BRS Leaders: ఏంపీ, ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం - ఫోన్ లో తిట్టుకుంటున్న బీఆర్ఎస్ నేతలు, ఆడియో వైరల్
BRS Leaders: బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంపీ పోతుగంటి రాములు మధ్య వార్ కొనసాగుతుంది. తాజాగా వీరిద్దరి తిట్టుకుంటున్న ఓ ఆడియో నెట్టింట వైరల్ గా మారింది.
BRS Leaders: బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ప్రజా ప్రతినిధుల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. ఫోన్ చేసుకొని ఎంపీ, ఎమ్మెల్యేలు ఒకరినొకరు బెదిరించుకున్నట్లుగా భావిస్తున్న ఓ ఆడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఆ ఆడియోలో ఉన్న వాయిస్ లలో ఒకరు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కాగా మరొకరు ఎంపీ పోతుగంటి రాములు గొంతు తరహాలో ఉంది. అయితే ఈ ఆడియో వింటేనే అర్థం అవుతుంది నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో రాజకీయాలు ఎంత రసవత్తరంగా సాగుతున్నాయో, ఫ్లెక్సీల విషయంలో ఈ ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది.
ఎమ్మెల్యే, ఎంపీల మధ్య ఫోన్ సంభాషణ
ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంపీ పోతుగంటి రాములుకు ఫోన్ చేసి.. నియోజక వర్గంలో నీ కొడుకు ఫ్లెక్సీలు కట్టడానికి వీల్లేదని చెప్పారు. దీంతో ఎవరి స్వేచ్ఛ వారికే ఉంటుందని బాలరాజు అనగా.. పార్టీలో ఉండదట్ల అని గువ్వల అన్నారు. దీనికి పోతుగంటి అయితే పార్టీలోనే తేల్చుకుందామని చెప్పారు. ఫైర్ అయిన గువ్వల నాకున్న అధికారాన్ని నేను ఉపయోగిస్తానంటూ కామెంట్లు చేశారు. పోతుగంటి కూడా నేను జిల్లా అధ్యక్షడిగా పని చేశా.. నాకు తెలుసూ, నీకిచ్చే గౌరవం నీకిస్తా.. నాకిచ్చే గౌరవం నాకుంటది. చేసేది చేసి అంతా అయిపోయింది అంటే ఎట్లా అని ప్రశ్నించారు. అందులో సంబంధం ఉందంటే భవిష్యత్తులో కూడా చేస్తానంటూ గువ్వల అన్నారు. చేసుకోవయ్యా నేనొద్దన్నానా అంటూ పోతుగంటి ఫైర్ అయ్యారు. వయా గియా అని మాట్లాడకు, మంచిగ మాట్లాడు, సర్ అని పిలుస్తుంటే వయా అంటవ్, అటెండర్ మాట్లాడినట్లు మాట్లాడాతవ్ అంటూ గువ్వల బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయ్యా బాలరాజు గారు మీరు చేసేది చేస్కోండి..
వయా అంటే ఏంది అర్థం, అయ్యా బాల్ రాజు గారు, మీరు చేసేది చేసుకోండి, దాని గురించి ఎందుకంత కోపం అంటూ పోతుగంటి అన్నారు. ఇక నుంచి నీ కొడుకు పార్టీ ఫ్లెక్సీలు కట్టడానికి వీళ్లేదు, ఈరోజు, రేపు తీసేయండి అటూ గువ్వల తెలిపారు. అంటే, అంటే.. నీ బెదిరింపులు నాకడ పనికి రావని రాములు తెలిపారు. రికార్డు చేసుకో, ఎవరికైనా చెప్పుకో, అట్లే చేస్తే నీ కొడుక్కి పార్టీ పరంగా మర్దాయ ఉండదని గువ్వల అన్నారు. నా కొడుకు నాకు సహకారంగా ఉంటడు, ఎవరి కొడుకు వారు సహకారంగా ఉంటడు, మరి నీ కుటుంబ సభ్యుల ఫ్లెక్సీలు ఎందుకు పెట్టారని పోతుగంటి ప్రశ్నించగా.. మా అభిమానులు కట్టారని గువ్వల చెప్పారు. మాకూ అభిమానులే కట్టారని పోతుగంటి అనగా.. ఇలా చేస్తే మంచిగుండదని గువ్వల అన్నారు. దీనికి పోతుగంటి నీ బెదిరింపుల నా వద్ద చెల్లవు.. ఈ విషయం అధిష్టానం వద్దే చూసుకుందామని స్పష్టం చేశారు.
ఈ ఆడియో విన్న నెటిజెన్లు.. ప్రజాప్రతినిధులే ఇలా చేస్తుంటే మామూలు కార్యకర్తలు ఎలా ప్రవర్తిస్తారని అంటున్నారు. ఇలా మాట్లాడుతూ.. చిన్నచిన్న వాటికే గొడవ పడితే నేతలతో పాటు పార్టీ పరువు కూడా పోతుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.