారులు చెబుతారు. తోరణానికి ఇరువైపుల గర్జించే సింహాలు, పైభాగంలో మొసలి, ఏనుగును పోలిన శిల్పాలు, తోరణం చివరలో రెండు వైపులా హంసలు కనిపిస్తాయి. ఈ కళాతోరణాలు మాత్రం ఢిల్లీ సుల్తాన్ల దాడులకు సాక్ష్యంగా నిలిచాయి. 

Telangana News: ఢిల్లీ సుల్తాన్‌ల దాడులు తట్టుకొని నేటికీ ఠీవీగా నిలబడ్డ కాకతీయ కళాతోరణం హిస్టరీ తెలుసా?

సుల్తాన్‌ల లక్ష్యం హిందూ దేవాలయాలు కాబట్టి మొదట దేవాలయాలను ధ్వంసం చేసి ఆపై శిల్ప సంపదని నాశనం చేశారని చరిత్రకారులు చెబుతున్నారు. తోరణాలపై హిందూ మతానికి సంబంధించిన గుర్తులు, దేవతామూర్తుల విగ్రహాలు లేవు కాబట్టి సుల్తానులు వీటిని ముట్టుకొక పోవచ్చని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. 

Telangana News: ఢిల్లీ సుల్తాన్‌ల దాడులు తట్టుకొని నేటికీ ఠీవీగా నిలబడ్డ కాకతీయ కళాతోరణం హిస్టరీ తెలుసా?

ద్వారమే.. కాకతీయ సామ్రాజ్యానికి ఐకాన్ గా మారింది

ఈ తోరణాలను చూడగానే కాకతీయ సామ్రాజ్యం, రుద్రమదేవి గుర్తుకు వస్తుంది. దక్షిణ భారతదేశంలో కాకతీయ సామ్రాజ్యానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. కాకతీయుల రాజధాని వరంగల్ కోటలో తోరణాలు ధ్వంసం కాకుండా ఉండడంతో కాకతీయులకు చిహ్నంగా మారాయి. నాలుగు ద్వారాలను గెట్ వేగా కాకతీయులు వీటిని నిర్మించిన కాలక్రమేణా   కాకతీయ కళాతోరణంగా, కీర్తితోరణంగా భావిస్తున్నారు. ఈ తోరణమే పర్యాటకులను ఆకర్షిస్తుంది. కోటలో కాకతీయులు నిర్మించిన ఆలయాలు, శిల్ప సంపద ధ్వంసం కాగా తోరణాలు కాకతీయుల కళ నైపుణ్యం, టెక్నాలజీకి నిదర్శనంగా నిలుస్తున్నాయి. కాకతీయ కీర్తితోరణాన్ని వారి సామ్రాజ్యం విసరించిన ప్రతి చోట నిర్మించారు. 

