![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Errabelli Dayakar Rao: ఈ 27న మహబూబాబాద్ లో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఈ నెల 27న సీఎం కేసీఆర్ మహబూబాబాద్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏర్పాట్లను పరిశీలించి మీడియాతో మాట్లాడారు.
![Errabelli Dayakar Rao: ఈ 27న మహబూబాబాద్ లో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు CM KCR will hold a huge public meeting with 70 thousand people in Mahabubabad, Minister Errabelli Dayakar Rao Errabelli Dayakar Rao: ఈ 27న మహబూబాబాద్ లో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/22/65ef8b0ce8117cc4fa98c95e947f11471697978226695801_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఈ 27న తేదీన మధ్యాహ్నం 2 గంటలకు మహబూబాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరవుతారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ సభను దాదాపు 70 వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారని చెప్పారు. మహబూబాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..... " రాహుల్ సభకు ప్రజలు రాలేదు. కాబట్టే రోడ్ షోలు పెట్టి కాలం వెళ్లదీస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్, ఒక చీటర్, రేవంత్ రెడ్డి అన్ని పార్టీలను ముంచుతూ వస్తున్నాడని" ఎర్రబెల్లి అన్నారు.
సబ్బండ వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేసిన గొప్ప సీఎం కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో ను రాష్ట్ర ప్రజలందరూ స్వాగతిస్తున్నారని దయాకర్ రావు చెప్పారు. కేంద్రం అనేక అవరోధాలు సృష్టించినా, రాష్ట్ర ప్రగతిని ఆపని గొప్ప సీఎం కేసీఆర్ అని కొనియాడారు. రాష్ట్రం లోని బీఅర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని దయాకర్ రావు రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రజలకు భరోసా కల్పిస్తూ పాలన సాగించాం. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో కూడా తెలంగాణ తలసరి ఆదాయం లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టు పనులన్నీ 30, 40 ఏళ్లు దాటినవేనని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కేవలం మూడున్నర ఏండ్లలో పూర్తి చేసి సాగు నీరు అందజేశామని పేర్కొన్నారు. అత్యంత వేగంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిని సాధించింది. రాష్ట్రంలో ప్రజలకు ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అభివృద్ధిలో దాపరికం లేదు. వ్యవసాయం కోసం నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసిన ప్రభుత్వం దేశంలో ఒక్క తెలంగాణ ప్రభుత్వమేనని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పాలనా అంతా అంతా మోసపూరితమేనని మండిపడ్డారు. దేంలోని సమస్యలన్నింటికి ఆ పార్టీనే కారణమని ఆరోపించారు. ఆ పార్టీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధానాన్ని అనుసరిస్తూ ప్రజలను మోసం చేస్తుందన్నారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల విద్యుత్, రుణమాఫీ, సబ్సిడీపై పనిముట్లు, సకాలంలో ఎరువులు, దళితబంధు, బీసీ బంధు, డబుల్‌బెడ్రూం ఇండ్లు, కులవృత్తులకు లక్షరూపాయల ఆర్థిక సహాయం తదితర సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవన్నారు. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో తొమ్మిదేండ్ల కాలంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ది చెంది, దేశానికి తలమానికంగా మారిందని ఎర్రబెల్లి అన్నారు.
సీఎం కేసీఆర్ మహబూబాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ఇంజినీరింగ్ కాలేజ్, హార్టికల్చర్ కాలేజ్ వంటి ఎన్నో అభివృద్ధి పనులతో ముందుకు తీసుకెళ్లామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి రెండు నెలలు కావస్తున్నది. కానీ, ప్రతిపక్షాలకు ఇప్పటికీ కూడా అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీ అభ్యర్థులను ఢిల్లీ నిర్ణయిస్తుందని, ఆ రెండు పార్టీలు ఓట్లు అడగాలంటే ఢిల్లీ నుంచి నాయకులు రావాలి. ఇటీవల ములుగులో నిర్వహించిన రాహుల్ గాంధీ సభ అట్టర్ ప్లాప్ అయ్యిందన్నారు.
ఈ కార్యక్రమంలో మరో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, జెడ్పీ చైర్ పర్సన్ కుమారి అంగోత్ బిందు, తదితరులు పాల్గొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)