Mahabubabad Police: నేను తలుచుకుంటే డిస్మిస్‌ చేయిస్తా- ఎస్సైపై మాజీ మంత్రి తిట్ల పురాణం

పెరిగిన పెట్రోల్, డీజిల్‌ ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ చేపట్టన ధర్నా కొన్ని చోట్ల ఉద్రిక్తతకు దారి తీసింది. మహబూబాబాద్‌ జిల్లాలో పోలీసులపైనే మాజీ మంత్రి తిట్ల దండకం అందుకున్నారు.

FOLLOW US: 

మహబూబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ యత్నించింది. దీన్నిపోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.  దీంతో కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వదం నడిచింది. కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 

కార్యకర్తలను అడ్డుకోవడం వారిపై దురుసుగా ప్రవర్తించారని చెప్పి డ్యూటీలో ఉన్న ఎస్సైపై విరుచుకు పడ్డారు మాజీ మంత్రి బలరాం నాయక్. అసభ్య పదజాలంతో దూషించారు. వారి ఇద్దరి మధ్య కొదిసేపు  మాటల యుద్ధం జరిగింది. తలుచుకుంటే డిస్మిస్ చేయిస్తానంటూ రెచ్చిపోయారు. 

వెంటనే స్థానిక సిఐ జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం కాంగ్రెస్ శ్రేణులు కలెక్టర్ కార్యలయానికి ర్యాలీగా వెళ్లి అదనపు కలెక్టరేేకు వినతిపత్రం అందచేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల  ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచుతూ, ప్రజల నడ్డి విరుస్తున్నాయని మండిపడ్డారు బలరాం నాయక్. ధాన్యం కొనుగోలు  విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లకు ప్రయోజనం చేకూర్చే ఉద్దేశ్యంతో రైతుల జీవితాలతో చెలగాటం అడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భేషరతుగా పండిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 

వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కలిసి వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేశారు. కేంద్ర ప్రభుత్వాలు వ‌ర‌ుస‌గా పెట్రోల్‌, డిజిల్, గ్యాస్ ధ‌ర‌లు పెంచుతుండ‌డంతో ప్రజలపై ఆర్థిక భారం పడుతోందన్నారు కాంగ్రెస్ నాయకులు. 5 రాష్ట్రాల‌్లో ఎన్నిక‌లు ఉండ‌డంతో 137 రోజుల పాటు ఆయిల్ ధ‌ర‌లు పెంచ‌ని కేంద్రం ఎన్నిక‌లు పూర్తైన తర్వాత బాదుడు మొదలు పెట్టిందన్నారు.

13 రోజుల‌లో 12 సార్లు పెట్రోల్‌, డిజిల్ ధ‌ర‌లు పెంచింది.  గ్యాస్ ధ‌ర‌లు అడ్డగోలుగా పెంచ‌డంతో సామాన్యులు భ‌రించ‌లేని ప‌రిస్థితులు నెల‌కొన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇష్టారాజ్యంగా విద్యుత్ ఛార్జీలు పెంచుతోందని మండిపడ్డారు నేతలు. దీనికి తోడు వరి ధాన్యంపై రెండు ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. వెంటనే రైతులు పండించిన ప్రతి గింజ ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. 

ఖమ్మం జిల్లాలోనూ కాంగ్రెస్‌ శ్రేణలు రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేశాయి. కలెక్టరేట్ ముట్టడించాయి. పెంచిన పెట్రోల్‌, డిజిల్‌, వంట గ్యాస్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌ ముట్టడించారు పార్టీ కార్యకర్తలు. ఈసందర్బంగా పోలీసులకు కాంగ్రెస్‌ కార్యాకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు గాయపడ్డారు. 

Published at : 06 Apr 2022 05:22 PM (IST) Tags: CONGRESS Telangana Congress Power Tariffs Hike

సంబంధిత కథనాలు

Bhadrachalam ఎక్సైజ్‌ పోలీస్‌ వాహనాన్ని ఢీకొట్టిన కారు - పోలీసుల ఛేజింగ్‌తో చివరకు ఊహించని ట్విస్ట్

Bhadrachalam ఎక్సైజ్‌ పోలీస్‌ వాహనాన్ని ఢీకొట్టిన కారు - పోలీసుల ఛేజింగ్‌తో చివరకు ఊహించని ట్విస్ట్

Petrol Diesel Price 21th May 2022 : తెలుగు రాష్ట్రాలో స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు, ఇవాళ్టి రేట్స్ ఇలా

Petrol Diesel Price 21th May 2022 : తెలుగు రాష్ట్రాలో స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు, ఇవాళ్టి రేట్స్ ఇలా

Petrol Diesel Price 20th May 2022 : తెలుగు రాష్ట్రాలో నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా

Petrol Diesel Price 20th May 2022 : తెలుగు రాష్ట్రాలో నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా

Tractor overturned: వరంగల్ జిల్లాలో విషాదం, పెళ్లి బట్టల షాపింగ్‌కు వెళ్తూ మృత్యుఒడికి - ట్రాక్టర్ బోల్తాపడి ఐదుగురి మృతి

Tractor overturned: వరంగల్ జిల్లాలో విషాదం, పెళ్లి బట్టల షాపింగ్‌కు వెళ్తూ మృత్యుఒడికి - ట్రాక్టర్ బోల్తాపడి ఐదుగురి మృతి

Petrol-Diesel Price, 14 May: వాహనదారులకు పెట్రో షాక్ ! ఇవాళ చాలా చోట్ల పెట్రోల్ ధరలు పెరుగుదల, ఇక్కడ మాత్రం స్థిరం

Petrol-Diesel Price, 14 May: వాహనదారులకు పెట్రో షాక్ ! ఇవాళ చాలా చోట్ల పెట్రోల్ ధరలు పెరుగుదల, ఇక్కడ మాత్రం స్థిరం

టాప్ స్టోరీస్

Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం

Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు

TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు

Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!

Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!