Also Read: డాక్టర్ పిలిస్తే క్యూ కడుతున్న చిలుకలు

Also Read: స్నేహితులనే సైన్యంగా చేసుకొని ఢిల్లీ సింహాసనాన్ని వణికించిన బెబ్బులి- తెలంగాణ శివాజీ గురించిన మీకు తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల జాతర - ఐదేళ్లలో రూ.65వేల కోట్లతో బయోగ్యాస్ ప్లాంట్ల పెట్టనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ !
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల జాతర - ఐదేళ్లలో రూ.65వేల కోట్లతో బయోగ్యాస్ ప్లాంట్ల పెట్టనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ !
Kannappa Release: డిసెంబర్‌లో రావట్లేదు... 2025లోనే కన్నప్ప - తిరుమలలో కీలక ప్రకటన చేసిన విష్ణు మంచు
డిసెంబర్‌లో రావట్లేదు... 2025లోనే కన్నప్ప - తిరుమలలో కీలక ప్రకటన చేసిన విష్ణు మంచు
Jio Vs Airtel: ఒక్క రూపాయి తేడాతో 28 జీబీ డేటా, 22 ఓటీటీ యాప్స్ - ఈ జియో, ఎయిర్‌టెల్  ప్లాన్లలో ఏది బెస్ట్?
ఒక్క రూపాయి తేడాతో 28 జీబీ డేటా, 22 ఓటీటీ యాప్స్ - ఈ జియో, ఎయిర్‌టెల్ ప్లాన్లలో ఏది బెస్ట్?
Janwada Farm House Case: జన్వాడ ఫాం హౌస్ కేసులో కీలక పరిణామం, విజయ్ మద్దూరికి లుకౌట్ నోటీసులు జారీ
జన్వాడ ఫాం హౌస్ కేసులో కీలక పరిణామం, విజయ్ మద్దూరికి లుకౌట్ నోటీసులు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ ఇలాకాలో ఇంటర్నెట్ బంద్, ఆ ఊర్లో ఉద్రిక్తతలుఅసభ్య పోస్ట్‌ల వెనక అవినాష్ రెడ్డి! ఆయనదే కీలక పాత్ర - డీఐజీSri Lankan Airlines Ramayana Ad | రామాయణంపై శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ యాడ్ | ABP DesamKhalistani Terrorist Threatens Attack On Ram Mandir | రామ మందిరంపై దాడికి కుట్ర | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల జాతర - ఐదేళ్లలో రూ.65వేల కోట్లతో బయోగ్యాస్ ప్లాంట్ల పెట్టనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ !
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల జాతర - ఐదేళ్లలో రూ.65వేల కోట్లతో బయోగ్యాస్ ప్లాంట్ల పెట్టనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ !
Kannappa Release: డిసెంబర్‌లో రావట్లేదు... 2025లోనే కన్నప్ప - తిరుమలలో కీలక ప్రకటన చేసిన విష్ణు మంచు
డిసెంబర్‌లో రావట్లేదు... 2025లోనే కన్నప్ప - తిరుమలలో కీలక ప్రకటన చేసిన విష్ణు మంచు
Jio Vs Airtel: ఒక్క రూపాయి తేడాతో 28 జీబీ డేటా, 22 ఓటీటీ యాప్స్ - ఈ జియో, ఎయిర్‌టెల్  ప్లాన్లలో ఏది బెస్ట్?
ఒక్క రూపాయి తేడాతో 28 జీబీ డేటా, 22 ఓటీటీ యాప్స్ - ఈ జియో, ఎయిర్‌టెల్ ప్లాన్లలో ఏది బెస్ట్?
Janwada Farm House Case: జన్వాడ ఫాం హౌస్ కేసులో కీలక పరిణామం, విజయ్ మద్దూరికి లుకౌట్ నోటీసులు జారీ
జన్వాడ ఫాం హౌస్ కేసులో కీలక పరిణామం, విజయ్ మద్దూరికి లుకౌట్ నోటీసులు జారీ
Chandrababu Class To MLAs: బూతులు మాట్లాడారో! మీ కెరీర్ ఖతం : ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్
బూతులు మాట్లాడారో! మీ కెరీర్ ఖతం : ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్
Telangana News: త్వరలో రేవంత్, పొంగులేటి పదవులు పోతాయి- ఢిల్లీలో కేటీఆర్ సంచలన కామెంట్స్
త్వరలో రేవంత్, పొంగులేటి పదవులు పోతాయి- ఢిల్లీలో కేటీఆర్ సంచలన కామెంట్స్
Skoda Kylaq vs Tata Nexon: స్కోడా కైలాక్ వర్సెస్ టాటా నెక్సాన్ - రెండు ఎస్‌యూవీల్లో ఏది బెస్ట్?
స్కోడా కైలాక్ వర్సెస్ టాటా నెక్సాన్ - రెండు ఎస్‌యూవీల్లో ఏది బెస్ట్?
YS Sharmila: ఆ ప్రచారం వెనుక ఉన్నది జగనే -  షర్మిల  సంచలన ఆరోపణలు
ఆ ప్రచారం వెనుక ఉన్నది జగనే - షర్మిల సంచలన ఆరోపణలు
Embed widget