అన్వేషించండి

Covid Patient Suicide: ఆస్పత్రి బిల్డింగ్ పైనుంచి దూకేసిన కరోనా బాధితుడు.. ఎంజీఎంలో చికిత్స పొందుతూనే..

కరోనా వార్డులో చికిత్స పొందుతున్న ఓ పేసెంట్ ఆస్పత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్‌లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

కరోనా కేసులు తగ్గుతున్న వేళ వరంగల్‌లో ఓ కొవిడ్19 బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొన్ని రోజులుగా నగరంలోని ఎంజీఎం ఆస్పత్రిలోని కరోనా వార్డులో అతడు చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో అదే ఆస్పత్రి భవనంలోని రెండో అంతస్తు పైనుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఆస్పత్రి సిబ్బంది ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వ్యక్తి ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు, ఈ నెల 24న వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలానికి చెందిన ఆటో డ్రైవర్ కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరాడు. మరుసటి రోజు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడం వల్ల ఎంజీఎం ఆస్పత్రిలోని కరోనా విభాగంలో చేరి చికిత్స పొందుతున్నాడు. తనకు ఎంతకీ కరోనా లక్షణాలు తగ్గడం లేదని భయాందోళనకు గురయ్యాడు. తీవ్ర మనస్తాపానికి లోనైన బాధితుడు ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మరోవైపు, తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. జులై 29 నాడు రాష్ట్రంలో 623 కరోనా కేసులు న‌మోద‌వ్వగా, ముగ్గురు మృతిచెందారు.  రాష్ట్రంలో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 6,43,716 కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఇందులో 6,30,732 మంది కోవిడ్ బారి నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 9,188 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక, క‌రోనాతో రాష్ట్రంలో ఇప్పటి వ‌ర‌కు 3,796 మంది మృతి చెందిన‌ట్టు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 746 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

కాగా, తెలంగాణలో నమోదవుతున్న కేసుల్లో దాదాపు 50 శాతం కేసులు కేవలం నాలుగు జిల్లాల నుంచి వస్తున్నాయి. జీహెచ్ఎంసీ, రంగారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 70, కరీంనగర్‌ జిల్లాలో 68, వరంగల్ అర్బన్ జిల్లాలో 67, రంగారెడ్డి జిల్లా పరిధిలో 43 కేసుల చొప్పున నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 5, భద్రాద్రి కొత్తగూడెంలో 17, జీహెచ్ఎంసీలో 70, జగిత్యాలలో 27, జనగామలో 8, జయశంకర్ భూపాలపల్లిలో 3, జోగులాంబ గద్వాలలో 1, కామారెడ్డిలో 3, ఖమ్మంలో 51, కొమురంభీం ఆసిఫాబాద్‌లో 3, మహబూబ్‌నగర్‌లో 6, మహబూబాబాద్‌లో 16, మంచిర్యాలలో 16, మెదక్‌లో 4, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 29, సిద్దిపేటలో 17, సూర్యాపేటలో 21, వికారాబాద్‌లో 5, ములుగులో 7, నాగర్ కర్నూలులో 4, నల్గొండలో 38, నిర్మల్‌లో 1, నిజామాబాద్‌లో 7, పెద్దపల్లిలో 43, రాజన్న సిరిసిల్లలో 18, సంగారెడ్డిలో 5, వనపర్తిలో 3, వరంగల్ రూరల్‌లో 13, యాదాద్రి భువనగిరిలో 14 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

Also Read: Bhuvanagiri: ఎమ్మెల్యే రాజీనామాకు తెగ డిమాండ్.. అనుకున్నది అయిపోతుంది.. ఫ్లెక్సీలు కలకలం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
IRCTC Compensation : ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Notice to Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు, శుక్రవారం పీఎస్‌లో విచారణ
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు, శుక్రవారం పీఎస్‌లో విచారణ
Embed widget