News
News
వీడియోలు ఆటలు
X

Ponnam Prabhakar: అదానీ ఓ దొంగ, ఆయనకు ప్రధాని మద్దతు ఎందుకు? - ప్రశ్నిస్తూనే ఉంటామన్న పొన్నం

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, దేశవ్యాప్తంగా నేతల హాత్ సే హాత్ అభియాన్ యాత్రతో బీజేపీలో వణుకు మొదలైందన్నారు మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్.

FOLLOW US: 
Share:

Ponnam Prabhakar Supports Rahul Gandhi: హనుమకొండ జిల్లా: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తారనే ఆయనపై బీజేపీ కక్షగట్టి వేధిస్తోందని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, దేశవ్యాప్తంగా నేతల హాత్ సే హాత్ అభియాన్ యాత్రతో బీజేపీలో వణుకు మొదలైందన్నారు. ప్రపంచ కుబేరులలో ఒకరైన గౌతం అదానీ ఆస్తులపై రాహుల్ గాంధీ పార్లమెంట్ లో నిలదీసినందుకే బీజేపీ కక్షసాధింపు చర్యలకు పాల్పడిందన్నారు. 

రికార్డుల నుండి వివరాలు తొలగించారు
ఆదాని గురించి పార్లమెంటులో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు ప్రస్తావించినట్టు ఉండకుండా రికార్డుల నుండి తొలగించారని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. స్పీకర్ గింతునొక్కి, రాజకీయ కక్షసాధింపుతో రాహుల్ గాంధీని పార్లమెంట్ నుండి బహిష్కరించారండూ మండిపడ్డారు. పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీని ఎదుర్కోలేక ప్రధాని మోదీ నీచమైన చర్యకు దిగజారారన్నారు. ఆదానీ ఓ దొంగ అని, అలాంటి వ్యక్తికి ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు ఇవ్వడంపై ప్రశ్నించారు. 

బీసీలకు ఆదానీకి సంబంధం ఏంటి?
బీజేపీ జాతీయ నేత, ఎంపీ లక్ష్మణ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు సిగ్గు, శరం ఉందా అంటూ మండిపడ్డారు. అసలు బీసీలకు, అదానీకి సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ బలహీన వర్గాలకు క్షమాపణ ఎందుకు చెప్పాలో అర్థం కావడం లేదన్నారు. ప్రపంచ కుబేరుడు ఆదానీ ఆస్తులు, అప్పులు, బ్యాంకుల రాయితీలపై తాము ప్రశ్నిస్తూనే ఉంటాం అన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్.

భట్టి విక్రమార్క పాదయాత్ర.. 
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో 16 రోజు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతోంది. బెల్లంపల్లి N2 గ్రౌండ్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర లంబడి తండా తాళ్ల గురజాల, మాల గురజాల, బట్వాన్పల్లి, పెరకపల్లి, గుండ్ల  సోమవారం, నార్వాయిపేట, మెట్పల్లి గ్రామాల్లో కొనసాగింది. బెల్లంపల్లి నుంచి బట్వాన్పల్లికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నడుచుకుంటూ వస్తుండగా  మార్గమధ్యంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్  విద్యార్థులు ఎదురొచ్చి కళాశాలలో ఉన్న సమస్యలను చెప్పుకున్నారు. 800 మంది విద్యార్థులు ఉన్న ఈ కళాశాలలో వాష్రూమ్స్, లైబ్రరీ, ల్యాబ్, గ్రౌండ్, మంచినీటి వసతి లేవని, గ్రామీణ ప్రాంతాల నుంచి కళాశాలకు వచ్చే విద్యార్థులకు బస్సు సౌకర్యం కూడా లేకపోవడం వల్ల నడుచుకుంటూ వస్తున్నామని విద్యార్థులు నవ్య కోటేశ్వరి ఆవేదన చెందారు. సుమారు 60 కిలోమీటర్ల నుంచి వస్తున్న తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. 

ప్రభుత్వ డిగ్రీ కళాశాల తో పాటు పీజీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు. బెల్లంపల్లిలో పీజీ కళాశాల లేకపోవడంతో తమ తల్లిదండ్రులు హైదరాబాద్ వరంగల్ మంచిర్యాల పంపించడానికి సరైన ఆర్థిక స్తోమత లేనందున డిగ్రీతోనే చదువులు కాపాల్సి వస్తుందని శ్రీలత అనే విద్యార్థి వచ్చి బతికి మొరపెట్టుకున్నది. కళాశాలలో అధ్యాపకులు సైతం లేరని గెస్ట్ లెక్చరర్స్ బోధిస్తున్నారని చెప్పారు. ఈ కళాశాలలో చదివి బీసీ ఎస్సీ హాస్టల్ విద్యార్థులు తమ వసతి గృహాల్లో వాటర్ ఫెసిలిటీ లేకపోవడం ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పకుండా పిజి కళాశాల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే విద్యా వైద్యానికి ప్రాధాన్యత దొరికిందని బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వేంటనే రాష్ట్రంలో కొత్త కాలేజీలు ఏర్పాటు చేయలేదని విమర్శించారు.

విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ తాను ప్రత్యేకంగా లేఖ రాస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు. తాళ్ల గురజాల గ్రామానికి చేరుకున్న భట్టి విక్రమార్క వద్దకు బాదం వెంకటలక్ష్మి అనే మహిళ వచ్చి పాముకాటుతో తన కాలు తీసివేసిన తనకు వికలాంగుల కోటాలో పెన్షన్ రావడంలేదని ఆవేదన వెల్లడిచ్చింది.

Published at : 31 Mar 2023 04:19 PM (IST) Tags: CONGRESS Narendra Modi Ponnam Prabhakar Telangana Rahul Gandhi

సంబంధిత కథనాలు

Top 10 Headlines Today: నేటి నుంచి ఆసీస్‌, ఇండియా మధ్య గధాయుద్ధం, ఇది సినిమా కాదు ఎమోషన్ అంటున్న ప్రభాస్‌

Top 10 Headlines Today: నేటి నుంచి ఆసీస్‌, ఇండియా మధ్య గధాయుద్ధం, ఇది సినిమా కాదు ఎమోషన్ అంటున్న ప్రభాస్‌

Inter Results: తెలంగాణ ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్స్ ఇవే!

Inter Results: తెలంగాణ ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్స్ ఇవే!

Group1: గ్రూప్‌-1 పరీక్షపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ, ప్రతివాదులకు నోటీసులు జారీ!

Group1: గ్రూప్‌-1 పరీక్షపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ, ప్రతివాదులకు నోటీసులు జారీ!

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Nagar Kurnool: నాగర్ కర్నూల్‌లో సీఎం కేసీఆర్ టూర్ - కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్ ప్రారంభం

Nagar Kurnool: నాగర్ కర్నూల్‌లో సీఎం కేసీఆర్ టూర్ - కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్ ప్రారంభం

టాప్ స్టోరీస్

YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

YS Viveka Case :  అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి -   సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?